ప్రధానమంత్రికి జగన్ లెటర్..పట్టించుకోని ఆ ఛానల్..పచ్చదనం పరిఢవిల్లుతుందనడానికి ఇదే నిదర్శనం

 

విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు నినాదం మెల్లగా ఆంద్రాని ఊపేస్తున్న వేళ..దానికి సంబంధించిన అప్ డేట్ ఏది వచ్చినా న్యూస్ ఛానల్స్ అస్సలు వదిలిపెట్టవ్..అందులోనూ ఏపీ సిఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రియాక్ట్ అయ్యారంటే దానికెంత ప్రాథాన్యం ఇవ్వాలి..ఎస్..ఇచ్చాయ్ అన్నీ  ఛానళ్లూ 8.30 నుంచే బ్రేకింగ్స్ మొదలెట్టేశాయ్..వైఎస్  జగన్ , మోదీకి లెటర్ రాశారని..స్టీల్ ప్లాంట్ ఎలా రన్ చేయవచ్చో..లాభాల్లోకి తెచ్చే మార్గాలేంటో వివరిస్తూ..అమ్మేసేయాలనే ప్రతిపాదన తిరిగి ఆలోచించండంటూ లేఖలో రాసినట్లు చెప్పుకొచ్చాయ్. రైట్..కానీ ఆ రెండు మూడు ఛానళ్లకి మాత్రం ఇది పట్టలేదు..ప్రత్యేకించి అదే పనిగా ఉద్యమంలా జగన్ వ్యతిరేక భావజాలాన్ని పోషించే సదరు ఛానల్ మరీనూ..! 

అందులోనూ స్టీల్ ప్లాంట్ విక్రయంపైనే చర్చ నడుపుతూ కూడా కిందా పైనా..పడి సంస్థని లాభాల్లోకి తెచ్చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రయోక్తకి ఇది ఏ మాత్రం పట్టలేదు..ఏదున్నా ఫ్యాక్ట్ పట్టుకుని మాట్లాడతా..ఆధారాల్లేకపోతే ఏదీ మాట్లాడను అంటున్నాడే తప్ప సిఎం జగన్ లేఖ రాసినట్లు కనీసం రాత్రి 10.30 వరకూ  కూడా కింద స్క్రోలింగ్ కానీ..పైన బ్రేకింగ్ కానీ ఏదీ లేదు..అంటే ఇక్కడే అర్ధమవుతోంది..( అందరికీ తెలుసు, మళ్లీ ఈ పదం అనవసరం) నాకు సిఎం వార్తలు వద్దంటే వద్దు..అతనికి వ్యతిరేక వార్తలు మాత్రమే ఇచ్చట ప్రసారం చేయబడును అనేదే పాలసీగా పెట్టుకున్నట్లు తేలిపోయింది..మరి ఇలాంటి సిచ్యుయేషన్లో ఇలాంటి ఛానల్ కి సదరు ప్రభుత్వం ప్రకటనలను ఇస్తుందా..అందులోనూ ఆ సిఎం పరమ ప్రతీకారవేత్త అని వీళ్లే చాటింపు వేస్తున్నప్పుడు ఆ పేరైనా నిలుపుకుంటాడు కదా..!

Comments