చంద్రబాబుగారూ జనాలకు సిగ్గూ,శరం, పౌరుషం అన్నీ ఉన్నాయ్ అందుకే జనసేన జాడ లేదు, బొత్తిగా కూడా బిజెపి లేదు..మరి మీ సంగతేంటో మీకే తెలియాలి?




 మూడు రాజధానులు..విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, అమరావతి ఉద్దమం, జగన్ అవినీతి అంటూ రకరకాలుగా

అధికారపక్షంపై పడి ఎలాగంటే అలాగ విమర్శించిన పార్టీలకు పెద్ద షాక్..అలాంటి ఇలాంటి షాక్ కాదు..75 మున్సిపాలిటీలకు 71, 12 కార్పోరేషన్లకి 11 ఇంతకంటే గెలుపు ఉంటుందా..? 

ప్రచారంలో చంద్రబాబుగారు ఏం మీకు సిగ్గు లేదా, పౌరుషం లేదా..ఈ రాష్ట్రమంటే నా ఒక్కడికే పట్టిందా. మీరు పట్టించుకోరా  పోరాటం చేయరా అంటూ పౌరుషాన్ని తట్టి లేపినందుకేనా ఈస్థాయి ఫలితం..


చిన్నా చితకాఛానళ్లలో జనసేన లేచింది..ఇక ఇరగదీస్తది..ఎయ్ ఎవడోయ్..శతకోటి లింగాల్లో బోడి లింగంం  నాని నాతో పెట్టుకోవద్దు..ఏయ్. అసెంబ్లీని ముట్టడిస్తా అంటూ ఒకాయన పొలికేక పెట్టాడు .ఇక 15 నుంచి అసెంబ్లీ ఏం కేక పెడతాడో ఇక పెట్టించమనండి.. బిజెపి రాష్ట్రమంతా దున్నేస్తది చూస్కోండి మా సత్తా అంటూ చిటికెల పందిరేసిన ఓ తురాజు

ఇప్పుడుెక్కడ..అన్నట్లు మనకో రాజు ఉన్నాడు..అతగాడికి ఇక పండగే పండగ ఎందుకంటే ఓ రెండు ఛీనళ్లు అతగాడితో లైవులు గట్రా పెట్టేస్థాయ్ గా

అదికాదు..చెప్పుకోవాల్సింది..విజయవాడ, వైజాగ్ , గుంటూరు, మంగళగిరి, తెనాలి, ఇవన్నీ కీలకం జనంలో తిరుగుబాటు వస్తుందంటూ ఓ పబ్బంహరి తెగ బీరాలు పోయేవాడు..అతగాడి మొహం చూడాలిప్పుడు..అంటే మీ అమరావతి మీకే ఉంచుకోండి..మాకు అక్కర్లేదని జనం తిరగ్గొట్టేసినట్లేనా

టిడిపి పాపం పూర్తిగా నేలమట్టం అయినట్లేనా..లేక ఇది కేవలం నాయకత్వ లోపమా ఆలోచించుకోవాల్సిన తరుణం. ఎందుకంటే, అన్ని రకాల ఎన్నికల్లో జీరో అయినా టిడిపి ఓట్ బ్యాంక్ శాశ్వతం అది పదిలం ఎంతో కమ్మదనం అలాంటి పార్టీకి జీవం పోయాలంటే కొత్తగా ఆలోచించాలి బాబుగారూ..అంతే 

Comments