పార్టీని అభినవ రాకీకి అప్పగించండి ప్లీజ్.! బాబుగారు విలువలనే పట్టుకుని వేలాడుతున్నారట వాటే జోక్

 


మంచి మసాలా అందించడంలో అతనికి అతనే సాటి, వార్తాపత్రికల పఠనం పూర్తిగా పార్టీల ప్రచారంగా మారిపోయిన వేళ కాస్తో, కూస్తో కాలక్షేపం బఠానీగా మారిన పత్రికేదైనా ఉందంటే అదే అది! తనకి తాను అభినవ నారదుడిగా ఊహించుకుంటూ, ప్రతిసారీ..కొత్త వ్యాక్యాలలో తన ఆశలను ఆకాంక్షలను వెల్లిబుచ్చే సదరు వారాంతపు వక్రతుండంలో ఈసారి మరిన్ని ముత్యాలు జాలువారాయ్. ఆ జాతి రత్నాలను తలుచుకుంటే పొగిలి పొగిలి ఆనందభాష్పాలు రాల్చాలని ఉంది.

డబ్బెట్టి కొనే చదువరి మొహం మీద చెప్పెట్టి కొట్టినట్లుగా తన అభిమాన రాజకీయాలకు చిడతలు వాయించడంలో ఏ మాత్రం భేషజం, సిగ్గు చూపించని రాతగాళ్లలో ఆయన దిట్ట. కాకపోతే చూడండి. ఓ పార్టీ అధినేతపై మరో ఫలానా పార్టీ కేసు పెడితే, అదెలాగ తప్పో ఈయనే చెప్తారు. అదసలు నిలబడనే నిలబడదంటాడు. పైగా అందరూ జైలుకి వెళ్లి రండి అంటూ తానేదో లోకోత్తరమైన పిలుపు ఇచ్చిన ఉత్తర కుమారుడిలా ఫోజు ఒకటి. ఇంత తెలిసి ప్రతి రోజూ ఎక్కడోచోట, తాను జాకీలు క్రేన్లు వేసి లేపుతోన్న పార్టీ నేతల ఆకాంక్ష అయిన జైలుకి వెళ్లడం తథ్యం అనే డైలాగులు ఎందుకు వేస్తున్నారో కూడా చెప్పండి..జగన్ జైలుకి వెళ్లడం అనేది మీ జీవితాశయం అయినప్పుడు మీ ప్రత్యర్ధులకు ఓ  చిన్న కోరిక కూడా లేకుండా ఉంటుందా..?


కానీ అలవాటుగా మరోసారి తన తప్పులేంటో తానే తన వ్యాసంలో చెప్పుకొచ్చారు. మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో గెలుపు ఓటములు పాలనకు గీటురాయి కాదట. సరే కానప్పుడు టిడిపి ఓటమిపై ఈ వగపు ఎందుకు అలానే అధికారపార్టీకే జనం ఓట్లేస్తారట. సహజంగానే అధికార పార్టీ దుర్వినియోగం చేయడం సహజమట..అంటే ఈయనే జనరలైజ్ చేసేసారు. కానీ జగన్ పార్టీ అరాచకంగా చేసిందట..అంటే ఏంటి సారూ దీనికి కొలబద్దలు మీరు చెక్కించారా..? పైగా ఎఁతటి అధికార దుర్వినియోగానికి పాల్పడిందో అందరికీ తెలిసిందే అంటూ చమక్ వేశారు..అందరికీ అంటే ఎందరికి..ఎలా  తెలిసింది మీకు తెలిసిందంతా అందరికీ ఎలా తెలుస్తుంది..? ఇదే వ్యాసంలో జనాల తీర్పుని తప్పుబట్టారు టిడిపి లీడర్లు అంటూ ఏదో రాసారు..అంటే ఓ వైపు మీరు రాసింది మీరే ఖండిస్తున్నారా..


పోలీస్ శాఖలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌లాగా టిడిపిపై న్యాయపోరాటానికి ఆళ్ల వంటివారున్నారనే వ్యాక్యం ఒకటి..అంటే లీగల్ సెల్, తప్పుఒప్పులు దిట్టంగా ఎత్తి చూపించేవాళ్లు ప్రత్యేకంగా ఉంటే మీకేమైనా నొప్పా..సదరు న్యాయవాది కమ్ ఎమ్మెల్యే చొరవతోనే సదావర్తి సత్రాల భూముల వేలంపాటలో ప్రభుత్వానికి వందలకోట్లు ఆదాయం ఎక్కువగా వచ్చింది. అప్పుడు కూడా ఇలాంటి రాతే రాయాల్సింది కదా..ఫలానా జీవో నంబర్ 41 వలన అన్యాయం జరిగిందని ఎవరూ కంప్లైంట్ చేయలేదు మీకెందుకు నొప్పి అనేది టిడిపి, సదరు పత్రిక, పిటీషనర్ వాదన. నిజమే మరి..ఏపి సిఎం జగన్‌పై ప్రతిపక్షపార్టీలో ఉన్నప్పుడు పెట్టిన కేసుల్లో ఫలానా డీల్ వలన మాకు అన్యాయం జరిగింది అని ఎవరు ఫిర్యాదు చేశారు..పెంట శంకర్రావ్, ఎర్రంనాయుడు,అశోక్ గజపతిరాజు మాత్రమే వాళ్లేమైనా నష్టపోయిన వాళ్లా..లేకపోత్ సదరు కేబినెట్ జీవోలపై ఎంక్వైరీకి సిబిఐ ఎందుకు దిగింది.. అది వదిలేద్దాం..మరి కేబినెట్ అనుమతి లేకుండానే సదరు జీవో ఎలా బైటికి వచ్చిందన్నదే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదులో అసలు కీ పాయింట్..సిఆర్‌డిఏ యాక్ట్ ప్రకారం ఏం చేసినా చెల్లుతుందనడానికి ఇదేమైనా ప్రత్యేకమైన రాజ్యమా..రాజ్యాంగం నడవదా..

ఇంకా ఈ చేంతాడు వ్యాసంలో టిడిపి చాలా పాఠాలు నేర్వాల్సిందంటూ చాలా సన్నాయి నొక్కులతో పాటు క్రేన్లేసి లేపే ప్రయత్నం చేశాడు పాపం..పైగా రాజశేఖర్ రెడ్డి జైల్లో ఉన్నవాళ్లని కలిశారంటూ ఆయన పేరు నోట్లో వేసుకుని చప్పరించకుండా ఉండలేమని మరోసారి రుజువు చేశాడు..ఇదే చంద్రబాబు చిత్తురూ జిల్లాలో ఓంప్రకాష్ అనే మొద్దుశీను మర్డరర్‌ని కలవలేదా..

అక్కడికేదో చంద్రబాబుగారు విలువలనే పట్టుకుని రాజకీయాలు చేస్తున్నట్లు అసలు ఆ మాటకి వస్తే రాజకీయాలను విస్మరించి పాలించాడట..ఛ నిజమా..ఎవడి చెవిలో ఈ క్యాబేజీలు రామ రామ..కృష్ణ కృష్ణ. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే..23 మంది ఎమ్మెల్యేలను లాక్కుని నలుగురికి మంత్రిపదవులు కూడా ఎలా కట్టబెట్టారో మహాశయా..పైగా అప్పటి స్పీకర్ అసెంబ్లీ దీర్ఘంగా వాయిదా పడే చివరి రోజున కూడా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సంఖ్యని 63గానే ప్రకటించారే..అంటే స్పీకర్ అనగానే కళ్లు మూసుకుపోతాయా...అదే స్పీకర్ పార్టీ కండువా వేసుకుని తిరిగితే నిబద్దత కలిగిన కార్యకర్తా..పైగా చంద్రబాబుగారిపై కులముద్ర వేసారని నానా యాగీ చేస్తున్న ఈ  ప్రబుద్దపత్రికారత్నాకరం, కావాలని వాంటెడ్లీ జగన్మోహన్ రెడ్డి..జగన్ రెడ్డి ఎలా అయ్యాడో కాస్త చెప్పగలడా..జగన్ మోహన్ రెడ్డి పేరులో సౌండ్ సరిగా లేదని..జగన్ రెడ్డి అంటే బాగా పలుకుతుందనుకుంటే అంతకంటే చెత్తపిలుపు ఇంకోటి ఉండదు..ఇలాంటి పిలుపులు కమ్మగా రాబోయే రోజుల్లో నికమ్మని రాజ్యాలకు బాటగా బాజాలుగా విన్పిస్తాయనుకుంటే పొట్టచెక్కలయ్యేంత హాస్యం పండుతుంది.ఎందుకంటే గత ఎనిమిదేళ్లుగా చేసింది ఇదే

పైగా హిందూదేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని..క్రిస్టియానిటీ పెంచి పోషిస్తున్నారని..అసలు సంక్షేమ పథకాలే వర్కౌట్ అవడం లేదని వాగిన నోళ్లు ఎన్నికల ఫలితాల తర్వాత అవే గెలిపించాయని వగయడం ఏంటి..ఇంత చేసి టిడిపికి ఏం చేస్తే అది బాగుపడుతుందో కూడా ఈ ఐదారుపేజీల వ్యాసంలో రాసుకొచ్చారు పాపం.పోనీ పార్టీ అధ్యక్ష పదవిని మీరే చేపట్టండి సార్..పార్టీకి కమ్మని,సొంపైన కొత్త రక్తాన్ని ఎక్కించండి..అదెవరినో కూడా మీరే సెలవీయండి.

Comments