పాపం ఆ ఛానల్ ని కాస్త పట్టించుకోండి బాబుగారూ..! మీ ఘోర దారుణ పరాజ్జయానికి సాకులు వెతికి పెడుతోంది

 

పోటీ చేసిన స్ధానాల్లో సగం గెలిచినా...గెలుపే కాదు..అదే అంతకి మించి ఒక్కసీటు గెలిచినా..గెలుపే..కానీ ఘోరంగా ఒకటి రెండు స్థానాలకు ప్రాంతాలకు పరిమితం అయిన పార్టీ ఏం చేయాలి..అన్నీ మూసుకుని అంతర్మథం..పార్టీలో చర్చించుకుంటాంలాంటి రొడ్డ కొట్టుడు డైలాగ్స్తో కొంపలోంచి బైటికి రాకుండా సైలెంటైపోవాలి..అందరూ జగన్ లాగా ఓపెన్ గా వచ్చి..గట్టిగా కొట్టారు..తీసుకుంటాం..మళ్లీ వస్తాం అని ధీమాగా చెప్పలేరు కదా..!


ఐతే ఒకటి ఎంత కింద పడ్డ ాకూడా " ఆహా ఏం పడ్డారండీ వాస్తవానికి మీరు పడలేదు..మీరు అందంగా పడుకున్నారు..అసలు వాడు లేచాడు కానీ..ఎలా లేచాడో మనకందరికీ తెలుసు "  ఇలా జాకీలు..క్రేన్లు వేసి నాటకాలాడే కొన్ని గొట్టాలను చూస్తే జాలేయకతప్పదు..

" టిడిపి ఓ చోట గెలిచింది. ఇంకా నర్సీపట్నంలోని మరో వార్డు కూడా గెలిచింది అలానే కర్నూలు లోని ఓ చోట..విజయవాడలో మేయర్ అభ్యర్ధి శ్వేత ఇలా పలు చోట్లు  టిడిపి గెలుపుబాటలో..." అంటూ ఓ ఛానల్ లోని ఓ యాంకరమ్మ పాపం నానా అవస్థా పడుతూ టిడిపిని గెలిపించే బాధ్యత భుజాన వేసుకుంది. 

పైగా 

అన్ని చోట్లా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల వార్తలు నడుస్తుంటే..ఎంచక్కా..ఎంఎల్సీ  ఎన్నికలలలో స్వల్ప ఘర్షణలు..ముసలావిడను ఆదరించిన పోలీసులు..చిన్నారులను ఎత్తుకున్న పోలీసులు అంటూ బులెటిన్లు నడుపుకుంటున్న తీరు చూస్తే..మరీ ఘోరం..చివరకు ఈ స్థాయిలో నిజాలను ఎదుర్కోలేని వెధవాయలు పొద్దున్నే మాత్రం బీదపలుకులు..చెత్త పలుకులు వక్క పలుకులు పేరుతో జనాలకు నీతి గురించి ప్రశ్నించడం గురించి కబుర్లు రాతలు రాస్తుంటారు..దమ్ముంటే ఆ రెండు సన్నాసి గొట్టాాలు రాత్రికి తెలుగుదేశం ఘోరపరాభవంపై ఆ పార్టీ లీడర్లను నిజాయితీగా ఇంటర్వ్యూ చేయగలవా..? చేస్తాయ్ ఎలా చేస్తాయ్..చూశారా అధికార పార్టీ దౌర్జన్యం..ఎలా గెలిచేసిందో..ఇదే మాగాబుగారైతైనా అంటూ మింగలేక మంగళవారం కబుర్లు..చెప్పుకుంటూ చేస్తారు..అంత దౌర్జన్యాలే చేస్తే మరీ ఒక్క సీటుని మాత్రం ఎందుకు వదిలేశారు..అంతగా దౌర్జన్యాలు చేస్తుంటే జనాలంత పిచ్చోళ్లా..సోషల్ మీడియాలో కూడా ఎక్కనంత పకడ్బందీగా దౌర్జన్యం చేస్తున్నారా? మీరు ఇన్నాళ్లూ నెత్తిన పెట్టుకుని ఊరేగిన ఈసీ నిద్రపోయాడా?

అసలు ఆ గొట్టాల కార్యాలయాల ఉద్యోగులు కూడా షిఫ్ట్ అయిపోయిన తర్వాత  నానాబూతులు తిట్టుకుంటూ తమ కరోనా కాలంలో కట్ చేసిన జీతాల గురించి అడగలేక ఏడవలేక ఇలా వాళ్ల ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ పోతుంటారు అది వారి ఉద్యోగ జీవన ధర్మం అనుకోండి..కానీ జాకీలేసే గొట్టాలే బాబు పరాభవాలకు అసలు కారణమని ఎప్పటికీ తెలుసుకోలేరు..జనంలో తిరగకుండా తమ గొట్టాలనే నమ్ముకుంటే ఇలాంటి పరాభవాలే రిపీట్ అవుతుంటాయ్

 

Comments