బాలయ్యకి ఒకరు ఎదురెళ్లినా..బాలయ్యే ఇంకొకరికి ఎదురెళ్లినా..రిజల్ట్ సేమ్ టూ సేమ్



లెజెండ్ సినిమాలో బాలకృష్ణ ఓ పొలిటీషియన్తో ఓ డైలాగేస్తాడు..ఒకడు రైలుకి ఎదురుగా పరిగెడుతుంటాడు, రైలు దగ్గరకు వచ్చింది వాడిని గుద్దేసింది..ఇంకొకడికి రైలు ఎదురుగా వెళ్తుంది వాడిని కూడా రైలు గుద్దేసింది ఇక్కడ రిస్క్ ఎవడికి అంటూ ఏదేదో లాజిక్ లేకుండా చెప్పి..చివరికి  ఆ రైలు తనే అని చెప్పి విలన్ ని బోలెడంత షాక్ లో పడేస్తాడు..

ఇవాళ హిందూపురంలో కూడా సేమ్..ఫ్యాన్స్ కి చుక్కలు చూపించాడు. తన వీడియో తీసాడని చెప్పి చెంప చెళ్లుమనిపించాడు..అంతే మరి ఆయన ఫ్యాన్స్ దాన్ని వీడియో తీయనీయకుండా అడ్డంగా దడి కట్టారు. అంతే బాలయ్యని అబిమానిస్తే అలా దెబ్బలు పడాల్సిందే..పైగా దీనికే అబిమానం అని పేరు పెట్టుకుంటారు. అంతకంటే దెబ్బ తిన్నోడు ఏం చేయగలడు..కొట్టింది మన హీరోనే..మన పార్టీ లీడరే..మింగా  లేక కక్కాలేక మిడిగుడ్లేసుకుని ఏడవాల్సిందే మరి

ఇదే ఇఁకో పార్టీ  లీడర్ ఎవడైనా చేస్తే చానల్స్ హంగామా వేరే విధంగా ఉఁడేది..కేసు పెట్టాలి అన్నట్లుగా..ఆయితే ఆయన బాలయ్య కాబట్టి రిపోర్టింగ్ స్టైలే వేరుగా ఉంటుంది..సోషల్ మీడియాలో బోలెడంత హుషారు ట్రోలింగ్ రెడీ..
అసలు బాలయ్య వెళ్లిందే పరామర్శకైతే..ఇప్పుడు ఈ బాధితుడిని పరామర్శించేందుకు నారా లోకేశం గారు వెళ్తారేమో

Comments