ఇంత నీచమా.. ! ఓ వైపు తన డిస్కషన్‌‌లో బండబూతులు తిట్టిన ఇష్యూపై వెటకారం, మళ్లీ అదే స్టాండ్‌కి మద్దతుగా పేపర్‌లో హెడ్‌లైన్

 

రాత్రికి రాత్రే ప్రాధామ్యాలు మారిపోయాయా, విషయం బోధపడేసరికి హెడ్ లైన్ పెట్లాల్సి వచ్చిందా


విషయం ఏమిటంటే, వ్యాక్సిన్ పేటెంట్ సడలించి, తయారీ విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తే తప్ప భారీగా డోసులు ఉత్పత్తి కావు అని తన సొంత బుర్రకో, లేక ఇంకోళ్లు చెప్తేనో, ఏపి సిఎం వైఎస్ జగన్, ప్రదానమంత్రికి ఓ లేఖ రాసారు. దాంట్లో ఎవడూ తప్పుబట్టడానికి లేదు


కానీ ఆ రోజు సాయంత్రానికే ఓ మేధావి పిట్ట ఆయనపై నోరు పారేసుకుంది. తనకి ఉన్న జ్ఞానాన్ని రంగరించి, అక్కడికి అమెరికా అధ్యక్షుడే స్వయంగా పేటెంట్ రైట్స్ వైవర్ చేయమన్నాడంటూ తన జ్ఞానాన్ని వీక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. కానీ ఈ క్రమంలో నోరు జారింది..వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు చెప్పిన వైవర్స్ ఇష్యూ, వాళ్ల దేశానికే పరిమితం. ఆయనేం ప్రతి దేశంలోకి పోయి, వ్యాక్సిన్ పరిజ్ఞానం అందరికీ అందేలా చేయమనలేదు


అమెరికాలో తయారైన వ్యాక్సిన్లు ఫైజర్, మోడెర్నా, ఇంకా జాన్సన్ అండ్ జాన్సన్ ..ఇంకా గట్టిగా డీప్‌గా పోతే ఈ సంస్థలు తయారు చేసే వ్యాక్సిన్ కంపెనీలకు పెట్టుబడి ఇతర దేశాలు కూడా పెట్టి ఉంటాయ్. బైడెన్ గారి ఆజ్ఞ, ఆదేశం వాటి వరకే పరిమితం, చైనావాడి టీకాకి, యూకే ఆస్ట్రాజెనెకా, రష్యా స్పుత్నిక్ కి వర్తించవు, వర్తించవు అంటే ఈ కంపెనీలు పాటించాల్సిన అవసరం లేదు. 


అప్పటికీ గావి పేరుతో డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో ఒకటి, మరో వేదిక ద్వారా వ్యాక్సిన్ పరిజ్ఞానం , డెవలప్ మెంట్స్ , అప్‌డేట్స్ దేశాలు పంచుకుంటూనే ఉన్నాయ్. ఐతే ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ విషయంలో అమెరికా చేసిన తప్పిదం, తప్పిదం అంటే తప్పిదం కాదు ట్రంప్ తెంపరితనంతో తన దేశపు నిధులు ఇవ్వకుండా హుంకరించాడు

దాంతో ఈ వ్యాక్సిన్ తయారీ జ్ఞానం విషయంలో ఆ దేశానికి నైతిక హక్కు లేదు. ఇంత జరిగింది కాబట్టే. బైడెన్ ఎకాఎకిన వ్యాక్సిన్ పేటెంట్ వైవర్ గురించి మాట్లాడాడు. అంతేకానీ ప్రపంచం మొత్తంపై మరీ అంత దయతో కాదు.  ఈ విషయాన్ని గమనించకుండా,  అక్కడికేదో ఏపి సిఎంకి ఏ మాత్రం పరిజ్ఞానం లేనట్లు మాట్లాడటం తగదు


మరి జగన్ లేఖ తర్వాతే,  ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో,...పాపం ఏ ఛానల్‌లో అయితే జగన్మోహన్ రెడ్డి లేఖపై వెటకారం ఆడారో..అదే గ్రూప్ పత్రిక ఇవాళ హెడ్ లైన్ పెట్టి మురుసుకోవాల్సి వచ్చింది


ఈ ఎపిసోడ్‌ నుంచి గ్రహించాల్సింది ఏమిటంటే, ఎదుటివాడు మనకి నచ్చినా నచ్చకపోయినా, అతని పనులను ఏకడం కాదు, ఇష్టం లేకపోతే మూసుకుని కూర్చోవాలి. అంతేకానీ

ప్రతి విషయానికి ఎగిరెగిరి పడితే అభాసుపాలు కావాల్సి వస్తుంది

Comments