రరాకృజుని ఇలా అరెస్ట్ చేయడం కరెక్టేనా? ఇంకెలా చేస్తారు మరి? బెయిల్ వస్తుంది..సదరు ఎంపి గారు తన పని తాను కంటిన్యూ చేస్తారంతే..!

 వైఎస్సార్సీపీ సొంత ఎంపీనే అరెస్ట్ చేయించింది

నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారా..

ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా


అబ్బాబ్బా..ఇలాంటి డైలాగులు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆ రెండు ఛానళ్లలో హోరెత్తిపోయాయ్...ఓ ఎంపిని ఇలా అరెస్ట్ చేస్తారా అంటూ నిలదీతలు నిజమే ఇలా చేయకూడదు..మరి ఎలా చేయాలి? పైగా ఎవరికీ తెలీకుండా అరెస్ట్ అట..ఎవరికీ తెలీకుండా అరెస్ట్ ఏంటి..అరెస్ట్‌కి అరగంట ముందే మన న్యూస్ ఛానల్ ఒకటి అక్కడ లైవ్ ఇస్తుంటే...ఇది ప్రీప్లాన్డ్ కాకపోతే మరేంటి..?


ఐతే మా పార్టీకి, మా పోలీసులకు శుక్రవారమే ఆరెస్ట్ చేస్తారేంటో అంటూ వెటకారమాడిన సదరు ఎంపికి ఆ రోజే అదే అనుభవం ఎదురు కావడమే విచిత్రం అన్నీ నాకు తెలుసని విర్రవీగిన ఈ సర్వజ్ఞానికి తన అరెస్ట్ సంగతి ముందు తెలీదా..?  ఇప్పుడాయన కుమారుడంటాడు..మా నాన్న హార్ట్ పేషెంట్, ఆయన మందులు వాడాలి..టైమ్ కి ఇవ్వాలి..అంటూ తన ఆవేదన వ్యక్తం చేసాడు.నిజమే ఈ హార్ట్ పేషెంట్‌కి ఆ సోయి ఉంటే..ప్రతి రోజూ అదో ఉద్యమంలాగా ఏపీ ప్రభుత్వంపై నోరు పారేసుకునేవాడా..? 

తవ నోటికి ఎలాంటి మాట వస్తే అలా వాడగల సమర్దుడు..గత పది రోజులుగా ఎలాంటి మాటలు మాట్లాడారో తెలీదా?  ప్రతి రోజూ ..రేయ్...డ్డీస్..క్రిస్టియన్ మత ప్రచారం చేస్తున్నారు..వ్యాక్సిన్లు వాళ్ల పార్టీ వాళ్లకే ఇస్తున్నారూ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే, చూస్తూ ఊరుకుంటారని ఎలా అంచనా వేసారో తెలీదు మరి..! నోటీస్, వారంట్ లేదనడం ఓ డ్రామా..నోటీసు తీసుకోకుండా నిరాకరిస్తే..గోడకి కాకపోతే కార్లకి అతికిస్తారా..?


అక్కడికేదో జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని కోరితేనే ఈ ఎంపిని అరెస్ట్ చేసారని కవర్ చేయడం, వీళ్ల జాణతనానికి నిదర్శనం. ఎందుకంటే గత కొన్ని నెలలుగా ఈ ఎంపి ఆ రెండు చానళ్ల అండతో ఎలాంటి ప్రచారం చేస్తున్నారో ఆ వీడియోలు చూస్తూనే తెలుస్తుంది..డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్  అమల్లో ఉందని తెలిసీ, ఇరిటేట్ చేయడమనేది ఇతగాడు చేసిన తప్పు..ఖచ్చితంగా ఇది స్వయంకృతాపరాధమే..ఓ వర్గాన్ని టార్గెట్ చేశారంటూ

రోజూ నానాయాగీ చేస్తూ, భయంకరంగా ఓ కులాన్ని ఉచ్చరిస్తూ ఈ ఎంపి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు..విమర్శలు చేయవచ్చు కానీ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతపై ఏకవచనంతో విరుచుకుపడుతూ దాన్నే విమర్శ అనుకోమంటే కుదరదు..ఇప్పుడేం కొంప మునగదు,  ఆయనకి బెయిల్ వస్తుంది..అంతే..ఆ తర్వాత తన పనులు తాను కొనసాగిస్తారు..

Comments

  1. రచ్చబండలో వైసీపీని, ఆ పార్టీ అధినేతనూ.. ఉతికారేస్తున్న రఘురామరాజును సీఐడీ అరెస్టు చేసింది.

    - (కింగ్ మేకర్ కావాలనుకునే) ABN

    ReplyDelete

Post a Comment