అంతట..ఆ ధీరోధాత్త మహా రాజు..తనని సైనికులు కొట్టెనని వలవలా ఏడ్చెను..! న్యాయాధికారి కళ్లు చెమర్చెన్

 


వీడియో ప్రసంగాలకు, గొట్టాల ముందు వీరాలాపాలకు..వాస్తవ పరిస్థితికి చాలా తేడా ఉంటుంది. అంతెందుకు ఎక్కడో కూర్చుని నేను ఇలా రాతలు రాస్తున్నానంటే అంత తొందరగా మనపై ఎవరూ పడరనే బింకమే కారణం. అలానే ఓ మహారాజు..తన చక్రవర్తి( ఆయన భాషలో సామంత చక్రవర్తి లేదంటే సామంతరాజు)పై యథేచ్చగా యథాలాపంగా మంచినీళ్ల ప్రాయంగా ఆరోపణలు..ప్రేలాపనలతో కూడిన ఏకపాత్రాభినయం చేస్తూ ఆంతేవాసులను తెగ రంజింప జేసెను ఐతే ఇది చక్రవర్తికి ఎక్కడో కాలెను..దీంతో సమయము చూసి కలుగులోని ఎలుక బైటికి రాగానే పట్టుకున్నట్లుగా పెడరెక్కలు విరిచి పట్టుకురమ్మన్నట్లుగా భటులను పంపడమే

తరువాయి గూఢచార భటులు ఆతనని తోడ్కొని న్యాయాధికారి ఎదుట ప్రవేశపెట్టెను..ఐనచో..ఈ మూషికరాజు కడుంగడు గడుసరి కావటము చేత వెంటనే తనకి అన్ని అనారోగ్యములు గుర్తుకువచ్చెను..కాళ్లు తడబడెను..భటులు తనపై దాడి చేసినట్లుగా భ్రమింపజేసినవిధముగా పరిపరివిధములు నడకను అభినయించెను..వార్తాహరులు వెంటనే ఈ సమాచారామును దూరదర్శనము ద్వారా ప్రజలందరి ముందు పెట్టెను..అయినను గిట్టనివారు ఇది ఆయనకు మార్గమధ్యమున వచ్చిన ఆయాసముతో కూడిన పాదముల వాపు తప్ప ఆయనపై ఎవరును చేయి చేసుకొనెడి  ధైర్యము చేయరని గుసగుసలాడెను..అయినను ఓ వేళ ఆ రాజుపై దాడి జరిగిన చక్రవర్తి నిజముగా మూర్ఖులే అని కొందరు అభిప్రాయం వ్యక్తము చేసెను. వాస్తవము ఏమిటనేది వైద్యుల బృందము తేల్చనున్నది


ఐనను..ఈ మూషికమహారాజును ఉసిగొలిపిన ప్రసారమాధ్యమాలు ఆ రాజ్యంలో ప్రవేశించనవసరం లేదు కావును యధేచ్చగా తమ అభిప్రాయాలను ప్రజాభిప్రాయంగా ప్రసారం చేయుచూ సదరు మూషికము ఆరోగ్యంపై ఎనలేని ఔదార్యం, ప్రేమ అభిమానం, వాత్సల్యం చూపించిడం సాగించెను..అంతట ప్రజలందరూ అరరే మన మూషికరాజు శరీరంలో ఇంతటి అనారోగ్యము పెట్టుకుని కూడా రోజూ మన ముందు ఎంతటి రంకెలు వేసెను..ఎంతటి తెగువ చూపెనంటూ నోరు నొక్కుకోవడం ప్రారంభమైనది..


ఇంత జరిగిననూ చివరకు ఈ మూషికరాజునకు న్యాయాధికారి విడుదలే చేయును కానీ..ఇంతలో ఇంత జంఝాటము ఏమిటని ప్రజలు ఊసులాడుటపై మాత్రం ఈ ప్రసారమాధ్యమాలు పట్టించుకొనజాలవు..ఏది ఏమి అయిననూ..హస్తినకు పోవలె..న్యాయము తేలవలె..


Comments

  1. వీళ్ళ బాచ్చి అందరికీ .. "రమేష్" హాస్పిటల్స్ మీద మాత్రమే నమ్మకమెందుకో? ప్రపంచంలో ఇక ఏ హాస్పిటల్నీ నమ్మరా?

    ReplyDelete
  2. హైకోర్టు బెయిలు పిటీషన్ కొట్టేసిందాకా కనిపించని దెబ్బలు.. సడెన్ గా ఆతర్వాత ఎలా ప్రత్యక్షమయ్యాయో.. వెంకటకృష్ణకి, చంద్రబాబుకీ, రమేష్(హాస్పిటల్) కి మాత్రమే తెలుసుండాలి.

    దెబ్బలు పైకి కనిపించకుండా కొట్టడంలో సిద్దహస్తులైన పోలీసులు.. రాజు గారిని మాత్రం, "మేం కొట్టాం చూడండహో!" అంటూ టముకేసినట్టు కొట్టారా? నమ్మేద్దామా? బెయిలు పిటీషన్ రద్దుకీ.. కాల్ల దెబ్బల ఎగ్జిబిషన్ కీ మధ్యలో.. రాజు గారు కుటుంబ సభ్యులని కలిశారు. అక్కడేమైనా "బ్రీఫ్ మీ"జరిగుంటదా?

    ReplyDelete
    Replies
    1. Chiru Dreams15 May 2021 at 08:39
      హైకోర్టు బెయిలు పిటీషన్ కొట్టేసిందాకా కనిపించని దెబ్బలు.. సడెన్ గా ఆతర్వాత ఎలా ప్రత్యక్షమయ్యాయో.. వెంకటకృష్ణకి, చంద్రబాబుకీ, రమేష్(హాస్పిటల్) కి మాత్రమే తెలుసుండాలి.
      హరి.శ్.బబు
      ఏ సమయంలో ఆ RRR శాల్తీ ఎక్కడున్నాడో అగంతల వారీ వివరాలు కూడా ఉన్నట్టున్నాయే తమరి దగ్గిర?పోలీసు డిపార్టుమెంటులో తమరి ఇలాకాలు ఉన్నారా ఏవిషీ!RRR శాల్తీ పుట్టీన్రోజు నాడు పోలీసులు అరెష్టు చేసినప్పుడు లేని దెబ్బలు సడెన్ గా ఆతర్వాత ఎలా ప్రత్యక్షమయ్యాయో.. డీఐజీ గారికీ, ప్రొఫెసర్ నాగేశవ్రరావు గారికీ, ఇదీప్రపంచం గారికీ, చిరుడ్రీంస్ గారికీ మాత్రమే తెలుసుండాలి.

      Delete
    2. మరి బెయిలు కేసు పీకేసిందాకా కింగులాగా తిరిగినోడు, వెంటనే కాల్లదెబ్బల్తో బోంగులాగా వాలిపోయి వల వలవల ఎలా ఏడ్చాడో.. ఆర్ ఆర్ ఆర్ కీ, చెంద్రబాబు బ్రీఫ్ చేసిన హరీబాబుకే తెలియాలి మరి.

      >> బెయిలు పిటీషన్ రద్దుకీ.. కాల్ల దెబ్బల ఎగ్జిబిషన్ కీ మధ్యలో
      హెబ్బే! నువ్వేం అన్లేదు..నేనేం విన్లేదు.

      Delete
    3. >> బెయిలు పిటీషన్ రద్దుకీ.. కాల్ల దెబ్బల ఎగ్జిబిషన్ కీ మధ్యలో
      హెబ్బే! నువ్వేం అన్లేదు..నేనేం విన్లేదు.>> బెయిలు పిటీషన్ రద్దుకీ.. కాల్ల దెబ్బల ఎగ్జిబిషన్ కీ మధ్యలో
      హెబ్బే! నువ్వేం అన్లేదు..నేనేం విన్లేదు.

      hari.S.babu
      మరేఁ!మరేఁ!మర్రికాయ, హ్హిహ్హిహ్హీ!

      అంతే,అంతే, మా ముస్రాబాదలో అంతే!ఇదీ పెపంచేం గారూ సిరంజీవి వై గారు ఏటి సెప్తే ఆదె ఇన్లా.పోలీసూల అజామయిస్ధెల్లు ఉన్నపూడు తెల్లాసర్స్రైకి సొరియాసుస్ వొచ్చెయ్యడమూ తనకి తనే దెబ్బలు అత్గిలించుకోవడమూ దొంగేసికాలు ఎయ్యడమూ సాజ్జిమా అని లాజిక్కులు అడగ్గూడదు.దేవుడు గారి బిడ్డ గారి రాజ్యం గందా!

      జగనన్న గారూ వారి అభిమానులూ ఏం చెప్తే అదే నిజం, రైఠో!

      Delete
  3. మిత్రులారా..ఎందుకు వాదనలు..హాయిగా కేసు వినోదం వీక్షిస్తే సరిపోయేదానికి..! అవి నిజమైన దెబ్బలో..ఇంకోటో కేవలం ఆ వ్యక్తికి..పోలీసులకే తెలియాలి..మిగిలినవన్నీ ఊహలే

    ReplyDelete
  4. కరోనా వచ్చి ప్రజలకి చేస్తున్న గొప్ప మేలు - దేశంలోనూ ప్రపంచంలోనూ మనవజాతిలోనూ మంచితనం ముసుగులు వేసుకుని ఉన్న నీచులు అందర్నీ పేరుపేరున బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నది!

    అలా బయట పడుతున్న వాళ్ళలో ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడటం కోసం ఉన్నారని అనుకుంటున్న డాక్టర్లూ పోలీసులూ జడ్జీలూ శాసన సభ్యులూ మంత్రులూ ఉండటం యాదృచ్చికం కాదు.

    ఆయన దగ్గిర ఫార్ములాను కొట్టేసి అమ్ముకోవడం కోసం ఆనందయ్యను ఎత్తుకెళ్ళి దాచేసింది ప్రభుత్వమే అయినప్పుడు, ప్రజలు వోట్లు వేసి తమకు 151/175 మెజారిటీని ఇచ్చార్ని పేరురూఢికానిపార్టీ వారు చెప్పుకుంటున్నది నిజమే అయితే ప్రజలు కూడా అలాంటి నీచులే అవుతారు.

    నిజానికి రాజ్యవువస్థ కుటుంబవ్యవస్థ యొక్క కొనసాగింపు - తన కుటుంబ జీవితం క్రమబద్ధమై ఉండి నైతిక శ్రేష్టుడైన వ్యక్తి సామాజిక జీవితంలో తన అధికార పరిధి విస్తరించిన మేర నైతిక శ్రేష్టత్వాన్ని మాత్రమే ప్రోత్సహిస్తాడు. అలా కాక తన కుటుంబ జీవితం అస్తవ్యస్తమై ఉండి నైతిక భ్రష్టుడైన వ్యక్తి సామాజిక జీవితంలో తన అధికార పరిధి విస్తరించిన మేర నైతిక భ్రష్టత్వాన్ని మాత్రమే ప్రోత్సహిస్తాడు. “Despotism is not difficult in any land that has only known one master from its childhood” అనేది చరిత్ర నిరూపించిన మొదటి నిజం. “It is curious to observe the universal pretext by which the tyrrants of all times take away the national liberties” అనేది చరిత్ర మనను తేల్చుకోమని నిలదీస్తున్న ప్రశ్న లాంటి రెండవ నిజం.”when Rome lost her freedom, and her indignant citizens declared that tumultous liberty is better than disgraceful tranquillity” అనేది చరిత్ర రెండవ ప్రశ్నకు జవాబులా చూపించి నిరూపించిన మూడవ నిజం. చరిత్ర పదే పదే నిరూపిస్తున్న మూడు సత్యాలు ఒక ఇంటి పెంపకం నియంతల్నీ ఒక ఇంటి పెంపకం బానిసల్నీ తయారు చేస్తున్నాయనే కఠిన సత్యానికి ప్రతిబింబాలు!

    అన్ని రంగాలను భ్రష్టు పట్టించిన వాళ్ళు అక్కడికి వెళ్తున్నది కూడా ప్రజల మధ్య నుంచే కదా - ఇంక ప్రజలని పవిత్రులు అనడం ఎట్లా సాధ్యం?కుటుంబాలు బానిసలను ఉత్పత్తి చేసే కర్మాగారాల వలె ఉన్నంతకాలం నియంతృత్వం,అరాచకత్వం,దోపిడీ,పీడన,అసహాయత,వేదన కొనసాగుతూనే ఉంటాయి.

    జై శ్రీ రాం!

    ReplyDelete

Post a Comment