దెబ్బలు రోజులు గడిచే కొద్దీ తగ్గుతాయిట..మరి ఆయన మాత్రం అలా వీక్ అయ్యాడేంటి?

 

ఈ విశ్లేషణ ఆయన ఫ్యాన్స్ కి ప్రత్యర్థి పార్టీ ఫాలోయర్లకు మంట పుట్టిస్తుందని తెలుసు కానీ, చేయాలనిపిస్తుంది..అరెస్ట్ కాబడిన తర్వాత ఆయన్ని లాఠీ దెబ్బలతో కొట్టారంటున్నారు..ఆ తర్వాత మరో వాదనా వచ్చింది నన్ను కొట్టింది పోలీసులు కాదు..ఎవరో ముసుగు వేసుకుని వచ్చినవారు అని చెప్పాడంటున్నారు..ఇది వారి ఆంతేవాసుల ఛానల్ రిపోర్టింగ్ ద్వారానే తెలుసుకున్నాం..నిజంగా సినిమాటిక్ గానే ఉంది..వాస్తవానికి ఆ నొప్పి దెబ్బ తిన్నవాడికి కానీ..మనకి తెలీదు..


ఇప్పుడు ఆయన తరపు న్యాయవాదులు మరో వాదన చేస్తున్నారు..కావాలనే సైనిక వైద్యశాలకు కూడా ఆలస్యంగా తరలిస్తున్నారు అని..ఎందుకయ్యా అంటే ఏ...మీకేం తెలీదు..రోజులు గడిస్తే దెబ్బలు తగ్గుతాయి కదా..ఏ దెబ్బలూ లేవని రిపోర్టు వస్తుందట..నిజంగా అలా రోజులు గడిచేకొద్దీ దెబ్బలు తగ్గితే మరి సదరు రాజ్యంలేని రాజు ఎఁదుకలా రక్షకభటుడిపై చేతులు వేసుకుని మరీ నొప్పిని భరిస్తూ..అభినయిస్తూ..అడుగు తీసి అడుగు పెట్టలేనంత కష్టంగా కన్పించారు..


అదంతే అనుకోవాలా..పైగా  ఆయన ముఖకవళికల్లో గతంలో లేనంత నైరాశ్యం కన్పించింది..కానీ ఈ లోపుగానే కారు ముందు ఆయన విసురు ఒకటి కెమెరాలకు చిక్కింది..ఇంతకీ వీటిలో ఏది నిజం..సరే ఆయన దెబ్బలు సరైనవే అయితే...నిజంగా మన వైద్యశాస్త్రం, పరిశీలనకు అందనంత మానిపోతాయా గాయాలు...అంటే ఎవరినైనా నాలుగు దెబ్బలు వేస్తే..మూడు రోజులు ఆగితే వాటి అసలు వైనం తెలుసుకోలేనంతగా మన వైద్యశాస్త్రం వెనుకబడిపోయిందా..వామ్మో ఇందుకే ఈ నల్లవస్త్రాలంటే జనం హడలిచచ్చేది నిజం ఏంటో రేపీపాటికీ తేలిపోతుంది కదా..ఓ వేళ అది ఎక్కడ మనకి అనుకూలంగా రాదనే, ఇలాంటి ఈవిఎం తరహా నాటకం బయలుదేరిందా..ఇదే మరి వైరివర్గాల ప్రచారం ఇప్పుడు నడుస్తోంది

Comments