ఏపీకి ఫంగస్ ..ఇలాంటి హెడ్డింగ్స్ చూస్తుంటే బాధ కలగని మనిషి ఉంటాడా..?


 వార్తా ఛానళ్లుగా ఎవరి తెలుగు  భాషా పాండిత్యం ప్రదర్శించడం చాలా ఎక్కువే ఇప్పుడు..కానీ ఇలాంటి టైటిల్స్ పెడుతుంటే ..ఆ రాష్ట్రంపై ప్రేమ కాదు..పగ, కసితోనే ఇలా పెడుతున్నారనిపించకమానదు..కేవలం మనకి నచ్చని నేత ఉంటే మొత్తం రాష్ట్రంపైనే శాపాలా..ఏపీ జనం అలా ఇలా అంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒకటే రొద


పోనీ తెలంగాణ విషయంలోనూ ఇదే తరహా వెటకారం..పైత్యపు ప్రదర్శన..వ్యాక్సి నో తెలంగాణ అంట



అక్కడికేదో తెలంగాణ ఒక్క చోటే వ్యాక్సిన్లు లేవా...దేశంలో ఏ రాష్ట్రంలో సరిగా ఉన్నాయో తెలుసా..? దేశం మొత్తంపైనే ఈ సమస్య ఉంటే ఇలా కావాలని పడని ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వీటిపై ఇంత విషం చిమ్మడం సరైనదేనా?



ఇదే డిస్కషన్లో కావాలని ఓ సంఘటనని యాంకరే గెస్ట్ లను రెచ్చగొట్టడం ఏమండీ ప్రతిపక్ష పార్టీగా మీరు కేస్ స్టడీ చేశారా అనడం చూస్తుంటే..కావాలనే ఓ బ్రేకింగ్,,ఆ బ్రేకింగ్ మొబైల్ ఫోన్లలో ఫార్వార్డ్ చేసుకోవడం ఆ తర్వాత దానిపై చర్చలోనే మాట్లాడటం..అంతా కలిపి ప్రభుత్వానికి ఏదీ చేతగాదన్నట్లుగా మాట్లాడటం..సిఎం కార్యాలయం దగ్గరకు ఓ దంపతులు వచ్చారట..వారేమో సూసైడ్ అటెంప్ట్ చేశారట..కానీ ఇక్కడ అదే ఛానల్లో ఆ వచ్చిన దంపతులను సెక్యూరిటీ సిబ్బంది లిఖితపూర్వకంగా ఇస్తే సిఎంగారికి పంపుతాం అంటే..వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకోవడం చూస్తుంటే ప్లాన్డ్ గా అన్పించదా..?

వీడియో చూడండి


సిబ్బంది అడిగినట్లుగా ఓ పేపర్ పై రాసి..అది ఇచ్చి పంపిన తర్వాత కూడ స్పందించకపోతే కదా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడేది..అందులోనూ ఓవైపు 144 సెక్షన్ ఉఁదని వెటకారమాడుతూనే..తిరిగి అక్కడకు ఆ దంపతులు వెళ్లగలిగారంటే..ఏది నిజం..అసలు ఆర్ధిక సమస్యలతో వెళ్లేవాళ్లు సిఎంనే డైరక్ట్ గా కలవడానికి ఇదేమైనా సినిమానా../? 
ఎంతమంది ముఖ్యమంత్రులు జనాలను ఇప్పుడు కలుస్తున్నారు..సరే జగన్ మోహన్ రెడ్డిని ఓ పెద్ద రాక్షసుడిగా చిత్రీకరించేవాళ్లు..రోజూ ఏదోక పథకం పేరుతో డబ్బులు పంప్ చేస్తున్నాడని విమర్శించేవాళ్లు..మరీ ఈ ఆర్థిక సాయం విషయంలో అప్పటికప్పుడు చర్చల్లోకి ఎలా వెళ్లారు..సరే ఎవరి ధోరణి వారిది..మనం మాత్రం ఎవడిపైనైనా పడతాం..మాపై మాత్రం పడకండంటే ఎలా..
అందుకే మనం కూడా ఇలానే పడదాం

Comments