వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పై తీర్మానం పాస్ చేశారూ బాబూ బాహ్ బూ..! లోకేశం..మతి పోయిందా..లేక పచ్చపాతం కమ్మేసిందా.. ! నీ మాక్ అసెంబ్లీనే అసలు అసెంబ్లీ అనుకుంటున్నావా!




మాక్ అసెంబ్లీ అంటూ ఏదో కామెడీ క్లబ్ రన్ చేస్తున్నారనే విమర్శలను నారావారి పుత్రరత్నం నిజంగానే నిజం చేసేట్టున్నారు.ఎందుకంటే నిన్నటి అసెంబ్లీ సెషన్‌లో..ఏదీ ఒక్క రోజే కదా అంటూ ఈసడించిన నిన్నటి అసెంబ్లీలోనే... విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేయవద్దని తీర్మానం చేసారు. పాస్ చేశారు..


ఐతే పాపం మరి బాహ్బూ గారి మాక్ అసెంబ్లీ ఎఫెక్టో..లేక అదే అసలు అసెంబ్లీ అనే భ్రమలో ఉన్నారేమో కానీ నారా లోకేశం గారు వైఎస్ జగన్ వైఖరి విడ్డూరం గిడ్డూరం అంటూ ఏదేదో మాట్లాడేసారు..ఇది వారి ఆంతేవాసి పత్రికలోనే వచ్చింది..వెబ్ ఎడిషన్‌లో వేసుకుని సంబరపడ్డారు..ఇది రేపొద్దున్నకి ఎలాంటి మార్పు చేస్తారో తెలీదు కానీ..ఇప్పటికైతే అదే వెలుగులజ్యోతి వెబ్ ఎడిషన్ లో ఉంది..


మరీ ఇంత కడుపు మంటనా.. ఓ వైపు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కూడా ఇలాంటి ఏడుపులు ఏడ్జేదెవరైనా ఉన్నారంటే ...అది టిడిపినే అంటూ వైఎస్సార్సీపీ లీడర్లు అంటున్నారంటే అనరా మరి..!


తీర్మానం కావాలంటారు..చేస్తే అది గుర్తించరు..కళ్లున్న కబోదులు..ఆ తర్వాత అబ్బే అలాంటి తీర్మానం ఎందుకు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. అంతే..ఎవడేం చేసినా వీళ్లే డిసైడ్ చేస్తారు మరి..!

Comments