వారెవ్వా మినిస్టర్ జీ శ్రీనివాస్..! హీరోలా చేసారే...వీడియో కూడా ఉంటే బావుండేది

 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు నిన్న ఓ హీరోయిక్ పని చేశారు. యాక్సిడెంట్ చేసి తప్పించుకుందామనుకున్న ఓ వ్యక్తిని ని ఛేజ్ చేసి మరీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరి ఈ వీడియో ఛానల్స్ లో వేశారో లేదో తెలీదు. ఎందుకంటే ఈ మధ్య న్యూస్ ఛానల్స్ లో కరోనా గురించిన భయంకరమైన కథనాలు వండివారుస్తున్న నేపథ్యంలో అటువైపు తొంగిచూడటం తగ్గించా..


బాలానగర్ నుంచి ముదిరెడ్డిపల్లికి వెళ్తున్న..ఓ బైకర్..అతని పేరు కూడా శ్రీనే, ఊరెళ్తుండగా వెనుక నుంచి ఓ బొలెరో వాహనం డ్యాష్ ఇచ్చి ఆపకుండా వేగంగా ఆ సీన్ నుంచి తప్పించుకునే పనిలో పడ్డాడట..వెంటనే అక్కడే అటువైపుగానే జర్నీ చేస్తున్న మన మినిస్టర్ గారు ఆ బొలెరోని ఛేజ్ చేసి..పోలీసులకు పట్టించారట..ఐతే ఇక్కడ ఆ ప్రమాదానికి కారణమైన నేరగాడి పేరు రాయలేదు..
విషాదం ఏమిటంటే ప్రమాదంలో గాయపడిన శ్రీను ఆస్పత్రిలో మరణించడం

Comments