బాబూ వారంలో వచ్చేస్తాం జాగ్రత్త అన్నారు..ఇక కన్పించరని ఏడుస్తున్న పిల్లలకేది దారి..ఏంట్రా భగవంతుడా మాకీ శిక్ష



 ఒక్క ఫోటో ఎన్నో మెదళ్లకు కదలిక ..ఒక్క అక్షరం కోటి మెదళ్లలో చురుకు పుట్టిస్తుందా..ఏమో

నాకైతే ఈ ఫోటో ఈ లైన్ చూస్తుంటే..కడుపులో దుఃఖం పొంగి పొరలి వస్తోంది. పొంతలో నీళ్లు ఉడికిన తర్వాత ఎలాగైతే  బుడుగుబుడుగుమంటూ శబ్దం చేస్తాయో అలానే వంట్లో ఏడుపు ఆగడం లేదు..


ఎన్ని కుటుంబాలు..ఎంతమంది ఇలా బలైపోవాలి..చిన్నారులకు దూరమైన తల్లిదండ్రులు..ముసలివయసులో తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు ...పిల్లలు అనాధలను చేస్తుంటే..ఈ కరోనా నిజంగా మనిషి రూపం దాల్చితే..వందసార్లు కాదు కోటిసార్లు ఉరేయాలనిపిస్తుంది..

ఎన్ని ఆశలు ఉంటాయి. ఎంత తపన ఉంటుంది.అన్నిటికి ఒక చిన్న జీవి( జీవం కూడా లేని) చిదిమివేస్తుంటే..మనిషి ఎంత అశక్తుడో అర్ధం కావడం లేదా అసలు ఈ కరోనా కొంతమందినే ఎందుకు బలి తీసుకుంటుంది..మరికొందరేమో హాయిగా ఎలా తిరిగి వస్తున్నారు.ఏంటీ మిస్టరీ..ఎందుకు ఇలా జరుగుతోంది 

నిజంగా ఈ మరణాలకు కారణం ఏంటి నిర్లక్ష్యమేనా..ఈ డేటా ఎందుకు తీయరు..ఈ మరణాలకు గురైన వారి ఆహారపు అలవాట్లు, మాస్క్ పెట్టుకున్నారా లేదా..శానిటైజేషన్ చేస్తుంటారా లేదా అలానే ఇతర జబ్బులు ఉన్నాయా..ఏం మందులు వాడారు..ట్రీట్ మెంట్ దశలో ఎలా స్పందించారు..ఇలాంటి డేటానే కాదు. ఇంకా కొన్ని వందల ప్రశ్నలు నిక్షిప్తం చేయకపోతే భవిష్యత్ తరాలకు ఇదో అంతుచిక్కని జబ్బుగానే మిగులుతుంది


కరోనా నుంచి ఎలా తప్పించుకోవాలి..ఈ ప్రశ్న ఎందుకంటే..ఈ చిన్నారులకు అమ్మ లేని లోటు నాన్న లేని లోటు జీవితాంతం తీరదు. అమ్మానాన్నలతో కలిసి ఉంటే ఉండే సుఖం ఇక వారికి దూరం..ఇదెంత నరకమో ఊహించుకుంటేనే భయానకం..మిగిలిన రోజులు ఎలా వెళ్లబారతాయి..? ఇదే పరిస్థితి మనకీ వస్తే, 



అందుకే ఈ ప్రశ్న ఎలా తప్పించుకోవాలి...?






Comments