ఆ డాక్టర్ గుండెపోటుతో చనిపోతే..చంద్రబాబుగారి రియాక్షన్ ఏంటి ఇలా ఉంది

 ప్రతీదీ రాజకియమేనా..లేక రాజకీయంలోనే ఆయన ప్రతి పని చేస్తుంటారా వరస సందేహాలకు తావిచ్చేలా ఉంది చంద్రబాబుగారి వైఖరి. అసలు నర్నీపట్నం డాక్టర్ గా సుధాకర్ అనే అనస్థీషియన్ రాత్రి గుండెపోటుతో చనిపోయారని తెలిసీ తెలియగానే ఎవరైనా సంతాపం తెలియజేస్తారు..వాళ్ల ఫ్యామిలీకి ఫోన్ చేస్తారు..ఇంకా లేదంటే ఎవరినైనా పంపించి

సాయం చేస్తారు..కానీ ఈయనేంటండీ బాబూ..ప్రెస్ నోటి రిలీజ్ చేసినట్లుగా ఛానళ్లలో బ్రేకింగులు..ఆయన ప్రాణాలకు సిఎందే బాధ్యత అంటూ..

అసలు 1996లో తమరు మొదటి దఫా ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి  ప్రజల వద్దకు పాలన అంటూ అధికారులను నానా హైరానా పెడితే ఎంతమంది ఆఫీసర్లకు గుండెపోటులు వచ్చి..ఆస్పత్రులు పాలై..చనిపోయారో గుర్తుందా..సరే పాత ఎందుకు తవ్వుకోవడం అంటారా..మరి ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేసి ఏడాది దాటిపోయింది..సిబిఐ కూడా తన రిపోర్ట్ కూడా ఏదో ఇచ్చే ఉంటుంది..ఇన్నాళ్లకి ఆయన గుండెపోటు వచ్చి చనిపోయాడని మీ ఛానళ్లే బ్రేకింగులు వేస్తుంటివి..ఈ లోపే మీరు దాన్నిహైజాక్ చేసి దానికి జగనే బాధ్యత వహించాలని అంటున్నారంటే..మీ యాక్టివ్ నెస్ దేనికో తెలిసిపోవడం లేదూ..!

Comments