బాబూ గారూ మీరు మహానుభావులు..కానీ మాకు కాస్త జ్ఞాపకశక్తి తగలబడిందే..ఏం చేస్తాం..!



 ఓ ఎంపిపై అలా దాడి చేస్తారేంటి..ఇది చట్ట విరుద్ధం ..ఇలా విమర్శలు చేసినంతవరకూ ఫర్వాలేదు..కానీ  అది దాటి కూడా చంద్రబాబునాయుడు గారు మరీ వాగ్బాణాలు వాడుతుంటే..ఎందుకో గతం గిర్రున వెనక్కి తిరుగుతోంది..ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ పార్టీ మెంబర్లు కానీ..సభ్యులు కానీ ఆయనపై విమర్శలు ఇలానే చేసారనేది చంద్రబాబుగారి పాయింట్ నంబర్  వన్

ఎస్ వాళ్లు వ్యక్తిగత విమర్శలు చేశారు..బంగాళాఖాతంలో వేయమన్నది నిజమే, నిలువునా ....చేయమన్నదీ నిజమే..

కానీ బూతులు వాడలేదు సర్..! ఏకవచనంతో మాట్లాడారే తప్ప..ఒరేయ్ అనలేదు..మీరు ఇవాళ జూమ ్ బరాబర్ మీటింగ్ లో కూర్చుని నన్ను  ఒరేయ్ అని కూడా అన్నారని ఆరోపించారు..నిజం కానే కాదు..వైెఎస్ జగన్ ఎప్పుడూ మిమ్మల్ని అలా అనలేదు..ఏమయ్యా చంద్రబాబు నాయుడూ అని ఉంటాడు ఖచ్చితంగా  అది కూడా వాళ్ల నాన్నని గుర్తుకు తెచ్చుకుని అరే అచ్చంగా అలానే మాట్లాడుతున్నాడే అనే తొక్కలో బిల్డప్ కోసమే తప్ప వేరొకటి కాదు..కులం ప్రస్తావన తెచ్చారని ఆ ఎంపిపై కేసు పెట్టలేదు సర్..గుర్తుంచుకోండి..ఆయన వీడియోలు మీరు చూడండి..రేయ్...డ్డీస్...క్రిస్టియన్ మత ప్రచారం చేస్తున్నారు..రేయ్ గొర్రెల్లారా..రేయ్..ఒరేయ్..ఏంట్రా..ఏం పీకుతావ్ రా..బిజ్జలగా..అదిగా ఇదిగా అంటూ ఎలాంటి ప్రేలాపనలు పేలాడో తెలుసా..? 


ఇలా మీపై ఎప్పుడూ వైఎస్సాప్సీపీ ఎగరలేదు..పైగా మీరు చెప్తున్న కులాన్ని ఇలా దూషించలేదు..ఆ కమిషనర్ ఆ కులం..ఈ సంస్థ ఈ కులానిది..మీరంతా ఒకటే ఇలాగ అన్నారే తప్ప..వీళ్లంతా ఇలాంటోళ్లు అలాంటోళ్లు అని ఎప్పుడూ అనలేదు..వీళ్లకే దోచి పెట్టుకున్నారు..అలా చేసారు ఇలా చేసారు అన్నారే తప్ప..ఫలానావాళ్లు అలాంటోళ్లు అని వెటకారం ఎగతాళి జుగుప్స కలిగేలా ఎప్పుడూ చేయలేదు..ఆన్ రికార్డ్..ఇది..ఎవడైనా అని ఉంటే..దానిపై యధేచ్చగా కేసులు పెట్టొచ్చు..ప్రవేట్ కేసు పెట్టొచ్చు.



 మీ నోటి నుంచి వచ్చిన మరో ఆణిముత్యం మా ఎమ్మెల్యేలను ముగ్గురిని తీసుకున్నారు అని..వారెవ్వా మీరు 3 ఎంపిలకు కండువా కప్పారు. అందులో ఒకాయన ఇంకా ప్రమాణస్వీకారం కూడా చేయలేదప్పటికి..ఎమ్మెల్యేలు 23 మందిని లాక్కుని..అఁదులో నలుగురిని మంత్రులుగా కూడా చేసి..ఇప్పుడు ముగ్గురిని లాక్కున్నారని వాపోతున్నారే...వారెవ్వా..పైగా టెక్నికల్ గా మీ వాదన అస్సలు చెల్లదు..ఎందుకంటే ఆ ముగ్గురూ మీరు చేర్చుకున్నట్లు వైఎస్సార్సీపీలో చేరలేదు..అలా చేర్చుకోవాలంటే..రాజీనామాలు తప్పవ్..ఇలా ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేసే వైఎస్సార్సీపీలోకి వెళ్లాడు..తిరిగి ఎమ్మెల్సీగా మారాడు..రియల్ సీన్ ఇలా ఉంటే, మీరేదో మహా నీతిజ్ఞుడిలా మావాళ్లని లాక్కున్నారని వాపోవడం..మా జ్ఞాపకశక్తిని అవమానించడమే..


ఇంకోటి మీడియాపై కేసులు ..ఎస్..నిర్ద్వంద్వంగా అది వారి కుట్రే..అందులో ఎలాంటి సందేహం లేదు..అయినా మీరు 2014లో గెలవగానే ఓ ఎన్నింటాయన ఛానల్ లో ఓ సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పబడే వ్యక్తిని తొలగించేవరకూ ఆ ఛానల్ ఏపీలో రాకుండా చేసిన చరిత్ర లేదా..సదరు వ్యక్తికి అందుకే కదా..సాక్షిలో పెద్ద పీట వేసారు. అన్నీ మీరు నేర్పించి..ఇప్పుడు ఇదేమిటి ఈయన  ఇలా చేస్తున్నాడనవద్దు సర్..! ఎందుకంటే ఇప్పటి తరం గత తరం అనుభవాలను వెంటనే వంటబట్టించుకుని..నాలుగు ఆకులు కాదు..అసలు  చెట్లకి చెట్లనే చదివేస్తున్నారు..

Comments