పిడకలతో పొగ..పెరుగుతుందట ఆక్సిజన్ నాయనా..! ఏందిరా సామీ ఈ అగచాట్లు

 


ఓ వైపు ఆనంద్ ఆయుర్వేదం పై ఎంత హంగామా జరుగుతుందో చూస్తూనే ఉన్నాం.. ఈ తరుణంలో తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనిలో గోశాలలో ఆవు పిడకల పొగతో ఆక్సిజన్ పెరుగుతుందంటూ హడావుడి చేస్తున్నారు. ఇలాంటివి

వింటుంటే ఎక్కడకు పోతున్నామో అర్ధం కావడం లేదు. ఇలా పిడక పొగతో ఆక్సిజన్ లెవల్ పెరగడమేంటి..అసలు ఈ కార్యక్రమం అసలు ఉద్దేశం ఏంటో తెలీకుండా ఊదరగొట్టడం కరెక్ట్ కాదు


పైగా ప్రాచీనకాలంలో కలరా, మలేరియా, వ్యాధులకు ఈ పొగ వేసేవారంటూ చెప్పడం మరీ విచిత్రం


ఆవు పిడకలు, నెయ్యి, పచ్చ కర్పూరం, పసుపు ఆవాలు మండిస్తే...పొగ వస్తుందట..ఆ పొగతో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని చెప్తున్నారు..ఇంతకీ దీనికి ఆవు పిడకలే ఎందుకనే ప్రశ్నకి సమాధానం రాదు. విసర్జితాల్లో అమ్మోనియా ఉంటుందనేదే ఈ శాస్త్రమా..దానికి పిడకలు ఎందుకు 

నెయ్యి, కర్పూరం, పసుపు, ఆవాలు చాలవా..అయినా ఇప్పుడు తిండికి లేక ఏడుస్తుంటే ఇలా ధూపం పేరిట కర్పూరం, పసుపు, ఆవాలు ఎక్కడ్నుంచి కొనాలి..ఇవన్నీ మామూలు రోజుల్లో ఓకే..ఇలాంటి కరువు రోజుల్లో ఖరీదైన ధూపాలు అవసరమా స్వామీ

ఇలా రాస్తున్నందుకు పురాణాలను, చరిత్రను ఈసడిస్తున్నట్లు కాదని అర్ధం చేసుకోగలరు..ఇంకా గట్టిగా విమర్శిస్తే..ఒకటే సమాధానం..ఇలా ఆక్సిజన్ లెవల్స్ పెరిగితే...ఆ ఊళ్లో వారందరినీ అక్కడికే తెచ్చి రోజూ చేపించమనండి..కళ్లు మండి..కడుపులో మంట పుట్టి నానా అవస్థలూ పడకపోతే అడగండి

Comments