పోలీసుల వాహనం వద్దన్నది ఇందుకా..ఇలా కాళ్లూ వేళ్లూ చూపించేందుకా..?


జైలు నుంచి ఆర్మీ ఆస్పత్రికి వెళ్లాలంటే..పోలీసులు ఏర్పాటు చేసిన తుఫాన్ వెహికల్ కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పి..వద్దని..సొంతబండిలో బయలు దేరింది ఇందుకా..?

ఇలా కాళ్లెత్తి కూడా సదరు రెండు ఛానళ్లకి సాయపడేందుకా..కావాల్సినంత సరుకు అందించేందుకా అని వైఎస్సార్సీపీ లీడర్లు ఆరోపిస్తే అందులో అతిశయోక్తి ఏమీ లేదు..పైగా తన భర్త గుండె సంబందింత జబ్బుతో బాధపడుతున్నట్లు ఆయన భార్య, తన తండ్రికిఅనేక జబ్బులుతో బాధపడుతున్నట్లు ఆయన కొడుకు బాధపడిన నేపథ్యం కూడా గుర్తుకుతెచ్చుకోవాలి..మరి ఈ చర్యలు చూస్తుంటే అవన్నీ వట్టివని అనుకోవాలి..అసలు ఆయన ఆరోగ్య పరిస్తితిని దృష్టిలో పెట్టుకునే కదా, కోర్టు అంత హుటాహుటిన సికింద్రాబాద్ కి తరలించమని చెప్పింది..మరి ఈయన చూస్తే ఇలాగ చేయడం ఏంటనే విమర్శలు ఒక్కసారిగా ప్రారంభం అయ్యాయ్.  ఓవేళ తనకి తగిలిన దెబ్బలను చూపించదలిచారు అనుకుంటే, అదెటూ ఆస్పత్రిలో చూస్తారు కదా..మధ్యలో జనాలకెందుకు చూపించడం..ఇక్కడ తీర్పులు ఇచ్చేది జనాలు కాదు , వైద్యుల నివేదిక చూసి కోర్టులు కదా..!

పైగా బెయిల్ కూడా రాని వ్యక్తి ఇలా సొంతవాహనంలో ప్రయాణించడం..ఆ పై ఇలా సంజ్ఞలు చేయడం కోర్టు దృష్టికి తీసుకువెళ్లడం సరియైనదేనా..? ఇది ఖచ్చితంగా ఆయన తరపు న్యాయవాదులే చెప్పాలి

Comments