ఏంటీ ఎడ్డింగు..అంటే అసలు ఏపీలో ఏం జరుగుతుందో ఢిల్లీ ఎంపిలకు తెలీదా..? మరి గత వారమంతా ఢిల్లీ లెవల్లో అట్టుడికిపోయింది దోసె మాడిపోయిందని మనమే రాశామే..!

 

బాబో నన్ను కొట్టారు చూడండంటూ అన్ని గడపలూ దిగుతున్న ఈ ఎంపిని అస్సలు కాలు బైటపెట్టవద్దని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఐతే అప్పట్నుంచి కూడా ఏ మాత్రం తన ఆరోగ్యాన్ని, నొప్పిని పట్టించుకోకుండా న్యాయం కోసం ఆ గడపా ఈ గడపా తిరుగుతున్న సదరు ఎంపిగారు సాటి ఎంపిలకు ఓ లేఖ రాసారట..అది చూసి కాంగ్రెస్ ఎంపి మానిక్కమ్ ఠాట్..ఏపీలో ఏం జరుగుతుంది. ఇంకా నయం నేను తెలంగాణలోనే ఉన్నా..ఇదే ఆక్కడ ఇన్ ఛార్జ్ అయి ఉంటే నాగతి ఏమై ఉండేదంటూ వాపోయారట..ఇంత ఇదా..మరీ అంత అదా..అంటూ రిప్లై చేసారట ట్విట్టర్లో


దీంతో అప్పటికికానీ మిగిలిన ఎంపిలకు స్పృహ రాలేదు..ఏంటిది అంటూ విస్మయం చెందారట..కడవల కొద్దీ సంభ్రమాశ్చర్యాలకు కూడా లోనయ్యార్ట..మరి ఈ రాతలు అలానే ఉన్నాయ్..
అసలు ఇప్పటిదాకా వాళ్లకి ఈ సంగతే తెలీనట్లు మూర్ఛపోయారు..తెలీగానే ఏయ్..ఎవరా జగన్ అతని అంతూ పొంతూ చూసి పడేస్తాం పో అంటూ ఈయనకి భరోసా ఇచ్చార్ట..ఐతే అదేం ఇఁదులో లేదులెండి

రాబోయే పార్ల్మెంట్ సమావేశాల్లో తనకి మద్దతివ్వాలని కోరడమే ఆలస్యం ...ఓకే బెదర్ నీ ఎనకాలే మేం. అన్నారన్నట్లుగా ఈ కథనం సాగింది కానీ..అసలు ఢిల్లీలోనే కాదు. యావద్ భారతదేశం ఏపీలో ఈ ఎంపిపై జరిగిన దాడిని ఖండించిందని..అప్పట్లో వీళ్లే ఊదరగొట్టారు. 

ఐతే ఇంకా ఈ దాడి ఆరోపణలో ఓ మిస్టరీ ఉఁది..ఆయనే ముసుగులు వేసుకుని ఐదుగురు కొట్టారని చెప్తున్నారు..ముందేమో సిఐడి అన్నారు. తర్వాతేమో పోలీసులంటున్నారు..ఇంతకీ క్లారిటీ  ఏమని ఇస్తారు..ఐదుగురు సిఐడి పోలీసులు ముసుగేసుకుని, ఈయనకి కోటింగ్ ఇచ్చారనా..ముసుగేసుకుని ఎలా కొట్టారు..పైగా అటూ ఇటూ నడిపించి..దెబ్బ సరీగా తగల్లేదని మరీ మళ్లీ కొట్టారంటున్నారు కదా..దీని కంటే సిఐడీలే వారిని గుర్తుపట్టకుండా తనపై దాడి చేసినట్లు క్లియర్ గా చెప్పొచ్చు కదా..! 

బెయిల్ ఇచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు ఏమని కామెంట్ చేసిందో అన్ని పత్రికలూ పెద్ద పెద్ద అక్షరాలతోనే రాశాయ్..
ఎక్కడా ఈ కేసు గురించి మాట్లాడొద్దు..నంబర్ట్టూ   గాయాలు ప్రదర్శించవద్దూ అని మరి ఇదేంటి

Comments