ప్రవేట్ ఆస్పత్రులకే మా మద్దతంటోన్న టిడిపి అదే బాటలో ఈ ఛానల్


మనం ఎటువైపు ఉన్నాం, ఎవరితో తిరుగుతున్నాం అన్న దాన్ని బట్టి మనలని అంచనా వేస్తారు. అలానే ఎటువైపు ఉండాలి. ఎలాంటి ఇమేజ్ కావాలనేదానిపైన ఓ క్లారిటీ ఉన్నవాళ్లు ఇతరులు ఏమనుకుంటారనే విషయంపై పెద్దగా
ఆలోచించరు .  ఈ రెండు లైన్లు మన స్టోరీకి కామెంట్లు పెట్టేవాళ్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. 

అటు ఏపీ..ఇటు తెలంగాణలో ..ఆ మాటకి వస్తే దేశంలోనే ప్రవేట్ ఆస్పత్రులు కరోనా టైమ్లో ఎలాంటి వైఖరి అవలంబిస్తున్నాయో అందరికీ తెలుసు..ఇక్కడ మళ్లీ అన్నీ కాదు..కొన్ని అంటూ సన్నాయి నొక్కులు అనవసరం. ఒక 200 రూపాయలు ఓపి ఫీజ్ తీసుకునే డాక్టర్ ఎకాఎకిన 400కి పెంచడం దుర్మార్గం కాదా..అక్కడ ప్రారంభమైన ఈ దోపిడీ కరోనా రోగులపై ఏ స్థాయికి వెళ్లిందంటే లక్షలు గుంజుకోవడం..కొంతమందికి లాక్ డౌన్ కొత్త వ్యాపారాలను తెచ్చిపెడితే ఇలాంటి వైద్యులకు లక్షాధికారులు అయ్యే అవకాశాన్ని తెచ్చి పెట్టింది. మధ్యతరగతి వాళ్ల ఆస్తులు మిగలవు కరోనా పూర్తయ్యేనాటికి..వైద్యులకు అప్పులు ఉండవు అనే కామెంట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది . అందులో వందశాతం నిజం ఉంది

మరి అలాంటి వైద్యశాలలు..పైసాచికాలపై చర్యలు తీసుకుంటే నొప్పి ఎవరికి కలగాలి..ఆయా యాజమాన్యాలకు వారికి మద్దతు ఇచ్చేవారికే కదా..మరి మధ్యలో టిడిపికి ఎందుకు బాధ..నిజంగా పేదల పక్షం నిలిచేదైతే..మూసుకుని కూర్చోవాలి. అంతేకానీ అందులో కూడా ఫలానావాళ్లని టార్గెట్ చేశారు..వీడిని టార్గెట్ చేశారు అంటూ ఏడుపులు నటిస్తూ ప్రవేట్ ఆస్పత్రులపై చర్యలు సబబేనా అంటూ తొక్కలో డి స్కషన్స్ అవసరమా..లేదు అరకొర వసతులతో 
ట్రీట్ మెంట్ ఇవ్వలేకపోతోన్న ప్రభుత్వాసుపత్రులపైనే చర్యలు తీసుకోవాలా  ఎప్పుడూ..? 

ఈ ఏడుపు కంటే..కేసు టూ కేస్ తీసుకుని...ఇదిగో ఇక్కడ ఫలానావాడు మంచోడైనా టార్గెట్ చేశారు..అని డీటైల్స్ తో ఢంకా భజాయించవచ్చు..అలా కాకుండా ఇదేదో పాలసీలాగా ప్రవేట్ ఆస్పత్రులన్నింటికీ తామే సపోర్ట్ అన్నట్లుగా  ఏడవడం ఏంటి.. ఏ ఊరిలో ఎవరిని టార్గెట్ చేశారో డీటైల్స్ తో కౌంటర్ ఇస్తే ఎటూ వాటిని ప్రసారం చేయడానికి మన రెండు ఛానళ్లు ఉన్నాయ్ కదా..!
ఇలా డిస్కషన్లు పెట్టడంతో నే ఎవరు ఎటువైపనేది తేలుతుంది. మధ్యలో ఏదీ తెలీకుండా నాసిరకం మద్తతు అనవసరం 

పైగా ఈ డిస్కషన్ లో పైన టైటిల్ చూడండి పిల్ల కరోనా అట..బుద్ది ఉన్నవాడెవడైనా ఇలా పెడతాడా..కరోనా చెప్పిందా..పిల్ల పెద్ద అంటూ ఏదో సబ్ ఎడిటర్ పైత్యం కాకపోతే



 

Comments