నిన్నెవడు బెదరమన్నాడు..అదరమన్నాడు..? అజో...విభో...భయపడేవాళ్లంతా చుట్టుపక్కల పడుకోమన్నాట్ట వెనకటికి ఒకడు

 మాకు భయం లేదు..మా పై కేసుపెట్టినవారిని వదలం..మేమూ కేసు పెడతామంటూ తన కంఠశోషని మొదటిపేజీలోనే అచ్చొత్తుకుని ఆనందించిన ఓ పత్రికాధిపతి రాత చూస్తే..అయ్యో ఇంత భయమేలా అన్పిస్తుంది..పైగా న్యాయమూర్తుల పదవీకాలాన్ని కూడా ఇప్పట్నుంచే లెక్కపెడుతూ..అదిగో చూశారా వీల్లంతూ మరో రెండేళ్లు ఉంటారు

కాబట్టి చూస్కోండిక అన్న సంకేతాలు కూడా ఇస్తున్నారు..రాజద్రోహం కాకపోతే..మరో పెట్టీ కేసు..పెట్టాలంటే ఎన్ని కేసులు పెట్టగలవో..శ్రీమదీయ కేసీఆర్ గారు గత టర్మ్‌లో ఎంచక్కా చూపించారు నిజంగా  చాలామంది అంటుంటారు..ఈ దమ్మున్నోళ్లంతా ఒక్క జగన్‌పైనే ఎందుకు తమ పెతాపాన్ని చూపిస్తున్నారు..అక్కడ మోదీ కానీ...ఇక్కడ కేసీఆర్‌పై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేరు అని


ఎందుకంటే డియా లేదు..గీడియా లేదు..అరెకరం లోపలకి తొక్కుతా..బొంద పెడతా అన్న గద్దింపుతోనే సగం బిక్కచచ్చిపోయారు..పైగా గిట్టనివారిపై కేసులుపెట్టడం కేసీఆర్ దిట్ట..ఎవడేమనుకుంటాడో అనే  ఊసు కూడా రాదసలు..ఎదురొస్తే దున్నేస్తాడంతే..ఎవరైనా సరే..అందుకే ఆ దెబ్బతో ఇప్పటికి కాదు మరో ఐదారేళ్లైనా ఎవడూ మాట్టాడడు..మాట్టాడే పత్రికలు కానీ చానళ్లు కానీ..వాటి ఎజెండా వేరే..కేవలం కేసీఆర్ ని బద్నామ్ చేయడానికే కంకణం కట్టుకున్నాయవి..వాటికి కూడా సేమ్ టూ సేమ్..ఏదున్నా..సిఎంకి అంటగట్టేసి రాసేయడమే..అందుకే వాటిని పట్టించుకోడసలాయన


మరి మోదీ..హర హర మోదీ హర్ ఘర్ మోదీ అనే స్లోగన్ ప్రారంభమైంది మొదలు ఏ దమ్మున్నోడూ ఆయనవైపు చూడడు..చూస్తే ఏమవుద్ది మన చెత్త కార్యక్రమం తాలూకూ అంబాసిడర్ పదవులు ఊడతాయ్..డైరక్ట్ గా పి ఎండ్ బి నుంచే ఫోన్ కాల్స్  వచ్చేస్తాయ్..జస్ట్ పదోనంబర్ గడిలోని ఓ ఛానల్ కి ఇలానే ఫోన్ కాల్స్ రావడంతో దెబ్బకి యాంటీ స్టోరీలు పడటం ఆగిపోయాయ్..మరి ఇక జగన్ అంటే..ఏముంది..ఆయనకి కూడా ఓ పత్రిక ఉంది

ఓ ఛానల్ ఉంది..ఏదైనా ఉంటే..వాటిపై పడి ఏడవవచ్చు అంతే..పైగా బోలెడన్ని మానుప్యులేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ల జోలికి ఎలా రావాలో..అతగాడికి అంతగా తెలీదు..డైరక్ట్ గా యుద్ధమే తప్ప..టాక్ట్‌పుల్‌గా డీల్ చేయడం జగన్ అలవాటు చేసుకోలేదు.అసలా అవసరమే లేదన్నట్లుగా ఉంటుందాయన స్టైల్..బహుశా జనం తన వెనుక ఉన్నంతవరకూ కొంత తగ్గడం కొంత దెప్పడం లాంటి పద్దతుల జోలికి పోవాల్సిన అవసరం లేదనేది ఆయన ఫీలింగ్ అనుకుంటా


ఇవాళ్టి చెత్తపలుకులో పాపం..ప్రస్తుతానికి బలం ఉన్నంత మాత్రాన ఎప్పుడూ ఇలానే ఉంటుందనుకోవడం భ్రమ..అందుకే ఢిల్లీ పెద్దలు కూడా ఈయనకి సహకరిస్తున్నారంటూ ఓ నిజం ఒప్పుకున్నాడా పత్రికాధిపతి..ఎస్..బలం ఉంది కదా 

మరింకేంటి..మనకి నచ్చని అటాక్ చేస్తే..ప్రజావ్య.తిరేక వైఖరి కాదు..ఇలాంటి అటాకింగ్స్ గత ముఖ్యమంత్రులు కూడా చేశారు..అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందేం..ఎందుకంటే ఎందుకంటే..ఇప్పుడు దెబ్బ తలుగుతుంది మనకి మరి..


అంతే జస్ట్ రాజకీయాలు..దీని వెనుక ప్రజా పరమార్ధం ఉందని నమ్మించడమే అసలు ప్రజాద్రోహం


కొసమెరుపు ఏమిటంటే..ఢిల్లీ టూర్ అనగానే బోలెడంత కథనాలు వండి వార్చారు..బెయిల్ రద్దు భయంతోనేగా టూర్లు..లేకపోతే ఇప్పుడెందుకు అంటూ తెగ వాయిస్ఓవర్లతో కుమ్మేశారు..పాపం ఇప్పుడు అది కాస్తా రద్దయ్యేసరికి ఛ

అనుకుని ఉంటారు..మరి బెయిల్ రద్దు భయం పోయిందా జగన్ కి..చెప్పండి సారూ..! పైగా అమిత్ షా అప్పాయింట్ మెంట్ దొరికిన తర్వాత రద్దైన మొట్టమొదటి టూర్ ఇది..!


Comments