గేమ్..మొదలైంది..అలానే ఉంది..ఏబిఎన్‌తో వైఎస్ షర్మిల కొత్తగా చెప్పిందేం లేదు..! సెంటిమెంట్ టచ్! టిడిపిని పూర్తిగా డిజప్పాయింట్ చేసిన అన్న బాణం

 


( పైన ఫోటో ఏబీఎన్ ఛానల్ ది)



"భూమి బద్దలైపోద్ది..ఇక ఈ ఇంటర్వ్యూతో జగన్ అసలు రూపం బైటపడిపోద్ది..

చెల్లిని కూడా అన్యాయం చేసాడే

సొంత చెల్లెలితో తేడా ఎందుకొచ్చిందో తెలిసిపోద్ది

వైఎస్సార్సీపీతో షర్మిల తాడో పేడో తేల్చుకుంటుంది..

ఇక మనకి పండగే "


ఇదిగో ఇలాంటి రకరకాల అంచనాలను పెంచేసి, ఏబిఎన్ ఆంధ్దజోతి ఇంటర్వ్యూతో టిఆర్పీలను విపరీతంగా ఆకట్టుకోవచ్చుని స్వామికార్యం

బాబుకి సాయపడే విమర్శలనుబైటికి తీసుకొచ్చే స్వకార్యం ( రెండూ ఏదెటు అయినా) అన్నీ తీరిపోతాయని ఆర్కే ఓపెన్ హార్ట్ అంటూ ఓ సీజన్ ప్రారంభిస్తే

అది కాస్తా తుస్సుమంది


ఒకటి..జగన్ తో తనకేదో విబేధాలున్నాయని షర్మిల చెప్తుందని ఆర్కే+'టిడిపి ఆశించి బొక్క బోర్లా పడ్డారు.

అఫ్ కోర్స్ అసలు అలాంటి ప్రశ్నలు రాకుండానే తాను కండిషన్ కూడా పెట్టి ఉండొచ్చు


ఈ ఇంటర్వ్యూతో వైఎస్ఆర్ ఇమేజ్‌ని ఆర్కే ఒప్పుకుని( బోడి ఆయన ఒప్పుకోలు ఎవరిక్కావాలనేది కోట్లాదిమంది ఓపీనియన్) తీరాల్సి వచ్చింది


వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ పై ఆమేదో ఎవరిపైనో విమర్శలు చేస్తుందని ఆశించినోళ్లకి పెద్ద షాక్


ఇక పార్టీ పెట్టడంపై అందరికీ తెలిసిందే, అందరిలో ప్రచారంలో ఉన్నదే ఆమె కూడా చెప్పింది. జగన్ అన్న వద్దన్నాడు..నేను కావాలన్నాను..సంబంధం లేదన్నారు

నాకు మనసుకు బాధ కలిగించింది..ఇందులో కొత్తగా జగన్ పై పడే నింద ఏం లేదు..పైగా ఆయన ఆశించిన ఎఫెక్ట్ ఆర్కేనే తీసుకువచ్చాడు..జగన్ కి షర్మిల పార్టీకి 

సంబంధంలేదనేది తెలంగాణలో వాళ్లు గుర్తించాలని నొక్కి చెప్పినట్లైంది


విబేధాలు...కూర్చుని మాట్లాడుకోలేనంతవి కాదని కుండబద్దలు కొట్టింది..రోజూ మాట్లాడుకుంటామనే మరో క్లారిటీ ఇవ్వడం ద్వారా ఇద్దరి మధ్యా మాటలు లేవనే ప్రచారానికి తెర పడినట్లే..(అసలు ఈ అన్నాచెల్లెళ్ల మధ్య మాటల సంగతి జనాలకెందుకు) 


ఎవరి బాణాన్ని కాదని అన్నది..ఆ నోటితోనే ఎకాఎకిన సిఎం అభ్యర్ధిగానే స్పష్టంగా చెప్పుకొచ్చింది..అంటే ఇదెవరికి ఎర్త్? సాధ్యాసాధ్యాల సంగతి పక్కనబెడదాం..స్వయంగా జగన్ పార్టీకే ఇక్కడ గెలిచింది 1 ఎంపి, ముగ్గురు ఎమ్మెల్యేలు..( అప్పట్లో) అంటే..తానో బలమైన పార్టీగా ఉండాలనే సంకేతాన్ని బాగానే పంపింది


మరీ ఇంటర్వ్యూతో ఏం సాధించింది..

ఓ రకంగా తనకి ఓ మీడియా తప్పనిసరి పరిస్థితుల్లో అయినా స్పేస్ ఇస్తుందని క్లారిటీ వచ్చింది. దీన్ని ఎవరు ఎలా అయినా వాడుకోవచ్చు..ముఖ్యంగా తనపై ఆంధ్రా ముద్ర పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. దీని ద్వారా జగన్‌కి ఏదో డామేజ్ అవుతుందని..రేపట్నుంచి ప్రెస్ మీట్లలో ఈ ఇంటర్వ్యూ ఆధారంగా కేకలు మంటలు అరుపులు పుట్టించవచ్చనే పద్మనాభాలకు, రాజబాబులకు పెద్ద షాక్..అ( అఫ్ కోర్స్ ముందే ఆర్కే ఆ పార్టీలీడర్లకు చెప్పే ఉండొచ్చు..బొక్క మీరనుకునే అంశాలేం ఉండవ్ ఇందులో ) 

ఏతావాతా లాభపడింది ప్రచారం పరంగా షర్మిలనే..చూసారా అన్నతోనే పేచీ పెట్టుకుని మరీ తెలంగాణలో పార్టీ పెట్టిందబ్బా అనే ప్రచారాన్ని మరింత బలంగా తీసుకోపోయేందుకు సెంటిమెంట్ టచ్ బోలెడంత దక్కింది


టీఆర్బీ పరంగా ఏబీఎన్..

మరి నష్టపోయింది...

తెలుస్తూనే ఉందిగా..!


Comments