అంతా పాలపొంగే..! స్టాక్ మార్కెట్లు క్రాష్ అవడం ఖాయం..అంతా రోజుల్లోనే అవిరైపోతుంది..! సవాకామీ పేపర్ యాడ్స్! ఈ జపాన్ భీష్ముడి హెచ్చరికలు నిజమయ్యేనా..?

 




అవసరానికి మించిన డబ్బుతోనే ఈ లాభాలు

బుడగ పేలడానికి సిద్ధంగా ఉంది

టైమెంతో లేదు..అంతా కొన్ని రోజులే

భారీగా పేపర్ యాడ్స్‌తో బెంబేలెత్తించిన అట్సుటో సవాకామీ

నిక్కాయ్, అసాహీ పేపర్లలో ఫుల్ పేజ్ ప్రకటనలు

జపాన్‌లో మ్యూచువల్ ఫండ్లని పరిచయం చేసిన సవాకామీ

అక్కడి మార్కెట్లలో లెజెండ్‌గా ప్రాచుర్యం


స్టాక్ మార్కెట్లలో ఇప్పుడు కన్పిస్తున్న లాభాలు, మార్కెట్ వేల్యేషన్స్ అంతా ఆవిరి అయిపోతాయని..బబుల్ ( బుడగ )

పేలిపోవడం ఖాయమంటూ జపాన్‌లో రెండు రోజుల క్రితం భారీగా పేపర్ యాడ్స్ కలకలం రేపాయ్. దానికి తగ్గట్లుగానే 

ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి చోటు చేసుకుంది. దీంతో అసలు ఈ పేపర్ యాడ్స్ ఏంటి..ఎవరిచ్చారు

నిజంగా  గ్లోబల్ మార్కెట్లు క్రాష్ అవడానికి సిద్ధంగా ఉన్నాయా అంటూ ప్రశ్నలు బయలుదేరాయ్.


నిన్న భారీగా అమెరికా మార్కెట్ల పతనం

రెండు రోజుల నుంచి ఇండియన్ ఈక్విటీల్లోనూ భారీగా అమ్మకాలు

యూరప్ సహా ఇతర మార్కెట్లలోనూ సెల్లాఫ్ 

మరి సవాకామీ అంచనాలు నిజమవుతున్నాయా...?



అసలు ముందు ఈ సవాకామీ ఎవర్రా బాబూ...పేపర్లలో ప్రకటనలు ఇచ్చి మరీ హెచ్చరికలు జారీ చేసేంత అవసరం ఏంటి అని అలోచిస్తే, జపాన్ దేశంలో పిక్టెట్ అసెట్ మేనేజ్‌మెంట్ అని మ్యూచువల్ ఫండ్ ఉంది. దానికి ఈయన మాజీ హెడ్.

దేశంలో మ్యూచువల్ ఫండ్స్ డైరక్ట్‌గా జనాలకే అమ్మేలా విప్లవం తీసుకొచ్చిన ఘనుడిగా ఈయన్ని చెప్తుంటారు. అతి తక్కువ ఖర్చుతో మ్యూచువల్ ఫండ్స్ ని జపాన్‌వాసులకు పరిచయం చేశాడంటారు.


ప్రస్తుతం ఆయన కొడుకు ర్యో సవాకామీ ఈ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. $3.3 బిలియన్ డాలర్ల 

అసెట్స్ వీరి నిర్వహణలో ఉన్నాయ్. వీటిలో 91శాతం స్థానిక ఈక్విటీల్లోనే పెట్టుబడి ఉండటం గమనార్హం


ఏం చెప్పాడు అట్సుటో సవాకామీ


" స్టాక్ మార్కెట్లకు వీలైనంత దూరంగా పోండి..ఇప్పుడిక మేలుకోవాల్సిన సమయం వచ్చేసింది 

బబుల్ పేలడానికి ఎన్నో రోజులు పట్టదు " అంటూ యాడ్స్ ఇచ్చాడు


జపాన్ మార్కెట్లు ఆల్‌టైమ్ హై లో భారీగా లాభాలు ఎంజాయ్ చేస్తున్న సమయంలో వచ్చిన ఈ యాడ్స్ సంచలనం కలిగించాయ్.  ఈ నెలలోనే జపాన్ నిక్కీ 225 స్టాక్ ఎక్స్‌ఛేంజ్ కానీ, టోపిక్స్ ఇండెక్స్ కానీ ప్రపంచంలోనే అత్యుత్తమ లాభాలను పంచిన ఇండెక్స్‌లుగా రికార్డు క్రియేట్ చేశాయ్..ఇలాంటి సమయంలో వచ్చిన ఈ ప్రకటనలతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తుతున్నారు. 


సున్నా శాతం వడ్డీతో వస్తున్న అప్పులతో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం స్టాక్ మార్కెట్లలోకి మదుపరులను ప్రోత్సహిస్తున్నారని, ఇక ఎవరి లాభం వారు చూసుకుని వెళ్లిపోతే..ఈ రిటైల్ ఇన్వెస్టర్లు పూర్తిగా మునిగిపోతారని, అసలు రిస్క్ ఎవేర్‌నెస్ లేకుండానే పెట్టుబడి పెడుతున్నారంటూ సవాకామీ చెప్తున్నారు


Comments