లే బాసూ...లే..! మధ్యాహ్నం కల్లా బొంబాయిలో ఉందాం..సాయంత్రం రిటన్ అవుదాం..! ఇదిగో తోక..అదిగో బుల్లెట్ రైలు..ఏంటీనాడు పైత్యం

 ప్రధాన పత్రికలన్నీ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాపై పడి ఏడుస్తుంటాయ్. కన్వీనెంట్ గా అంతకి మించిన ద్వంద్వార్ధాలను..తప్పుదారి పట్టించే హెడ్డింగులతో తమ వెబ్ ఎడిషన్లను నింపేస్తుంటాయ్..ఇవాళ యాథాలాపంగా ఓ పత్రికని వెబ్ లో తిరగేస్తుండగా ఇదిగో ఈ ఫోటో కన్పించింది


చూసినోడికి ఎవడికైనా ఓర్నీయ..హైదరాబాద్ కి బుల్లెట్ రైలొచ్చేసిందే...లేకపోతే కనీసం మోడల్ రైలైనా పంపించినట్లున్నారు అనుకునేలా ఉంది..(ఇట్టనే అమరావతిలో కూడా హైపర్ లూపులు వచ్చేశాయప్పట్లో) 
పైగా ఎన్ని గంటల్లో కూడా వెళ్లొచ్చో..కింద ఇంకో లైన్ ఎవడైనా..భలే భలే అనుకుంటారు కదా..


కానీ తరచి చూస్తే అర్ధమైంది..పాలకులకు భజన కొట్టే అవకాశం ఎక్కడున్నా వదలని పాత్రికేయ నైజంలో భాగంగా ఇదొచ్చి వెబ్ ఎడిషన్ లో వాలిందని..


దీనెమ్మ జీవితం మూడుగంటల్లో ముంబై అంటే..మధ్యాహ్నానికి పోయి పని చూసుకుని మళ్లీ సాయంత్రానికి రిటన్ అవ్వొచ్చనుకునే నాబోటి వెర్రి వెంగళాయిలకు కొదవేముంది


ఇంతా చేస్తే..భూసేకరణ కూడా కాదు..సాధ్యాసాధ్యాలపై పరిశీలన అంటూ అక్కడెక్కడో పూణేలో జిల్లా కలెక్టర్ సర్వే కోసం ఆరా తీస్తే..మనోడు పట్టుకున్నాడు..ఇంకేముందు నమస్తే తెలంగాణలో ఇదిగో మా టిఆర్ఎస్ ఘనత...బుల్లెట్ రైలు తెస్తున్నం అంటడు


ఇంకోడు ఎహే మన బాఘ్యనగరానికి మరో మణిహారం అంటడు..ఇంకోడు విశ్వనగరంపై బుల్లెట్ అంటూ ఏదో పైత్యం ప్రదర్శిస్తడు..ఏతావాతా అది ఇంకో 20ఏళ్లైనా ముందుకు జరగదు. ఎందుకో తెలుసా..ఇది విశ్వనగరం బాబూ...ఇప్పుడు పడుతున్న చినుకులకు నగరం ఎట్టా ఉందో మాకంటే అనుభవిస్తున్న వాాళ్లకె తెలుసు..


కనీసం బుల్లెట్ రైలు సాధ్యాసాధ్యాలపై పరిశీలన అని హెడ్డింగ్ పెడితే రోగమా...! ఎబ్బే అట్టపెడితే చదవరండీ అనుకుంటూ వీళ్లకి వీళ్లే భుజాలు తుడముకుని సమర్ధనలు మరి..!



Comments

  1. మీ టపాలు భలే ముచ్చటగా ఉంటాయి.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ అండీ...ఇక్కడ జై గొట్టిముక్కల గారు చనిపోయారని విన్నా..చాలా బాధగా అన్పిేంచింది..నేనూ కరోనా నుంచి ఈ మధ్యనే కోలుకున్నా..చాలా పెయిన్ అండీ...మన విమర్శకులు..ఇతరులూ అంతా క్షేమమే కదా

      Delete
  2. థ్యాంక్యూ అండీ...ఇక్కడ జై గొట్టిముక్కల గారు చనిపోయారని విన్నా..చాలా బాధగా అన్పిేంచింది..నేనూ కరోనా నుంచి ఈ మధ్యనే కోలుకున్నా..చాలా పెయిన్ అండీ...మన విమర్శకులు..ఇతరులూ అంతా క్షేమమే కదా

    ReplyDelete

Post a Comment