10 నిమిషాల్లో రూ.850 కోట్ల లాభం..! నా రాజా..! ఏమి పట్టురా సామీ..మొత్తానికి పండగ చేసుకున్న రాకేష్ ఝన్‌ఝన్‌వాలా



 స్టాక్ మార్కెట్లలో ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝన్ వాలా పట్టిందల్లా బంగారమే అనడంలో చాలామందికి సందేహం లేదు అయితే కొన్ని స్టాక్స్ విషయంలో ఆయన పట్టు వదలని విక్రమార్కుడు కూడా..అందుకే టైటన్ కంపెనీపై నెగటివ్ రేటింగ్స్ వచ్చినా...లాస్ అవుతున్నా..తన వాటా మాత్రం వదల్లేదు. కాస్త వాటా తగ్గించుకున్నారేమో కానీ అందులోని 4.81 శాతం స్టేక్‌ని అలానే కొనసాగించారు. దానికి తగిన ప్రతిఫలం కూడా దక్కించుకున్నారు


ఇంట్రాడేలో టైటన్ కంపెనీ షేర్లు దాదాపు పదిశాతం పెరగడంతో పాటు రూ.2347 రికార్డు ధరకి చేరింది. దీంతో అందులో వాటాదారుల సంపద  కూడా రాకెట్‌లా దూసుకుపోయింది. 



రాకీభాయ్, ఆయన భార్య రేఖా ఝున్‌ఝన్‌వాలా ఇద్దరికీ కలిపి టాటా గ్రూప్ జ్యూయెల్ క్రౌన్-టైటన్‌లో 4.81శాతం  వాటా ఉండగా, ఇవాళ మార్కెట్లలో ఆ షేర్లు జూమ్ కావడంతో వారి సంపద ఏకంగా రూ.854 కోట్లు పెరిగింది


మొత్తంగా టైటన్ కంపెనీ మార్కెట్ కేపిటలైజేషన్‌కి అదనంగా రూ.17770 కోట్లు వచ్చి పడగా, అందులో రాకేష్ ఝన్ఝన్ వాలాది రూ.850 కోట్లు.


రికార్డు ధరకి ఎగసిన తర్వాత  టైటన్ షేరు పదిశాతం అప్పర్ సర్క్యూట్ కూడా తాకింది.

రూ.2362 దగ్గర ఆప్పర్ సీల్ పడిన తర్వాత తిరిగి లాక్ ఓపెన్ అవడంతో రూ.2350-2360 మధ్య విపరీతమైన ట్రేడింగ్ సాగుతోంది ఈ కౌంటర్‌లో ఇప్పటికే 45లక్షల షేర్లు చేతులు మారాయ్. దీంతో రాకీ భాయ్ విజన్‌కి ట్రేడర్లు సలాం కొడుతున్నారు. 


ఫండమెంటల్స్ మంచిగా ఉండి, అన్నీ బావున్న కంపెనీల కోసం ఎన్ని రోజులు ఎదురు చూసినా తప్పులేదనే విషయాన్ని టైటన్ ర్యాలీ మరోసారి ఋజువు చేసింది

Comments