సుబ్రహ్మణ్యస్వామి జగన్ భక్తుడే..! ఇదేం కొత్త విష్యమా..? 100 కోట్లు ఎలాగొస్తాయంటే ఆంధజోతి నుంచేనని సదరు స్వామి అభిప్రాయం




 తానేదో పెద్ద అమాయకుడిని అయినట్లు..దేశం రాష్ట్రం బాగు కోసం రాత్రింబవళ్లూ శ్రమపడుతుంటే..తనపై రాళ్లేస్తున్నట్లు

రాసుకోవడంలో ఈ పత్రిక ఎప్పుడో ఆరితేరిపోయింది. వైఎస్ ఫ్యామిలీ అన్నా..జగన్ అన్నా ఈ పత్రికకు పడదు..వాళ్లకి ఇతగాడంటే మంట ఉంది కానీ...ఇతగాడి స్థాయిలో మాత్రం లేదు. తనపై విమర్శలు రాసే పత్రికలను నమ్మొద్దని పొలిటీషియన్ చెప్పడంలో పెద్ద వింతేం లేదు


కానీ విలువల ముసుగులో ప్రతిదాంట్లో పెడార్ధాలు వెతుకుతా..నానా గందరగోళం చేస్తా..నా పత్రిక నా ఇష్టం అన్నట్లుగా 

బురద జల్లితే ఊరుకుంటారా..అదే కదా టిటిడి విషయంలో జరిగింది


ఎప్పుడో..సదరు పేపర్..వెబ్ సైట్‌లో ఏదో టైప్ చేస్తే..టిటిడి బదులుగా ఏదో అన్యమతం వచ్చిందంట( అసలు ఈ అన్యమతం అనే పదమే పెద్ద బ్రహ్మపదార్ధం..మనది హిందూదేశం కాదు..హిందూ రాజ్యం..రాష్ట్రం కూడా కాదు..అలా అధికారికంగా ప్రకటించినప్పుడు ఇలా అన్యమతం అనే పదం వాడొచ్చు..దాని బదులు వాడవలసింది హిందూయేతర మతం..లేదంటే నాన్-హిందూ మతం) దాంతో అరే ఇలా వచ్చిందేంది స్వామీ..ఇది తప్పు కదా..మా మనోభావాలు కోట్లకొద్దీ గాయపడ్డాయంటూ ఈ పత్రిక వాపోయినట్లు ఇప్పుడు తీరిగ్గా రాస్తున్నారు


కానీ వాస్తవానికి అప్పట్లో ఆ పత్రిక ఎలాంటి హెడ్డింగ్ పెట్టింది..ఎంత పెద్ద పెద్ద తలకాయల్లాంటి అక్షరాలతో జనం మెదళ్లలోకి ఏమి జొప్పించాలనుకున్నదీ అందరికీ తెలుసు..పైగా ఆ సంస్థకి ఛైర్మన్‌గా ఎన్నికైన మనిషి మీదే, ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నాడంటూ ఎవడో పనికిమాలిన దద్దమ్మలచేత ప్రెస్ మీట్లు పెట్టించి వాటిని అచ్చొత్తిన ఘనులు..


ఇప్పుడేమైంది..టిటిడి తరపున తానే రంగంలోకి దిగాను..తాను భక్తుడిని అని చెప్పుకున్న సుబ్రహ్మణ్యస్వామి , జగన్ కోరితేనే వచ్చానంటూ యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పానని..సదరు పత్రికారాజం వాపోతోంది..ఛ..నిజమా..! అంటే ఇన్నాళ్లూ మేం సుబ్రహ్మణ్యస్వామి సొంతంగా కేసు వేశాడని అనుకున్నామా...

సుబ్రహ్మణ్యస్వామి మహా భక్తుడని..సొంతంగానే బాధపడ్డాడని మేం అనుకున్నామా..

ఇప్పుడేదో పేద్ద కొత్త విషయం కొలంబస్ అమెరికాని కనుక్కున్నట్లు ఓ బ్యానర్ పెట్టీ మరీ వార్త రాయడం..ఏంటీ పైత్యం

అంతేలే పేపర్ మీది కాబట్టి మీ ఇష్టం

కానీ జనం జ్ఞానాన్ని , జ్ఞాపకశక్తిని శంకిస్తే ఎలా..?

కేసు తానే గెలిచినట్లు సుబ్రహ్మణ్యస్వామి చెప్తున్నారనేది ఈయనగారి మరో ఆరోపణ..పైగా అప్పట్లో పైసా తీసుకోను అన్నాడు ఇప్పుడేమో..100కోట్లు వస్తాయని అప్పుడే తీర్పులు కూడా ఇచ్చేస్తున్నారని మరో అభియోగం


( స్వామీ మీ యూట్యూబ్ ఛానళ్లలో ఎన్ని థంబ్ నైల్స్ జగన్ ‌ని మళ్లీ జైలుకి పంపించాయి..వాటి సంగతేంటి..తీరా బెయిల్ రద్దు పిటీషన్ కొట్టేయడంతో..ఎహ..అసలు ఆ పిటీషన్ కొట్టేస్తారని ఎవరికైనా తెలుసునంటూ ఓ సంపాదకీయం ఒకటి..అంటే మీకు తెలిసి కూడా అన్నన్ని రోజులు సదరు రోగమారకృష్ణరాజుని పెట్టుకుని ఎందుకు డిస్కోలు ఆడించారు..)


సరే మీ 100 కోట్ల సంగతికి వద్దాం..ఏంటంటే..సదరు సుబ్రమణ్ణెస్వామి హెలూసినేషన్..100కోట్లకి టిటిడి పరువు నష్టం దావా వేసింది కదా, అది కేసు గెలిస్తే..మీ పత్రిక కట్టాల్సి వస్తుంది కదానేది ఆయన భ్రాంతి..అదీ సంగతి..అసలిలాంటి పరువు నష్టం కేసులు ఏ రోజైనా పైసా కట్టించాయా?అదేగా మీ ధీమా


ఇక మీ మరో ఆక్షేపణ..ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూ కింద కామెంట్లు స్వామిని భలే ఆడుకున్నారని...మీ ట్యూబ్ గొట్టం కింద ఎలాంటి కామెంట్లు..అంతెందుకు మీ లైవ్ డిస్కోల పక్కన ఎలాంటి బూతు కామెంట్లు పెడుతుంటారో మీకు తెలీదా..

పైగా అన్నిటికంటే టాప్‌లో మీరే పిన్ చేసి---మా డిస్కషన్ పై కామెంట్లు అసభ్యంగా ఉండరాదు..చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..అంటూ ఓ డిస్ క్లెయిమర్ ఒకటి..అందులో మాట్లాడేవాళ్లంతా ఎలాంటి భాష వాడతారో...ఏ గంట చూసినా తెలిసిపోతుంది..కాబట్టి..ఇతరులపై ఎవరో ఏదో కామెంట్ పెడితే దాన్ని అచ్చొత్తేసి సంబరపడితే ఎలా?

Comments