రేపు మోహన్ బాబు ఏం చెప్తాడు..? పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానం..శ్రీకాంత్ ఏం చేస్తాడు..సినేమావాళ్లు కాబట్టే కదా..లేకపోతేనా..! రుధిరం విరిగి మీద పడుతుందా..నీళ్లు గురుత్వాకర్షణ శక్తి కోల్పోయి మన మీద దాడి చేస్తాయా...లేక ఏ 100 ఎంఎల్ పెట్రోలో వచ్చి మన ప్రాణం తీస్తుందా



 మా..ఎన్నికలు బాగానే ముగిశాయ్..స్టార్లు ఉండటంతోనే ఇంతగా టివి ఛానళ్లు చూపించాయి కానీ..ఏ దుగ్గిరాల ఎన్నికలనో చూపించాయా..కనీసం పెద్ద పెద్ద పేపర్లు కూడా మెయిన్ ఎడిషన్లో కూడా ఎంపిటిసి ఎన్నికల్లో విపరీతమైన గొడవలు జరిగిన వాటి గురించి కూడా చూపించలేదు


సినిమా వాళ్లు కాబట్టి టివీలు తెగ హోరెత్తించి..పైగా ఆ పాపం..వాళ్లపైనే నెట్టేస్తూ..ఎందుకు...ఎందుకుఎందుకింత ఎందుకింత..అంటూ ఉన్న 10 చానళ్ల ముఖ్యులూ..తెగ చర్చలకు కూర్చోబెట్టి తరించారు..అంతే తప్ప నిజంగా ఎవడేం మాట్లాడాడో మామూలు జనాలకు ఎలా తెలుస్తుంది..


పైగా టివి9 అయితే..వాళ్లకున్న రాజకీయ బంధుత్వం..అవసరాలతో ప్రకాష్ రాజ్ ని తెగ మోసి..అవతలి పక్షం వాళ్లు గెలుస్తున్నా కూడా ఆ గెలుపుని చీప్ చేసే పని కూడా చేసింది..కానీ పాపం చివరకు తగ్గాల్సి వచ్చింది..వాస్తవానికి ఈ ఎన్నిక ఎవడికి పట్టింది..రేపు ఆ ఓటేసిన 700మందిలో సగంమందిఆ ఆఫీస్ కాదు కదా..ప్యానెల్ మెంబర్లతో కూడా మాట్లాడరు..కేవలం ఓ పదిమంది మాత్రమే మైకుల ముందు పబ్లిసీటీ పిచ్చ కోసం మాట్లాడుతుంటారు..

సినేమాలు ఎటూ లేని ..హీరో ఇప్పుడు మా ప్రసిడెంట్..బిల్డింగ్ కట్టేది నటుల కోసమే..ఏదైనా చేసినా నటుల కోసమే..దాంతో జనాలకేం పని.. మరి పూనం కౌర్ ప్రకాశ్ రాజ్ ఓడిపోయాడు కాబట్టి..ఇక తన ఇబ్బందులను తనలో తానే దిగమింగుకుంటుందా..శ్రీకాంత్ తన ప్రెసిడెంట్ కాండిడేట్ ఓడిపోయాడు కాబట్టి రిజైన్ చేస్తాడా...ఇలా సాగుతాయ్ రేపట్నుంచి

ఇక ఇప్పుడు రేపు రచ్చ చేసేది ఛానళ్లు...మోహన్ బాబు ఏం చెప్తాడు..పవన్ ప్రశ్నకి ఎలాంటి సమాధానాలు ఇస్తారు..రుధిరం విరిగి మీద పడుతుందా..నీళ్లు గురుత్వాకర్షణ శక్తి కోల్పోయి మన మీద దాడి చేస్తాయా...లేక ఏ 100 ఎంఎల్ పెట్రోలో వచ్చి మన ప్రాణం తీస్తుందా..ఏం జరగబోతోంది..? చూస్తూనే ఉండండి...చెత్త ఫైన్



Comments