చింతా చచ్చినా పులుపూ చావదు....! బతికుండగా మాట పెగలదు ఇప్పుడు మాత్రం వైఎస్‌పై చిందులు..అద్వానీ రథయాత్ర లేకపోతే మోదీ పిఎం అవుతాడా..ఎన్టీఆర్ పుట్టకపోతే బాలయ్య ఉండేవాడా-ఏంటీ తలకమాసిన యవ్వారం

 


ఎన్టీఆర్ పుట్టకపోతే బాలయ్య ఉండేవాడా

రాజీవ్ గాంధీ అనవసరంగా పెళ్లి చేసుకున్నాడు లేకపోతే రాహుల్ ఎక్కడ?

అద్వానీ రధయాత్ర చేయకపోతే, మోదీ ప్రధాని అవుతాడా..?

తుళ్లూరుకు శాపం ఉంది

తిరుపతే రాజధాని ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలోనే ఉంది


ఇవేం డైలాగులు..ఇంత పనికిమాలిన తనమేంటి..అసలివేం రాతలని బట్టలు చించుకుని నాపై దాడికి రాకండి

తిట్టుకోకుండి..ఏపీలో ఓ మాజీ ఎంపి ఉన్నాడు..అతగాడి వాదన లాజిక్కు ఇలానే ఉంది మరి..


ఎప్పుడో 2004లో వైఎస్‌ని సిఎంగా చేసే, కాంగ్రెస్ తప్పు చేసిందట..ఠాఠ్..అసలు అప్పుడు అలా చేయబట్టి కదా ఇప్పుడు జగన్ సిఎం అయింది అంటాడు..సకలరోగాలకు జిందాతిలిస్మాత్‌లాగా..ఇప్పుడు ఏపీలో జరుగుతున్న అన్నిటికి అదే అసలు  కారణం అన్నట్లుగా వాపోయాడు..ఇతగాడి పేరు చింతా మోహన్..


ఎప్పుడో విన్నట్లుంది కదా..ఏం పర్లేదు ఇలాంటి పాత..ఔట్ డేటెడ్..రాజకీయభూమిలోపలికి ఆరుడుగులకిపైగా లోతుకు ఓటర్లు కప్పెట్టినా సరే మన అంధజ్ోతి గోడ పత్రిక పైకి లాక్కొస్తుంది వాడేం మాట్లాడినా..సొగసుగా అచ్చొత్తుంది. ఎందుకంటే మనకి ఒకడు కావాలి..ఆ ఒకడు వైఎస్, జగన్‌పై విమర్శలు చేయాలి..ఎహ్ విమర్శలు కాదు తిట్టాలి..బండబూతులు తిట్టగలిగితే మరీ మంచిది..లాజిక్కూ..సమయం సందర్భం ఏమీ అక్కర్లేదు..జస్ట్ వాడికో పేరు ఉండి..వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయినా సరే, వారికి సరిపోతుంది..గంటలకొద్దీ మాట్లాడినా లైవ్ ఇచ్చేస్తాం..టన్నుల కొద్దీ పేపర్లకు సరుకు ఇచ్చినా 


విడతల వారీగా వాడేసుకుంటాం..వెబ్ లో ...జిల్లా ఎడిషన్ లో..స్టేట్ ఎడిషన్ లో ..ఇలా ఎక్కడిక్కడ రకరకాల టైటిల్స్‌ పెట్టి కేక పుట్టించేయాలనేది వాళ్ల పాలసీ


మరి ఈ చింతామోహన్ ప్రజ్ఞ ఏమిటంటే 2004లో కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డిని సిఎం చేయడమే అసలు తప్పిదం అట..పోనీ నిన్ను చేయాల్సింది కదా అంటే ఏమంటాడో..ఆ రోజు ఆ పని చేయబట్టే జగన్ సిఎం అయ్యాట్ట


నిజమే ..సోనియా దయతలచి ఓదార్పు యాత్ర, సిబిఐ కేసులు పెట్టబట్టే బైటికి వచ్చాడు..లేకపోతే పార్టీలోనే ఉంటే ఏమయ్యేవాడు..నాలాగా చెట్టుకింద లీడరయ్యేవాడు కదా..అన్నా అనగల సమర్ధుడితగాడు..


అసలు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయడం కూడా మా పుణ్యమే అంటాడేమో..ఆ తర్వాత 2009లో 33మంది ఎంపీలను గెలిపించిన సమయంలోనూ కావాలనే..ఇతర లీడర్లను ప్రచారానికి దూరం చేసి...వైఎస్ ఇమేజ్ పెరగడానికి కాంగ్రెస్సే కారణమంటాడేమో..ఇలాంటి చాలా చాలా నాస్ట్రోడోమస్ కామెంట్లు ఈయన మదిలో ఉండే ఉండాలి..బహుశా వీలువెంబడి బైట పెడతాడేమో లే..@! గత మార్చిలో తుళ్లూరుకి శాపం ఉందని..తిరుపతే రాజధాని అని బ్రహ్మంగారు రాశారని..ఇంకా చాలా చాలా జ్ఞానం పంచాడీయన


కొస మెరుపు..రాహుల్ గాంధీ వస్తాట్ట..అమరావతి..స్టీల్ ప్లాంట్ సమస్యలని పరిష్కరిస్తాట్ట..దేశానికి ఆయనే కాబోయే పిఎం అట...పిసిసి రేసులో ఆయన లేనేలేడట..ఛ నిజమా...నాయనో ..ఇలాంటోళ్లని ఇంకా భరిస్తుందంటే...కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గొప్పదే


Comments

  1. మీరేమన్నా అనుకోండీ. ఏ పార్టీబాకాలుగా ఐనా ఎవరు వ్రాసినా దానివలన ఉపయోగం ఏమీ లేదు. మన జనంలో చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయరు - ఓట్లు వేసే వాళ్ళు ఏమీ చదివి ఓట్లు వేయరు. అందుచేత ఇలా మీడియాల్లో పార్టీలవాళ్ళు కలహించుకోవటం కేవలం వాతావరణ కాలుష్యం. ఇది ఈబ్లాగు కనే కాదు అన్ని రకాల ప్రచారమీడియాకూ వర్తిస్తుంది. ఐతే గియ్తే, కామెడీగా చదువుకుందుకు బాగానె ఉంటాయి. అదేదో పేపర్లు పొట్లాలు కట్టుకుందుకు పనుకొస్తాయన్నట్లు. ఏదైనా నిజమైన విశ్లేషించి చెప్పదగిన అంశం ఉన్న సందర్భంలో తప్ప ఐనదానికీ కానిదానికి కామెడీలు వ్రాయటం అనవసరం అని నా ఉద్దేశం. ఇలా వ్రాసానని మీకు కోపంవస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు. కాదు ప్రజను ఎడ్యుకేట్ చేస్తున్నానని మీరు భావిస్తున్న పక్షంలో - నమోన్నమః. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. కోపం ఎందుకు వస్తుంది..ఇదంతా కాలక్షేపమే..కానీ మీరిదే సలహా..సదరు అంధజోతికో..ఏ టివి ఛానల్ కైనా ఇవ్వగలరా...బ్లాగంటేనే పర్సనల్ కదా...ఇక్కడ అన్నీ రాసుకోవచ్చును..దీంతో సమాజ ఉద్దరణో..లేక కనులు విచ్చుకుంటాయనో..నేనైతే ఏ రోజుకీ అనుకోను

      Delete
    2. ఆంద్ర అన్న పదం ఎప్పుడు అంధ ఐపోయిందీ? మీ భాషలో చెప్పాలంటె మీనాయకుడి చలువ వలన ఐనదా యేమి? మీరేదో మీకు నచ్చని పత్రికకు పేరడీ పేరు పెట్టి తమాషా చేసాననుకుంటున్నారే కాని ఆంద్రశబ్దాన్ని అవమానిస్తున్నానని అనుకోవటం లేదు.

      మనకు నచ్చినా నచ్చకపోయినా ఇతరుల గురించి ఎప్పుడూ మనం హుందాగానే మాట్లాడటం వలన మన మాటకు విలువ పెరుగుతుంది కదా. మన భాష నేలబారు చేసుకొని మన వ్రాతలు కామెడీలు చేసుకొని ఇతరులను వెక్కిరించటం వలన మనని ఎవరు సీరియస్‌గా తీసుకుంటారు? ఎందుకు తీసుకోవాలి చెప్పండి! మీరన్నట్లు ఇదంతా కాలక్షేపమే అని నాకు తెలుస్తూనే ఉంది. కాలక్షేపంగా వ్రాసేది హుందాగా ఉండకూడదన్న నియమం లేదుకదా. మన సినిమాలతో సహా అన్నిరకాల మాధ్యమాల్లోనూ‌ హాస్యం అంటే వెకిలితనం అన్న దృక్కోణం స్థిరపడిపోవటం వలన మనలో సున్నితత్వం మాయం అవుతున్నది. భారతంలో ఒక పద్యాన్ని ఆంధ్రపత్రిక దినపత్రిక వారు సంపాదకీయం కాలమ్‌ పైన రోజూ ప్రచురించే వారు. అది:

      కం. ఒరు లేయవి యెనరించిన
      నరవర యప్రియంబు తన మనంబున కగు తా
      నొరులకు నవి సేయ కునికి
      పరాయణము పరమధర్మపథముల కెల్లన్.

      ఏపని ఇతరులు మనపట్ల చేస్తే మనకు అప్రియంగా ఉంటుందో అట్టి పని మనం ఎప్పుడూ ఇతరుల పట్ల చేయకుండా ఉండటమే పరమధర్మాల్లో గొప్పది అని దీని అర్ధం.

      మీకు నచ్చని పార్టీలనో రాజకీయుల అభిప్రాయాలనీ ఖండించవద్దని నేను అనటం లేదు. సందర్భానుసారంగా విమర్శించవద్దనీ అనటం లేదు. కాని ఆ వ్రాసేది ఏదో హుందాగా ఉండే భాషలో పదుగురుమెచ్చే తీరులో వ్రాస్తే బాగుంటుందని మాత్రం అంటున్నాను. కాలక్షేపానికి వ్రాసినా ఎందరో పెద్దలు వ్రాసినవి సాహిత్యపువిలువలతో గుబాళించటం చిరకాలం నిలువటం‌ మనం చూసిన సంగతే. కొత్తమాట కాదు. కాబట్టి సముదాచారాన్ని పాటించమని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను. ఈమాట మీకే కాదు అందరికి అవకాశం ఉంటే‌ అవసరం ఐతే తప్పక చెబుతాను. ఎవరిపట్లా పక్షపాతం లేదండి నాకు. ధన్యవాదాలు.

      Delete
    3. అందరికీ నచ్చేట్లుగా రాయడం కానీ వ్రాయడం కానీ కుదిరే పనియేనా? హుందాతనానికి ఏది కొలబద్ద..దయచేసి వాదనలు వద్దు..నా రేంజ్ ఇంతే అనుకోండి..అంతే..సదరు పత్రిక ఎవరికి దివిటీ పడుతుందో అనే వ్యంగ్యంలో రాసిందే తప్ప..భాషని అవమానించలేదు..ఇది నిక్కము..మీకు అలాగున అనిపించిన అది మీ ఇష్టం

      Delete
  2. అది నాకు రాక కాదు..దాని ఉద్దేశం వేరు..అది మీకూ తెలుసు..లీగల్ ప్రొటెక్షన్..మరి మీరు ఆంధ్ర బదులుగా ఆంద్ర రాయడం కరెక్టేనా...రెండింటిలో ఏది సరైనదో తెలియజేయండి..మీకు తెలీకుండానే..వాదులాట ప్రారంభిస్తున్నారు..ప్యూర్ టైమ్‌పాస్ మాస్టారూ

    ReplyDelete
  3. నేను వై ఎస్ అభిమాని కాదు కానీ, నిజం చెప్పాలంటే ఈ చింతా మోహన్ రెండు సార్లు ఎంపీ గా గెలవడానికి కారణం వై ఎస్సే.
    మొన్నటి ఉప ఎన్నికల్లో ఈయనకి పది వేల ఓట్లు కూడా పడలేదు.
    2004, 2009లో UPA ప్రభుత్వం ఏర్పాటు కి కారణం కూడా వై ఎస్సే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన సీట్లు వల్లే కాంగ్రెస్ రెండు సార్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది.
    అవిశ్వాస తీర్మానం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించింది కూడ వై ఎస్సే.
    అయితే 2004 ఎన్నికల్లో వాజపేయి ప్రభుత్వం ఓడిపోకుండా ఉంటే మన దేశ పరిస్థితి ఇంకా బాగుండేది.

    ReplyDelete

Post a Comment