సూపర్ స్టార్ల కొడుకులు.. కూతుళ్లు.. మొఘల్స్ మనవళ్లు..వీళ్లేనా డ్రగ్స్ మాఫియా కస్టమర్లు



 టైటిల్ చూసి బెదిరిపోవద్దు..వాస్తవానికి ఎప్పుడైతే హాలీవుడ్ తాలూకూ అలవాట్లు, తుచ్ఛ సంస్కృతిని హిందీ చిత్రసీమ డంప్ చేసుకుందో, హే..ఇదే నాగరికత అంటూ మిగిలినవాళ్లని ఈసడించి అనుసరించడం ప్రారంభించిందో..అప్పుడే 

ఈ మత్తుమందుల రవాణా, సేవనం చిత్రసీమకి పాకేసింది. ఇప్పుడు బైటపడుతుందంటూ దాని తాలుకూ తోకలు మాత్రమే. 



తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో షారుఖ్ ఖాన్ పుత్రుడు ఆర్యన్‌ని అదుపులోకి తీసుకుందని స్వయంగా ఆ శాఖే ప్రకటించింది. కారణం సింపుల్,-కోర్డెలియా క్రూజ్ ఎంప్రెస్‌షిప్‌లోని ఓ పార్టీలో ఈ డ్రగ్స్ మంచినీళ్లప్రాయంగా వినియోగించారని..

వారిలో ఇతగాడు కూడా ఒకడని తెలిపింది


ఒక్క ఆర్యన్ ఖాన్ మాత్రమే కాదు, మూన్‌మూన్ ధమేచా, నుపూర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ ఛోకర్

గోమిట్ చోప్రా, అర్బాజ్ మెర్చన్ అనే ఇతరులు కూడా ఉన్నారంటూ ఎన్‌సిబి జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడే ప్రకటించారు


ఐతే ఇక్కడ షారుఖ్ ఖాన్ అండ్ కంపెనీ బైటికి ఊరటగా చెప్పుకునేందుకు దక్కిన వెసులుబాటు ఏమిటంటే, ఆర్యన్ ఖాన్‌పై ఎలాంటి ఛార్జీలు వేయలేదు. అభియోగాలు చేయలేదు, ప్రశ్నిస్తున్నారని అరెస్ట్ చేయలేదని ఎన్‌సిబి చెప్పడం


ఏ..ఊర్కోబ్బా..ప్రశ్నిస్తే..దోషులవుతారా..అంటూ ఈసడించవద్దు..ఈ ప్రశ్నారోపణల పర్వానికి రెండు వారాలుగా గ్రౌండ్ వర్క్ చేసినట్లు ఎన్‌సిబి చెప్తుంది. బాలీవుడ్ లింక్స్ దొరికాయి కాబట్టే ఇప్పుడు ఇంటరాగేషన్ మొదలెట్టాం అని ఎన్‌సిబి చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ చెప్తున్నారు. ఇప్పుడు జరిగిన, జరగబోయే ఎంక్వైరీలో లభించే ఆధారాలను బట్టి ఇంకా రెయిడ్స్ కొనసాగుతాయని ఎన్‌సిబి చెప్పడం హైలైట్..అన్నట్లు ఒకప్పటి హీరో..ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీల్ శెట్టినే ఈ పార్టీ కండక్ట్ చేసినట్లు సమాచారం





సరే..ఇప్పుడేం కాదు..దాదాపు రెండేళ్ల క్రితం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన సమయంలో ఈ డ్రగ్స్ రాకెట్ ముంబైలో..బాలీవుడ్‌‍లో బ్రహ్మాండంగా చొచ్చుకుపోయిందని..చాలామంది హాట్ బ్యూటీలు, నంబర్ వన్ హీరోయిన్లు - మాల్ హై క్యా

కిత్‌నే ...కిదర్ మిల్తే వంటి వాట్సాప్ ఛాట్‌లు కూడా చేసినట్లు మీడియా హోరెత్తించింది. సుశాంత్ సింగ్ చనిపోవడానికి రియా చక్రవర్తే డ్రగ్స్ వాడించింందంటూ ఓ సెక్షన్ తెగ ప్రచారం చేసింది. ఐతే ఆకేసు సుశాంత్ మరణానికి సంబంధించినంతవరకూ పరిమితం కావడంతో ఇక ఆ డ్రగ్స్ లింక్స్ ఎంక్వైరీ చప్పబడిపోయింది..కానీ ఇదిగో ఇప్పుడు మళ్లీ జీవం పోసుసుకుంది.

ఈ రాకెట్‌లో మూవీ మొఘల్స్‌గా చెప్పుకునే పేద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న నటుల మనవళ్లు. హీరోల కూతుళ్లు, హీరోలు..యాంకర్లు, చిన్నా చితకా మేనేజర్లు బోలెడంత మంది పేర్లు వచ్చాయి. వారందరిని నార్కోటిక్స్ బ్యూరో ఎంక్వైరీ కూడా చేసింది

అంతెందుకు తెలుగులో కూడా ఈ భాగోతం చూస్తూనే ఉన్నాం కదా..మరి వాట్ నెక్స్ట్ ?




ఏముంది..ఏదో సామెతలాగా..కొన్నాళ్లు రేటింగ్స్ పెంచుకోవడానికి ఛానల్స్ హడావుడి చేస్తాయ్..ఎక్కడో ఏదో కాల్ వస్తుంది..ఇంకెక్కడో ఎవరికో సమన్లు వెళ్తాయ్..కేసు సా..గు..తూ...పోతుంది..అలా కొన్నాళ్లకి ఈ కేసు మూతబడుతుంది..కాదంటారా..చూడండి మీరే..! 

Comments