ఏడ్చేసిన ప్రకాష్ రాజ్, ఛీచీ నే మాట్లాడను నిలబడటమే వేస్టన్న శ్రీకాంత్, డౌట్ క్లియరైపోయిందన్న జీవిత ; మాగోల మామూలుగా లేదుగా!



 ఓర్నీయ..మీ జీవితమే ప్రమాదంలో పడుద్ది- జీవిత


ఏ...నేనసలు మాట్లాడను..ఛీఛీ అసలు నిలబడటమే వేస్ట్ : శ్రీకాంత్


అసలు మా ఎలక్షన్స్ అంటే కేవలం సినిమావాళ్లకి పరిమితం..కానీ సినేమా వాళ్లు అందరికీ కావాల్సినవాళ్లు అందరివాళ్లు..అందుకే ఈ ఎలక్షన్స్‌పై ఇలా రగడ జరుగుతోంది..కేవలం ఓ హోదా కోసం ఇగోతో తప్ప..ఎవరో చిన్నా చితకా ఆర్టిస్ట్ మా ప్రెసిడెంట్ అయితే మిగిలినవాళ్లు ఆయన ఆదేశాలు వింటారా..పెద్ద పెద్దవాళ్లపై యాక్షన్ తీసుకునే ధైర్యం ఈ చిన్న మా ప్రెసిడెంట్లకీ ఉండదు



అందుకే ఇప్పుడు అటు ప్రకాష్ రాజ్, ఇటు విష్ణు ఇద్దరూ తెగ కొట్టేసుకుంటున్నట్లుగా మాట్లాడుకుంటున్నారు


ఐతే ఇదేదో దొంగ ఓట్ల వ్యవహారంలాగా..ఫలానా ఫలానా పెద్ద పెద్ద ఆర్టిస్టుల పోస్టల్ బ్యాలెట్లు కూడా మంచు ప్యానెలే రిగ్గింగ్ చేయబోతుందన్నట్లుగా ప్రకాష్ రాజ్ కాసేపటి క్రితం ఆక్రోశించాడు..ఏకంగా గద్గద స్వరంతో ప్రశ్నించాడు కూడా..కృష్ణ,కృష్ణంరాజు, శారద, లక్ష్మి, శరత్ బాబు, ఇలాంటి వారి పోస్టల్ బ్యాలెట్ల కోసం రాయాల్సిన లేఖలు, కట్టాల్సిన డబ్బులు కూడా మంచు ప్యానెలే కట్టిందంటూ  ఆరోపించాడాయన


ఆయన ఆక్రోశించిన తర్వాత శ్రీకాంత్‌ని మాట్లాడమంటే.." ఛీ ఛీ నే మాట్లాడను, అసలు అసయ్యం..అసలెందుకు నిలబడాలంటూ" నైస్‌గా తప్పించుకున్నాడు


వాస్తవానికి మోహన్ బాబు అండ్ కో పై మాట్లాడే ధైర్యం ఇతగాడు ఎప్పుడూ చేయడు..అటు చిరు, ఇటు మోహన్‌బాబుకి అందకుండా పోకచెక్కలా తప్పించుకనేరకం

కానీ పాపం ప్రకాష్ రాజే..సిన్సియర్ గా ప్రయత్నిస్తూ..చాలామందికి శత్రువు అవుతున్నట్లు కన్పిస్తోంది..


ఇక జీవిత" హండ్రడ్ పర్సంట్ మేమే గెలుస్తాం అంటుంటే నాకేం అర్ధం కాలేదు..ఇదిగో ఇలానా..చేసేది. అందుకేనా అంత ధీమా అంటూ విష్ణు ప్యానెల్ పై విమర్శలు పరోక్షంగా చేస్తూనే..అసలు మీ జీవితాలే తలకిందులు అవుతాయి సరిగా ఓట్లేయండి ఆలోచించండి అంటూ ఏదో ఎమ్మెల్యే ఎంపి ఎన్నికల్లా మాట్లాడటమే నవ్వొస్తుంది..ఎవరు ఈ 50మంది పోస్టల్ బ్యాలెట్లకి అనుమతించినవారి జీవితాలు తలకిందులు అవుతాయా..కాదు కదా


కానీ మొత్తం వ్యవహారంలో తప్పు విష్ణువైపు కన్పిస్తున్నా..

ప్రతి మెంబర్ దగ్గరా కన్సెంట్ తీసుకోకుండా ఎలా సైన్ చేస్తారు..బహుశా మేం అక్కడకు రాలేం కాబట్టి మా తరపున మీరు పోస్టల్ బ్యాలెట్ తెప్పించండి అని ఉండొచ్చు..అందులో తప్పేం లేదు కదా..ఐతే ఇలా వాళ్లు రాకుండానే పోస్టల్ బ్యాలెట్లు పంపకూడదనేది ప్రకాష్ రాజ్ అభ్యంతరమేమో..! అంటే ఆయన అనుమానం ఏమిటంటే..ఇలా పోస్టల్ బ్యాలెట్లలో ఓట్లు కూడా సదరు సీనియర్ ఓటర్ల తరపున విష్ణు ఓటేస్తాడేమో అనేది అయ్యుంటుంది..


లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ దీనికి కౌంటర్ గా ఇక నరేష్ బయలుదేరుతాడుగా 

Comments