కంటెంట్ వాళ్లదే..హెడ్డింగ్ మాత్రం కాదట..థూత్..ఇంతకంటే అదేదో చేయడం నయం కదా..ట్యూబ్ గొట్టాలూ..!



 యూట్యూబ్, సోషల్ గొట్టాల ముసుగులో ఏది పడితే అది పెట్టేయడం నాలుగు వ్యూస్ వచ్చాయనుకుంటే తమంతటి వాళ్లు లేరని గప్పాలు కొట్టుకోవడం..అసలు ఈ వీడియోలు థంబ్ నైల్స్ అనగా..ముఖచిత్రాలను చూస్తేనే వీళ్లెంత మానసిక రోగులో అర్ధమవుతుంది. ఎవడు కోర్టుకి ఈడ్చుతాడులే అనుకోవడం..తీరా కోర్టులోకి వెళ్లిన తర్వాత, అబ్బే..అబ్బేబ్బే మాకసలు తెలీదు..సమించండి సార్ అంటూ వేడుకోలు...


సమంత తనపై అడ్డగోలుగా ప్రచారం చేయడంపై కోర్టుకి వెళ్లడం తెలిసే ఉఁడొచ్చు..ముగ్గురు అందరికీ తెలిసిన( సోషల్ గొట్టాలు) ముఖాలపై కేసులు పెట్టడంతో పాపం డంగైపోయారు వీళ్లంతా..


ఈ వ్యాసానికి పెట్టిన హెడ్డింగ్  మొదటి భాగంలోలాగా వాదించడం ప్రారంభించారు. సాక్షి ఛానల్లో ఇంటర్వ్యూలో 

వీళ్ల వాదన చూస్తే..చెప్పు తీసుకుని కొట్టాలని అనిపిస్తే, అది మీ తప్పు కాదు..

ఇందులో ఓ పేరు మోసిన ( యూట్యూబ్‌లో) డాక్టరంటాడు..ఎబ్బే..ఆ హెడ్డింగులతో మాకు సంబంధం లేదట.ఇంకో చండాలుడు అంటాడు..మా హక్కది..ఎస్ఈఓ టీమ్ చూస్తది అదంతా అని ఇంతకంటే సిగ్గులేదా..ఈ సూడో జర్నలిస్టులకు..పైగా ఈ డాక్టర్ కరోనా టైమ్ లో అడ్డమైన చెత్తా వాగాడు..పైగా ఈయన బిజెపి అంట


ఓ మనిషికి ఇంత తీరిక ఉంటుందా అన్న రేంజ్‌లో వీడియోలు పోస్ట్ చేసిన ఈ డాక్టర్ నిజంగానే డాక్టరా అని డౌట్ వచ్చి్ందా మధ్య ఎందుకంటే 24గంటలూ యూట్యూబ్ గొట్టం ముందే వాగుడుకాయలాగా మాట్లాడుతుంటే..ఇక ఈనగారు డాక్టర్ వృత్తి ఎప్పుడు వెలగబెడతాడా అని

అలానే మళ్లీ పార్టీ ముసుగు ఒకటి..అంతేలెండి ఏదైనా కేసులు పెడితే ఆ పేరు అడ్డం పెట్టుకోవచ్చనే కదా


అసలీ వాదన కనుక కోర్టు ఒప్పుకుంటే...హెడ్డింగ్ వేరేవాడు పెడతాడు..మా పేపర్లో వార్తలకు మాకు సంబంధం లేదని చీబిఎన్ పత్రిక వాదించినా వాదిస్తుంది కూడా..!

Comments