దద్దరిల్లుతోన్న దలాల్ స్ట్రీట్! ఈ డిఫెన్స్ స్టాక్‌తో కోట్లకి కోట్లు సంపాదిస్తోన్న ఇన్వెస్టర్లు..! రోజుల్లోనే బిలియనీర్లుగా మార్చిన కంపెనీ



 ఓ వైపు మార్కెట్లలో బుల్స్ ఛార్జింగ్ చేస్తుంటే అన్ని సెక్టార్ల షేర్లూ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుండగా, వారం క్రితం మార్కెట్లలో లాంఛ్ అయిన డిఫెన్స్  ఎక్విప్‌మెంట్ స్టాక్ పరాస్ డిఫెన్స్  మరోసారి 5 శాతం అప్పర్ సర్క్యూట్ లాక్ చేసింది. దీంతో స్టాక్ రూ.28 పెరిగి రూ.606.10రేటుకి చేరింది. ఐపిఓగా లిస్ట్ అయిన రోజు నుంచి ఈ అప్పరప్పర తాండ్ర రాగం పలుకుతూనే ఉంది పరాస్ డిఫెన్స్.  


ఇలా లిస్టింగ్ రోజున ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో గెయిన్స్ ఇచ్చిన పరాస్ డిఫెన్స్, ఆ తర్వాతా అదే స్థాయిలో పెరుగుతుండటంతో, ఈ కంపెనీ షేర్లను భారీగా కొనుగోలు చేసిన వారంతా మల్టీ మిలీయనీర్లుగా బిలీయనీర్లుగా మారారు. 


దలాల్ స్ట్రీట్ వెటరన్ సునీల్ సింఘానియా తన ఆబక్కస్ ఎమర్జింగ్ ఆపర్చునీస్ ఫండ్ ద్వారా 9,80,091 షేర్లను ఈ సంస్థలో కొనుగోలు చేయగా వాటి విలువ ఇప్పుడు 59 కోట్లకి చేరింది. అలానే మరో ఇన్వెస్టర్ ముకుల్ అగర్వాల్ ‌కి కూడా సంస్థలో 2.32శాతం వాటా ఉంది. ఆయన వాటా విలువ ఆస్తి  రూ.55కోట్లకి చేరింది. 


జయచంద్రకాంత్ గోగ్రి అనే మరో ఇన్వెస్టర్‌కి కూడా పరాస్‌లో ఒకశాతంపైగా వాటా ఉండగా దాని విలువ దాదాపు పాతికకోట్లకిపైగానే పెరగగా, అమిత్ మహాజ్న్ శిల్పా మహాజన్ వాటాల వేల్యూ కూడా పాతిక కోట్లకిపైగా పెరిగింది. దీంతో వీళ్లంతా ఒక్క పరాస్ డిఫెన్స్‌తోనే కోటీశ్వరులుగా మారిపోయారు. 


పరాస్‌లో ఫండ్ల వాటాలు

పరాస్ డిఫెన్స్ హెచ్ఎన్ఐ క్లయింట్లకు 12.54శాతం వాటా ఉండగా, రిటైల్ ఇన్వెస్టర్లకు 11.10శాతం వాటా ఉంది

అలానే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్‌కి, హెచ్‌డిఎఫ్‌సి ఫోకస్ట్ 30 ఫండ్‌కి కలిపి పరాస్‌డిఫెన్స్ సంస్థలో 2.82శాతం వాటా ఉంది

ఐపిఓ సమయంలోనే ఈ వాటా కొన్నాయవి.FPIల వాటా చూస్తే, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు 4.36శాతం వాటా ఉండగా, అందులో 2.60శాతం వాటా అశోకా ఇండియా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అనే సంస్థకి ఉంది


ఐపిఓకి వచ్చిన సమయంలోనే చాలామంది అనలిస్టులు ఈ స్టాక్‌ని సబ్‌స్ట్రైబ్ చేయాలని సూచించారు. లిస్టైన తర్వాత కవరేజ్ ప్రారంభించలేదు కానీ ఈ స్టాక్ మరింత బుల్లిష్ అవుతుందనే అంచనాతోనే ఉన్నట్లు తెలుస్తోంది. బ్రోకరేజ్ కంపెనీ, మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ- పరాస్ డిఫెన్స్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో, స్పేస్,డిఫెన్స్ రంగాల్లో సంస్థకి ఉన్న క్లయింట్ల లిస్టుతో పాటు వ్యాపారఅవకాశాలు చక్కగా ఉన్నట్లు ప్రకటించింది. ఇన్వెస్టర్లుకు మంచి రిటన్ ఇవ్వగలిగిన

సంస్థగా కూడా మోతీలాల్ ఓస్వాల్, పరాస్ డిఫెన్స్‌ను వర్ణించడం గమనార్హం

Comments