అయ్యా మీడియా మిత్రులారా ఇలా చేయకండయా..! బతికి సాధించండి..భార్యాబిడ్డలకు తీరని శోకం మిగల్చకండి



ఏ వృత్తిలోనైనా మంచి చెడూ రెండూ ఉంటాయ్..ఐతే కలికాలం కదా..చెడే మంచిని డామినేట్ చేస్తుంది. కానీ మీడియా అనబడు

ఓ వ్యాపారంలో యాజమాన్యాల అవసరాలకు తగ్గట్లు పని చేయాల్సి వస్తుందని తెలీకనో...లేక ఎలాగోలా బండి నెట్టేద్దామనో ఇంకా 

ఈరంగంలో కొనసాగుతున్న జీవులకు ప్రవీణ్ గౌడ్ అని ఓ వ్యక్తి తన మరణశాసనం ఓ చెంపపెట్టు కావాలి..


వాస్తవానికి ఈ కథనం..ఇంకో బ్లాగులోని కథనం చూసి రాస్తున్నది..ముచ్చటలోనిది



అన్ని రంగాల్లో అవినీతి అలముకుపోయిందనే మాట మన శరీరంలోని మంచినీటిపాళ్లంత నిజం..ఇంకా దానికి మసి పూయడం అనవసరం

బాబూ మీడియానే కాదు..ఇంకే రంగంలోనైనా..మీకు ఇబ్బందులు ఎదురు అవుతుంటే వదిలేయండి..మనసు చంపుకోకండి..మీరూ చావకండి


బతకడానికి బోలెడు దారులు..అసలు మన బతుకు గురించిన పట్టింపు ఎవరికీ ఉండదయా..ఎందుకయ్యా లేనిపోని భేషజాలు..

ఇంటిదగ్గర ఇడ్లీ బండి పెట్టుకోండి..లేదంటే సాయంత్రం పుల్కాలు వేయండి..కుదరకపోతే అదే ఇడ్లీపిండి అమ్మండి. 

లేదంటే జీడిపప్పు అమ్మండి ఆకుకూరలు తెచ్చి ఇళ్లిల్లూ తిరిగి అమ్మండి ..వీటికేం కేకలు వేయాల్సిన పని లేదు..ఇంకా నామోషీగా ఉంటే

ఓ మైకులో రికార్డర్ తో అమ్మండి..ఇవన్నీ తప్పు కాదు..మర్యాద తక్కువ పనులు అసలే కాదు


ఆర్ధిక బాధలను తీర్చేందుకు తన భార్య శ్రమిస్తున్నా...కూడా ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఎంత బాధాకరం..ఇప్పుడితగాడి అప్పులకు

ఆ భార్యనే బాధ్యులను చేయరా అప్పులిచ్చిన పెద్ద మనుషులు..అది కాదు..నువ్ డబ్బు సంపాదించు సంపాదించకపో..మనిషి తోడు ముఖ్యం

ఇప్పుడా మహిళకి ఆ తోడుని కూడా లేకుండా చేయడం ఎంత పెద్ద తప్పు..ఇదంతా ప్రవీణ్ ఆలోచించి ఉండడా...ఆలోచించే ఉంటాడు కానీ..అతని

బుద్ది ఆత్మహత్యనే కోరుకుంది..( ముందసలు అతను ఆత్మహత్య చేసుకున్నాడో ఇంకేదైనానో అది కూడా ఆలోచించండి ఏమో చెప్పలేం ఎన్ని చూడడం లేదు) 


ఇప్పుడా కుటుంబం మగదిక్కు కోల్పోయింది..మరి ఎవరు ఆదుకుంటారు..ఇలాంటి బ్లాగుల్లో రాతలు ఆ కుటుంబాన్ని ఆదుకోలేవు కదా..! 


గత జూన్‌లో సిద్దిపేటలో 29ఏళ్ల హనుమంతరావనే జర్నలిస్ట్ ఇలానే పిల్లలను చంపి తానూ చనిపోయాడు..మరి ఆయన భార్య అప్పట్లో క్రిటికల్ కండిషన్‌లో ఉందన్నారు..ఇప్పుడీ ఘటన..మనసు రోదిస్తుంది తీవ్రంగా ఇలాంటివి వింటుంటే..ప్లీజ్ చనిపోవద్దు..ఎవరో ఒకరిని కౌన్సిలింగ్ కోసం సాయం అడగండి ప్లీజ్


దయచేసి ఉద్యోగాలు ఊడితే బతకలేం అనే అల్బఆలోచనలు, న్యూనతాభావనలకు రావద్దు

Comments

  1. >> వాస్తవానికి ఈ కథనం..ఇంకో బ్లాగులోని కథనం చూసి రాస్తున్నది..ముచ్చటలోనిది
    మరి ఆ బ్లాగు టపాకు లింకు ఇవ్వటం వలన చదువరులకు మరింత సౌకర్యంగా ఉంటుంది కదా.
    అంతే కాకా బ్లాగువారి పట్ల తగిన సౌజన్యప్రకటనం కూడా అవుతుంది కదా.
    (ఆ బ్లాగు ఏదో చదువరులను ఊహించుకోమనకండి దయచే)

    ReplyDelete
    Replies
    1. ఎందుకివ్వడం లేదంటే..ఆ బ్లాగుడి ధోరణి నచ్చదు..బ్లాగ్ పేరే ముచ్చట..
      నాకు సర్వంబొచ్చె అన్నట్లుగా సాగుతుంటుంది..ప్రతిదీ పక్కనే కూర్చుని చూస్తున్నట్లు..అతనికి తెలీకుండా ఏదీ జరగదన్నట్లుగా..కావాలంటే తాజా పోస్ట్ చూడండి..అది ఆల్రెడీ మన బ్లాగుడులో అచ్చొత్తినదే..అతగాడికి లేని విజ్ఞత మనకుండాలని మాత్రమే ఇక్కడ ఉదహరించా తప్ప..ఇంకోటి కాదు...పైగా ఇతరుల పోస్ట్ లను యథాతథంగా ఎక్కించేస్తుంటారు..( అనుమతుల సంగతి కాదు..వారి ధోరణి కూడా అలానే ఉంటుంది...) ఇంతెందుకని..వాడికి లేకపోతే మనకైనా ఉండాలని..పేరు ఉదహరించా అంతే.

      Delete
  2. మీవాదం అంత సమంజసంగా అనిపించటం లేదు నాకు. మీకు నచ్చని బ్లాగు ఐనా నచ్చిన బ్లాగు ఐనా అక్కడి టపా మీవ్యాసాని ఆధారం లేదా కారణం ఐనప్పుడు ఆమూలానికి లింకు ఈయటమే ఉచితం. మీరు బ్లాగు పేరు ఇచ్చినా అందరికి అదెక్కడ ఉందో తెలియకపోవచ్చు కదా. ఇచ్చే వివరం ఏదో అరకొరగా ఎందుకూ ఇవ్వటం?

    ReplyDelete

Post a Comment