మూలిగే నక్కపై తాటికాయ పడింది..అసలే డిస్కౌంట్ లిస్టింగ్..ఈ పేటిఎం షేర్లు ఇంకా సగం అవుతాయట..రూ.1200కి చేరతాయంటగా

 


మూలిగే నక్కపై తాటికాయ పడటం అంటే..పేటిఎం సంస్థ షేర్లు అలాట్ అయినవారిని అడగాలి.ఎందుకంటే అసలే లిస్టింగ్ రోజున ఓపెనింగే 10శాతం పతనంతో ట్రేడింగ్ ఆరంభించగా, ఇప్పుడు కొత్తగా ఓ బ్రోకరేజ్ సంస్థ ఈ షేర్లు 44శాతం పతనం అవుతాయంటూ హెచ్చరించింది. ఫారిన్ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ వన్97 కమ్యూనికేషన్స్‌ని కవరేజ్ ప్రారంభించామని చెప్తూ..షేరు ధర రూ.1200కి వస్తుందంటూ సూచించింది


అంటే ఇప్పుడు ఇష్యూ ధర రూ.2150తో పోల్చితే 44శాతం డౌన్‌సైడ్ పొటెన్షియల్ రికమండ్ చేసింది మాక్వారీ


అసలు పేటిఎం సంస్థ బిజినెస్ మోడల్‌కి ఓ దిశ అంటూ లేదని..ఫోకస్ తప్పిందని..అంటూ ఇంకా తీవ్రమైన పదజాలం వాడింది' cash guzzler" క్యాష్ గజ్లర్‌గా వర్ణించింది. రాబోయే రోజుల్లో లాభదాయకతని సాధించడమనేది పేటిఎం ముందు ఉన్న అతి పెద్ద సవాలుగా మాక్వారీ హెచ్చరించింది


అసలు Paytm వేల్యేషన్ 2023 ఆర్ధిక సంవత్సరంనాటి ఎర్నింగ్స్ కంటే కూడా 26 రెట్లతో ట్రేడవుతుందని..ఇది చాలా చాలా ఎక్కువని చెప్తూ..లాభం ఆర్జించడానికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని మాక్వారీ ఎత్తి చూపింది. ఫిన్ టెక్ కంపెనీలు చాలామటుకు 0.3-0.5 మధ్యలో ( ప్రైస్ టూ సేల్స్ గ్రోత్ రేషియో) ట్రేడ్ అవుతుంటే, ఈ స్టాక్ మాత్రం ఏకంగా 0.6 వరకూ ట్రేడ్ అవడం మహా ఘోరంగా చెప్తోంది మాక్వారీ.  


రిస్క్ విషయాలుగా, యుపిఐ రెగ్యులేషన్స్, బ్యాంకింగ్ లైసెన్స్ పొందడం వంటివి ఉండగా, ఇతర కంపెనీల పేమెంట్ యాప్స్ పోటీ తట్టుకోవడం అంత సులభం కాదనేది ఇప్పటిదాకా అందరూ చెప్తున్న అంశమే


Comments