ఓమిక్రాన్...లామాక్రాన్..ఎలాంటి వేరియంట్లైనా..సరే వ్యాక్సిన్లకి లొంగాలి..మరి మన టీకాల పరిస్థితేంటి..మీరేసుకున్నది ఫుల్ సేఫ్టీ ఇస్తుందా..? ఓ చేదు నిజం




 ఓ వైపు ఇజ్రాయెల్, మరోవైపు ఆస్ట్రేలియాలో ఒక్కో కేసు ఓమిక్రాన్ వేరియంట్‌తో కోవిడ్  19 వైరస్ కేసులు బయటపడుతున్న వేళ 130 కోట్లకి మించిన జనాభా ఉన్న మన దేశం పరిస్థితేంటి..ఇతర దేశాల నుంచి  వచ్చిన ప్రయాణీకులు, ప్రత్యేకించి హైరిస్క్ కంట్రీస్ నుంచి గత 10 రోజుల్లోనే ఒక్క బెంగళూరు ఎయిర్‌పోర్టులోనే 578మంది ఉంటే..ఇతర విమానాశ్రయాల పరిస్థితి ఏంటి..?


మరోవైపు ఓమిక్రాన్ స్పైక్ ప్రోటీన్‌ రీజియన్‌లో 30 మ్యూటేషన్లు , ఇంకా అంతకంటే ఎక్కువే ఉన్నాయంటూ 

కలకలం రేగుతోంది. టీకాల విషయంలో ప్రపంచంలో అన్ని దేశాల కంటే సురక్షిత స్థానంలోకి చేరుకోగలిగాం. బయట తిరిగే, అర్హత కలిగిన వయసున్న ప్రతి ఒక్కరికీ దాదాపుగా ఒక్క డోస్ కరోనా వ్యాక్సిన్ పడింది. ఇక డిసెంబర్ పూర్తయ్యేనాటికి 100కోట్లమందికి

రెండు డోసుల వ్యాక్సిన్ కూడా వేయడం పూర్తవుతుంది. మరి ఈ వ్యాక్సిన్‌తో మనం ఒమిక్రాన్‌ వేరియంట్ బారిన పడకుండా తప్పించుకోగలమా...?



సైంటిఫికల్‌గా( శాస్త్రీయంగా) ఎలాంటి వైరస్ వేరియంట్ అయినా సరే, కరోనా వ్యాక్సిన్లకు లొంగాలి. ఎందుకంటే

తయారు చేసిన టీకాలు వైరస్‌లోని జన్యు పదార్ధాన్ని బట్టి మన శరీరంలోని రోగనిరోధకతను ప్రేరేపించేలా

ముందే సన్నద్ధత కలిగేలా తయారు చేసారు. అంటే స్పైక్ ప్రోటీన్లలో ఎన్ని వేరియంట్లు ఉంటాయి అన్నది కాదు

అసలు వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే చాలు..ఎదుర్కొనేలా, యాంటీబాడీలను తయారు చేస్తాయ్. ఇది వ్యాక్సిన్ మెకానిజం


కానీ అసలు మనం తీసుకున్న వ్యాక్సిన్ల సమర్ధత ఎంత..100శాతం ఎఫికసీ లేదని ఆ కంపెనీలే స్వయంగా చెప్పుకున్నాయ్.

పైగా మన పేరుగొప్ప స్వదేశీ వ్యాక్సిన్ అయితే, రోజులు గడిచేకొద్దీ  దాని ఎఫికసీని 90 నుంచి 80కి ఆ తర్వాత 66శాతానికి కూడా తగ్గించింది..అంతేకాదు వ్యాపారం కోసం మరో బూస్టర్ డోస్ అంటూ బిల్డప్పులూ ప్రారంభం అయింది. అంటే ఇక బూస్టర్ డోస్ బూస్టర్ 2..అంటూ ఇక ప్రతి సంవత్సరం కూడా వేసుకోవలాంటూ ప్రచారం చేసినా చేస్తాయ్. అది ఓ వ్యాపార కోణం. దానిపై తర్వాత మాట్లాడుకుందాం..



ఇదే ఇతర దేశాల వ్యాక్సిన్ల పరిస్థితి కూడా. కాబట్టి వేరియంట్‌తో సంబంధం లేకుండా ఓ టీకానే మనకి పూర్తిగా రక్షణ కల్పించలేదు.అని స్పష్టంగా తెలుసు.  అయితే..వైరస్ ప్రవేశించిన తర్వాత అది సృష్టించే కల్లోలం మాత్రం బాగా తగ్గిపోతుందని మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరు సైంటిస్టులు చెప్తున్నారు.


ఇక మరిప్పుడు చేయగలిగింది


రెండు డోసులు తీసుకోవడం..తర్వాత కూడా మాస్క్, శానిటైజర్ వాడకం, మాస్ గేదరింగ్స్‌ తగ్గించడం ఇవి మాత్రమే.వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయ్. ఎన్ని లాక్‌డౌన్లు వేసినా, లాక్ తీయకా తప్పదు. ఆ తర్వాత రద్దీ తప్పదు. అందుకే ఇంటర్నేషనల్ ట్రావెల్‌పై బ్యాన్ విధించింది. కనీసం రెండేళ్లపాటు వైరస్ స్పీడ్‌తో సంబంధం లేకుండా, కోవిడ్ టెస్టింగ్ తప్పనిసరి చేసినప్పుడే కోవిడ్ వేరియంట్లతో సంబంధం లేకుండా..వ్యాప్తి తగ్గుతుంది. కానీ మన ప్రభుత్వాలకు ఎంతసేపూ ప్రచారం యావే తప్ప, 

సూక్ష్మంగా వ్యవహరించడం లేదు. కేసులు పదివేలలోపు పడిపోతే చాలు, ఎవరు ఎలా ఎటు పోయినా పర్లేదన్నట్లు ప్రవర్తిస్తున్నాయ్ ఎక్కడైనా ఇలాంటి ప్రమాదకరమైన కేసులంటూ ప్రచారం జరిగితే..మళ్లీ హడావుడి మొదలుపెడుతున్నాయ్.


ఇప్పటికైనా ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ విషయంలో..ఒక్క సౌతాఫ్రికా నుంచి లేదంటే హైరిస్క్ కంట్రీలనే టార్గెట్ చేస్తున్నారు కానీ

కట్ జర్నీలో..బైపాస్ జర్నీలో చేసి వచ్చేవారిని వదిలేయాలనడం తెలివితక్కువ. అలానే పరిస్థితి ముదరకముమందే, సదరు ఫ్లైట్స్ క్రూ( పైలెట్స్, ఎయిర్‌హౌస్టెస్)ని

టెస్ట్ చేయాలి. ఏవియేషన్ సంస్థలు కూడా ఇది పాటించాలి. అవి వదిలేసి..ఎక్కడో దేశంలో తమ పని తాము చేసుకునేవాళ్ల ఆర్ధిక స్థితులు

దెబ్బతినేలా, ఆంక్షలు విధిస్తే అది వ్యవస్థలకే దెబ్బ

Comments