బాలయ్య సినిమాల్లో ఇదే రాడ్ రంబోలా..తేల్చి పారేసిన నాని..అన్ స్టాపబుల్స్ 2 unstopable 2 with Nani

 


బాలయ్యకే పాఠాలు చెప్పిన నాని..అన్ స్టాపబుల్ అంటూ బాలయ్య చేస్తోన్న ఆహా వారి( అది నిజానికి అర్హ మీడియా..అల్లు అర్జున్ కూతురి పేరు) వెబ్ షోలో ఈసారి నాని అతిథి

ఎక్కువ అతి లేకుండా నాని చేసాడు..కానీ..తన నైజమే అది కాబట్టి..బాలయ్య వాగాడంబరం ఇందులో ఎక్కువగానే ఉంది. అయితే ఫస్ట్ ఎపిసోడ్తో పోల్చితే తక్కువే..

 ఆయన సినిమాలనుంచి స్ఫూర్తి పొందానని చెప్పే నాని..ఈసా3రి ఛాన్స్ దొరికింది కాదని బాలయ్యకే పాఠాలు

చెప్పినట్లుగా ఈ షో నడిచింది. అంటే నెగిటవ్ యాంగి ల్ కాదు..తానెలా ఔట్సైసైడర్ అనే ఫీలింగ్ ని అధిగమించింది చెప్పాడు..

ఐనా ఈ షోలో మధ్యలో మధ్యలో మరీ చీప్ గా కైట్స్ ఎగరేయడం..వంటి అర్ధం పర్థం లేని గేమ్స్ బాలయ్య రేంజ్కి నప్పవ్..ఇది ఎప్పుడు అర్ధం చేసుకుంటారో..


రాడ్ రంబోలా సినిమా అంటే..పల్నాటి బ్రహ్మనాయుడు అనే పదాన్ని వెరైటీగా నాని పలికాడు..యాక్చువల్ గా యాంకర్ స్వప్న చాన్నాళ్ల క్రితమే ఈ తొడగొడితే రైలు వెనక్కి వెళ్లడమనే సీన్ పై బాలయ్యని క్లారిఫికేషన్ అడిగింది..చాలా జోవియల్ గా బాలయ్య రిసీవ్ చేసుకున్నాడప్పట్లో...

ఇక షోలో బాలయ్య తాను  బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ సమయంలో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో ఎలాంటి అనుభవం పొందిందీ చెప్పాడు.. హిందీ తెలుగు డైలాగ్లోల ఏది ముందు చెప్పి ఎన్టీఆర్ ని చెప్పి ఒప్పించిందీ చెప్పి నవ్వించగాలెజెండ్ , సింహా డైలాగుల్నుి నాని భాషలో చెప్పడం..నాని డైలాగ్ ని బాలయ్య చెప్పడం ఫ్యాన్స్ కి ఓ ఛమక్ అనుకోవాలి


అలానే ఈ షో అంతా కూడా గతంలో లక్ష్మీష్ టాక్ షో అంటూ మంచు లక్ష్మీ చేసిన షోని తలపించేలా సాగడం మైనస్. దానికంటే అతిథుల అనుభవాలు..సీనియర్ల నుంచి నేర్చుకున్న పాఠాలు..ప్రమాదకర అనుభవాలు..వ్యక్తిగత వివరాలు ఇత్యాదులతో పాటు  హితోక్తులు వంటివి అడుగుతుంటే..

ఇంకాస్త ఆసగ్తిదాకయంగా ఉండొచ్చు..ఐతే రాబోయే ఎపిసోడట్లలో ఆ దిశగా ఏదైనా ప్రయత్నం జరుగుతుందేమో చూడాలి


ప్రస్తుతానికి బాలయ్య అన్ స్టాపబుల్ అనుకోవాల్సిందే


Comments