ఓసీ..కంగనాసురీ..నీకు ప్రస్తుతానికి మా తరపున ఈ తామరపద్మం తప్ప ఏమీ ఇవ్వలేం..ఆల్రెడీ కేంద్రమొకటి ఇచ్చిందంటారా అది 2014కి ముందు ఏర్పాటు చేసినవి కదా

 


మనకి లభించిన స్వాతంత్రం పోరాట ఫలం కాదు..భిక్షమనే జ్ఞానం దేశవాసులకు పంచినందుకు మన బ్లాగు తరపున కంగన సుందరికి ఓ తామర(గజ్జి)పద్మం తప్ప ఇంకేం ఇవ్వలేం..బహుశా ఇలాంటి జ్ఞానం పంచోబోతున్నందుకే కేంద్రప్రభుత్వంలోని అంతేవాసులు ఈమెకి పద్మశ్రీ పురస్కారం అందించినట్లున్నారు..అందుకు ఎంతైనా మనం

ధన్యులం!


మరి ఈ 130 కోట్ల బిచ్చగాళ్లు ఈ 68ఏళ్లు ఎలా బతికారో..ఆమెకే తెలియాలి..బహుశా అడుక్కుతినే ఉంటాం అందరం


అంతేకాదు తొందర్లోనే ఇక నిజమైన పద్మపురస్కారాలను కూడా కమలపురస్కారాలుగా మార్చమని డిమాండ్ చేస్తుందేమో..మరి 2014 తర్వాతే అసలైన ఫ్రీడమ్ వచ్చిందని చెప్పిందంటే..ఇన్నాళ్లూ మనమెంత అజ్ఞానంలో బతికిందీ తెలిసి వచ్చింది..వారెవ్వా..థ్యాంక్స్ టు దిస్ ఎవర్ గ్రీన్ క్వీన్


అసలు ఆదిభిక్షువునేది అడిగేదనే ఓ పాటలాగా..ఆమె దృష్టిని మనం వక్రంగా ఆలోచించకూడదనుకుంటా...అందరం ఎప్పుడోకప్పుడు ఏదోకటి అడుక్కుంటుంటాం ప్రపంచ బ్యాంక్ ని దేశాలు..దేశాలను రాష్ట్రాలు..రాష్ట్రాలను పట్టణాలు..పంచాయితీలు ఇలా అన్ని వ్యవస్థలూ

అప్పులనే ఆధారం చేసుకునుంటాయ్ కాబట్టి..కంగన ఇలా అడుక్కుతిన్నాం అంటుందా..ఏమో


ఓ వైపు పాపం ఆమె డ్రగ్స్ తీసుకుని ఇలా మాట్లాడిందంటూ కొందరు ఈసడిస్తున్నారు..మందేస్తే ఉన్న నిజం ఏమో కానీ మనసులో మాట

బైటికి వస్తుందని చెప్తుంటారు..బహుశా ఇంకాస్త మందేయిస్తే..సదరు క్వీన్ మనసులో ఇంకెలాంటి నిజాలు ఉన్నాయో మరి..ఐతే

మన జన్మకి ముందు జరిగిన విషయాలను ఆకళింపు చేసుకోవడంలో ప్రస్తుత సమకాలీనులంతా..వెనుక బడి ఉన్నట్లు ( 75ఏళ్లు లోపున ఉన్న

జనాభా) కంగనాసురి మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చు


తెలుగు నటుడు-తమిళ మూల నటి పెళ్లి పెటాకులు కావడం వెనుక ఎవరున్నదీ ఈ సుందరికి తెలుసు

సుశాంత్ అనే నటుడు ఎలా చనిపోయిందీ ఈమెకి తెలుసు

డ్రగ్స్ ఎలా అమ్ముడుపోయేదీ ఈమెకి తెలుసు

ఇలా..చాలా చాలా ఈమెకి తెలుసు కాబట్టి..ఇక అభినవ నోస్ట్రడామస్ అనో..మరోటో బిరుదు ప్రసాదిస్తే బెటర్ 

Comments