సౌతాఫ్రికా వైరస్ వేరియంట్ అంటే ఏంటి..అదెంత వరకూ ప్రమాదకరం? మాస్క్ తీయకండి సామీ...మళ్లీ ముక్కు మూసుకోవాల్సిందే



మన మార్కెట్లను వణికించిన సౌతాఫ్రికా వేరియంట్ కథా కమామీషు ఓ సారి చూద్దాం. B.1.1.529 ఇది  కోవిడ్ 19 వైరస్‌లో కొత్త వేరియంట్..సౌతాఫ్రికాలో మొదటిగా ఐడెంటిఫై చేశారు. ఇది ఇతర దేశాల్లో కూడాబ్రేకవుట్ అవుతుందని అనుమానాలు బయలుదేరాయ్. 

మిగిలిన వేరియంట్ల కంటే ఎలా డేంజరస్

ఇది మిగిలిన వేరియంట్ల కంటే ఎక్కువగా మ్యూటేషన్స్ కలిగి ఉంది. అంటే ఏదైతే స్పైక్ ప్రోటీన్ వచ్చి మన శరీరంలోని

కణజాలంతో అతుక్కుంటుందో..ఈ స్పైక్ ప్రోటీన్‌లోనే అనేక రకాల మ్యూటేషన్స్‌తో ఈ కొత్త వేరియంట్ ఉంది. ఇది నిజంగా

ఎక్కువమందికి వేగంగా పాకుతుందా..ఎక్కువమందికి ప్రాణాంతకమా అనేది ఇంకా తెలీదు


2. ఎక్కడ్నుంచి వచ్చింది. 


ఎవరికీ తెలీదు..లండన్, యుసిఎల్ జెనెటిక్స్ ఇన్సిట్యూట్  కథనం ప్రకారం, ఓ ఎయిడ్స్ పేషెంట్‌ నుంచి..అది కూడా 

ట్రీట్‌మెంట్ తీసుకోని ఎయిడ్స్ పేషెంట్ శరీరం నుంచి కనుక్కున్నారు. సౌతాఫ్రికాలో 82లక్షలమంది ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు

బీటా వేరియంట్ కూడా ఇక్కడే కనుక్కున్న సంగతి మర్చిపోవద్దు


3. ఎంత మందికి వ్యాపించింది

సౌతాఫ్రికాలో గురువారం 1100మందిని టెస్ట్ చేస్తే 990మందికి ఇదే వేరియంట్ కన్పించింది. హాంకాంగ్‌లో కూడా ఓ సౌతాఫ్రికా

నుంచి వచ్చిన వ్యక్తి నుంచి ఇదే వేరియంట్ కనుక్కున్నారు. 


4. రియాక్షన్ ఏంటి

స్టాక్ మార్కెట్లలో ఎయిర్ లైన్స్, హోటల్ స్టాక్స్ పతనం అయ్యాయ్. యుకే ఆఫ్రికా దేశాల పై ట్రావెన్ బ్యాన్ పెట్టింది( తాత్కాలికంగా)

ఆస్ట్రేలియా కూడా అదే రకమైన ఆలోచనలో ఉంది. ఇండియా కూడా ఇదే బాటలో పయనించబోతోంది


5. ఎంతవరకూ మనం ఆందోళన చెందాలి

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవాళ ఓ మీటింగ్ పెట్టింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఎంతవరకూ పని చేయగలవన్నది

అధ్యయనం చేయబోతోంది. అలానే ఈ సమావేశంలోనే ఈ వేరియంట్‌పై ఓ అధికారిక ప్రకటన చేయనుంది. వేరియంట్ ఆఫ్ కన్సర్న్

వేరియంట్ ఆఫ్ అన్‌యూజవల్..అంటే అసాధారణం, ఆందోళనకరం అనే నిర్వచనాలను ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించబోతోంది


6. నెక్స్ట్ ఏంటి

 వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా తేలితే గ్రీక్ పదం ఒకటి న్యు( Nu) తగిలించి ఆ పేరుతో పిలవడం ప్రారంభమవుతుంది


మన మార్కెట్ల వరకూ ఇప్పటిదాకా ప్రతి వేవ్ సందర్భంగా కరెక్ట్ అవడం తర్వాత రికవర్ అవడం చోటు చేసుకుంది..కాకపోతే ఇప్పుడు హయ్యర్ 

లెవల్స్ దగ్గర కరెక్షన్ చూస్తున్నాం. అది ఇంకాస్త ఉధృతమై మరో వెయ్యి పాయింట్లు నష్టపోవచ్చు..ఇది ప్రాథమిక అంచనా మాత్రమే..ఇలానే 

జరగాలనేం లేదు


Comments