బిట్ కాయిన్లకు ఈనాడు అనుకూలమా..ఈ యాడ్లేంది గురువా



ఓ వైపు దేశంలోని ఆర్ధికనిపుణులు..పండితులు..ఎగస్పర్టులూ అంతా కలిసి క్రిప్టోకరెన్సీ కనుక దేశంలోకి వస్తే..ఎకానమీ హుష్ కాక్ అంటుందంటూ

వాపోతున్నారు..మరొకరు మాత్రంఎబ్బే...నువ్ ఆపినా..ఆగదూ..ఆగదూ..ఆగదు ఈ బిట్ కాయిన్ ట్రేడింగ్ అంటూ పాట పాడుతున్నారు..

ఈలోపు మన ప్రధానమంత్రి గారు రెండ్రోజుల క్రితం ఓ మీటింగ్ కూడా పెట్టారు..దీన్నేం చేద్దాం..ఏదోటి చేయాల్సిందే అనుకున్నారు


ఇలాంటి సమయంలో ఈనాడు పేపర్లో ఇవాళ ఈ యాడ్ చూసారా 



ఎంత పెద్దదో..రెండు పేజీల్లో ఇంత యాడ్ వేయాలంటే మరి కనీసం ఓ 50లక్షలు 

ఖర్చైఉండదా..జెబ్ పే అనే ఈ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ఏజెన్సీ ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టింది. ఆర్బీఐ బిట్ కాయిన్ ఉఁదని చెప్పినా..అమ్ముతామని చెప్పినా బొక్కలో వేస్తామని చెప్పింది. కేంద్రం డిటో..ఓ రెండేళ్ల క్రితమనుకుంటా..ఇలాంటి ఓ ఏటిఎం అంటూ తెరిచినందుకే ఈ జెబ్‌పేకే మాడు వాయిగొట్టింది కూడా


మరి అయినా కూడా ఇలాంటి యాడ్ ఈనాడులో ఎలా వచ్చింది..ఇది ఖచ్చితంగా చట్టవ్యతిరేక ప్రకటనే ఇదే పాయింట్ ఏ ఉండవల్లో లాగాడనుకోండి..ఇంకేముంది మళ్లీ నానా అవస్థలు తప్పవ్..ఇలాంటి యాడ్స్ ని అనుమతించే ముందు ఎడిటోరియల్ మాత్రమే కాదు

మార్కెటింగ్ టీమ్, అంతా కాస్త చూసుకునే వేస్తాయ్..మరి ఇలా వేసారంటే..నిజంగా మన దేశంలోకి ఇక బిట్ కాయిన్లు విచ్చలవిడిగా వాడకానికి అనుమతులు లభించబోతున్నట్లేనా...

Comments