హే హరీష్ మింగలేక మంగళవారమంటున్నావా..! మీ మామ కొడుకు ట్వీట్ ఏదోతేడాగా ఉందే.. దళితబంధు సంగతేంది ఇప్పుడు పెట్టండి ఏపీలో పార్టీ!



 పాపం ఇవాళ మంగళవారమైపోయే..సామెతకి తగ్గట్లుగానే ఓడిన పార్టీ ముఖ్యనేత, ఓ కామెంట్ చేశాడు..కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కు అయి టిఆర్ఎస్ని ఓడించాయట...ఛస్..ఇంత చప్పటి చేవలేని కాిమెంట్ ఇంతవరకూ చూడ్లే...ఏ రెండుపార్టీలు కలిస్తే నీకెందుకయా సామీ... నీ మినిస్టరి గిరీకీ వచ్చిన ఇబ్బంది లేదు కదా...ఆ లెక్కన మీ పార్టీని గెలిపించేందుకు కాంగ్రెస్ లోనే కొంతమంది తసమదీయులు హ్యాపీగా నా హోమ్..నామిగాడితో లింకప్ అవడం ఎన్నిచూడ్లేదు..అయినా ఇదేం గోల..


ఎటూ ఆ సీటు ఈటలదే కదా..అందుకనే గెలిచాడని  ఓ రెగ్యులర్ డైలాగ్ వేయక..బిజెపి కాంగ్రెస్ కలిశాయని వాపోవడం ఏంది సామీ..

మీ దళితబంధు..స్కీమ్ ఓపెన్ చేసినచోటే మిమ్మల్ని తిప్పి కొడుతుంటే..ఇంకా ఏపీలో కూడా పార్టీ పెట్టాలని కోరుతున్నారంటే నాసామిరంగా మీరెంత భ్రమల్లో బతుకుతున్నారాయ్యా

వరి వద్దంటావ్..దళితబంధుతో లక్షాధికారులను చేస్తామంటారు..వరదలొచ్చిన ప్రతిసారీ కోట్లకిికోట్లు గుమ్మరిస్తామంటారు..మొక్కజొన్నలు కొనేవాళ్లుండరు..కాళేశ్వరంతో అంతా సుభిక్షమంటారు..అదేమని అడిగితే ఆంధ్రోనివి నీకెందుకంటారు..సరే మీ జనమే అడుగుతున్నారు..నీకెందుకు వేయాలయ్యా ఓటు...!

ఆ మల్లన్నఅనేటోడిని బొక్కలో వేసి 60రోజులు దాటింది.,.ఆ ఒక్కడిని చూసి భయపడేవాళ్లు..జనంకి ఇచ్చే హామీల్లో చిత్తశుద్ధి ఎలా కన్పిస్తుంది..డెవలప్మెంట్ అంటే హైద్రాబాదేనా...ఇక ఏమీ వద్దా..! మీకు మీ సీటు కిందకు నీళ్లొచ్చేసి చాలా రోజులైంది..అది మీకు తెలీక కాదు...అందుకే ఇలా ఓడిపోయి..ఆడలేక మద్దెల ఓడు కబుర్లకి దిగారు..


Comments

  1. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ లో కంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎలాగబ్బా?

    ReplyDelete

Post a Comment