హర్రే..అమిత్ షాకు ఇచ్చారే...సిఎం రమేష్ సుజనా చౌదరి కీలకపాత్ర పోషించాల్ట...మరి వీర్రాజు..విష్ణు ఏం పీకాలి..వైఎస్సార్సీపీతో రిలేషన్ మెయిన్ టైన్ చేయాలా

 

పాపం..బిజెపి లీడర్లకు మైండ్ బ్లాకై ఉంటుంది..అమిత్ షా వచ్చాడ్లే..తిరపతిలో మాకేదో గైడ్ లైన్స్ ఇస్తాడనుకుంటే..ఇలా గుండు కొట్టాడేంటనే
డౌట్ వచ్చిందిప్పుడు వాళ్లకి..


ఏపీ బిజెపిలో పురంధేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీ నారాయణ విష్ణుకుమార్ రాజు, రెడ్డి లాంటి పేరెన్నికగన్న నేతలు( చేనేతలు కాదు) ఉంటే వాళ్లు కాదని
సిఎం రమేష్, సుజనా చౌదరి కీ రోల్ ప్లే చేయమని అమిత్ షా చెప్పడమంటే..ఇదేదో తేడానే..ఎందుకంటే ఈ లీడర్లు టిడిపి మూలాలు..మూలాలే కాదు..ఇప్పటికీ
వాళ్ల మదిలో గదిలో హృదిలో బాబే కొలువై ఉంటాడు..అలాంటి లీడర్లను బాబుపైకి జగన్ పైకి ఉసిగొలపడం అంటే..వాళ్లని ఇబ్బంది పెట్టడం..అలానే క్యాడర్‌ని కూడా
ఇబ్బంది పెట్టడమే..అసలు ఈ ఇద్దరూ బిజెపిలో ఉన్నారని..రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తల్లో సగం మందికి తెలీదు. అంత గుంభనంగా తమ పార్టీ యాక్టివిటీస్ ఉంటాయ్ మరి



ఇక మరి పైన చెప్పిన లీడర్లు ఏం చేయాలి..వైఎస్సార్సీపీతో రిలేషన్స్ మెయిన్ టైన్ చేయాలా..ఓ వైపు జనసేనతో కలిసి సాగాలని చెప్పడం బానే ఉంది..కానీ వాస్తవానికి అలా కన్పించడం లేదు..తీరా చూస్తే..అసలు బిజెపికి ఏపీలో బలపడటం పైస్థాయిలోనే ఇష్టం ఉన్నట్లుగా లేదనే అనుకోవాలి..లేకపోతే..హహహహ సిఎం రమేష్..సుజనా...టిడిపిపై విమర్శలు చేస్తారా..వైఎస్సార్సీపీపై కాలు దువ్వగలరా..రామరామ..


Comments