ప్రమాదం నీడలో భారత్..బెంగళూరులో ఇద్దరు సౌతాఫ్రికన్లకు కరోనా..నరాలు తెగే ఉత్కంఠ..పాపం సౌతాఫ్రికా

 



తిరిగి కరోనా జడలు విప్పబోతోందా

భారత్‌లో మరో వేవ్ తప్పదా

వైరస్ వేరియంట్ నిబైటపెట్టడమే సౌతాఫ్రికా తప్పా

వరసగా ఆ దేశంపై  ఆంక్షలు విధిస్తున్న దేశాలు


ఈ ప్రశ్నలే ఇప్పుడు శాస్త్రవేత్తలను, వైద్యులను వేధించడం ప్రారంభించాయ్. అక్కడెక్కడో సౌతాఫ్రికాలో ఉందనుకున్న

వైరస్ వేరియంట్ B.1.1.529 ఉరఫ్ ఓమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు భారత్‌లోనూ బయటపడిందనే అనుమానం కలుగుతోంది జస్ట్ కాసేపటి క్రితమే బెంగళూరులో ఇద్దరు సౌతాఫ్రికన్లకు కరోనా సోకినట్లు తేలడంతో ఈ భయాలు ప్రారంభం అయ్యాయ్


ఐతే ఈ ఇద్దరినీ క్వారంటైన్ చేసినట్లు భయపడాల్సింది లేదని..బెంగళూరు రూరల్ డిప్యూటీ కమిషనర్ భరోసా ఇస్తున్నారు.


అసలేం జరిగిందంటే. నవంబర్ 1 నుంచి నవంబర్ 26 వరకూ ఎవరెవరు సౌతాఫ్రికా నుంచి వచ్చారో వారిని టెస్ట్ చేస్తోన్న క్రమంలో ఈ ఇద్దరికి వైరస్ సోకినట్లు గుర్తించామని డిప్యూటీ కమిషనర్ కే శ్రీనివాస్ చెప్పారు. కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఇద్దరికీ సోకిన వైరస్ వేరియంట్ B.1.1.529 అవునా కాదా అనేది శాంపిల్ టెస్టింగ్ తర్వాత తేలనుంది

ప్రస్తుతానికి మన దేశం పది దేశాలను హై రిస్క్ కంట్రీస్‌గా ఐడెంటిఫై చేసిన క్రమంలోనే ఈ టెస్టింగ్ ప్రక్రియ సాగుతోంది. 


అసలు మన దేశంలో ఫస్ట్ కరోనా కేసు కూడా ఇలానే కేరళలో ఒక ముగ్గురు వైద్యవిద్యార్ధులకు ఉన్నట్లు తేలడంతో బయటపడింది. ఐతే మరి ఇప్పుడు ఈ కేసులు కూడా ఇదే స్థాయిలో పెరుగుతాయా..లేక ఇక్కడితోనే ఆగుతుందా అనేది తెలీదు. ఒక్క బెంగళూరులోనే హైరిస్క్ దేశాలనుంచి మన దేశానికి వచ్చినవారి సంఖ్య 584మందిగా తేల్చారు. ఇక దేశవ్యాప్తంగా ఎంతమంది ఉంటారో చెప్పలేం. మరి ఇంతమందీ ఇప్పటిదాకా  ఎక్కడా తిరగకుండా, ( ఓ వేళ వారికి వైరస్ ఉంటే) ఎవరికీ స్ప్రెడ్ చేయకుండా ఉండరు కదా..!


బోట్సువానా, సౌతాఫ్రికా, హాంకాంగ్, ఇజ్రాయిల్ దేశాలనుంచి వచ్చేవారిని కూడా స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఓ వేళ ఎయిర్ పోర్ట్‌లలో నెగటివ్ 

టెస్ట్ వచ్చినా సరే ఇళ్ల దగ్గరే ఓ వారం రోజులు ఖచ్చితంగా క్వారంటైన్ కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు


నవంబర్ 24న..ఓమిక్రోన్ వైరస్ వేరియంట్ గురించి సౌతాఫ్రికా ప్రపంచ ఆరోగ్య సంస్థకి తెలియజేయగా, వెంటనే ఇతర దేశాల్లోనూ ఈ కేసులు బయటపడటం ఆరంభమైంది.


దీనికి తోడు యూకేలో రెండు ఓమీ క్రోన్ కేసులు బయటపడ్టాయ్. బంగ్లాదేశ్ సౌతాఫ్రీకా నుంచి వచ్చిన వారికి ఏడు రోజుల క్వారంటైన్ అమలు చేయబోతోంది


ఇంతా చూస్తే పాపం సౌతాఫ్రికా అనక తప్పదు..ఎందుకంటే అసలు వైరస్ సీక్వెన్స్ తెలుసుకుని..ఈ కొత్త వేరియంట్ గురించి ప్రపంచానికి తెలియజేయడమే 

ఆ దేశం తప్పన్నట్లుగా ఆంక్షలను ఎదుర్కొంటోంది.ృ





Comments