కుప్పంలో ఓటమి ఖాయమేనా..?

 

కుప్పంలో దొంగ ఓటర్లంటూ కొందరిని టిడిపి పట్టుకున్నట్లు భలే కలరింగ్ ఇస్తూ..ఆ రెండు ఛానల్లలో తెగ డిస్కోలు జరిగాయ్
సో...ఇక ఇక్కడ ఓటమి ఖాయమైపోయినట్లే అర్ధం చేసుకోవాలి. 
కుప్పం తమిళనాడు బోర్డర్‌లో ఉంటుంది. ఆ మాటకి వస్తే చంద్రగిరి కూడా..పదిహేనేళ్ల క్రితం తిరుమల దర్శనానికి వెళ్లి..మిత్రుడి ఇంట్లో బస చేశా
అప్పట్లో ఎఫ్ఎం రేడియోలు బాగా ఫేమస్..ఆర్జే ఎవరి పాట కావాలి అంటే..సూపర్ స్టార్ పాట అన్నాడు..ఓకే అని ఆర్జే మీకోసం ఇప్పుడు చంద్రముఖి సినిమాలోని ఈ పాట అంటూ ప్లే చేశాడు..నేను ఒకింత సంభ్రమాశ్యర్యాలకు గురవ్వాల్సి వచ్చింది..సూపర్ స్టార్ అంటే కృష్ణే కదా అనుకున్నా..అప్పుడు మిత్రుడు నా సందేహం నివృత్తి చేశాడు..ఇక్కడంతా తమిళ ఫాలోయింగే ఎక్కువ అని..అలా కుప్పంలో ఓటింగ్ కోసమని తమిళనాడు నుంచి ఓటర్లు రావడం ఏమైనా విచిత్రమైన విషయమా

మద్రాసు నగరంలో పొట్టపోసుకోవాడనికి చిత్తూరు జిల్లా నుంచి లక్షలమంది వెళ్తుంటారు..అంత మాత్రాన వాళ్లంతా దొంగ ఓటర్లా..పైగా ఐడీ కార్డులు పట్టుకుంటే
అవి కూడా ఫేక్ ఐడీలు అనడం..నాయనా..మామూలుగా ఉండదీ ఏడుపు..ఇదే టిడిపి గెలిస్తే..తమిళనాడు నుంచి కూడా వచ్చి బాబుకి బ్రహ్మరథం పట్టారంటూ డప్పు క ట్టడానికి కూడా ఈ ఛానల్స్ రెడీ

అందుకే..17న కుప్పంలో ఓటమి ఖాయం అని రాసుకోవాల్సి వచ్చింది


Comments