కేసీఆర్‌లా జగన్ మారాలా..! గన్ను ఎక్కుపెట్టాల్నా..! తుపాకీరాముడితో మనోడికి పోలికేందిరా బయ్..తీయ్




ఫ్రస్ట్రేషన్..ఫ్రస్ట్రేషన్..వెంకీస్..ఆసనం అంటూ..చిటికెలను పై నుంచి కిందదాకా వేస్తోన్న టీఆర్ఎస్ గణానికి గణపతి( గణాలకు అధిపతి అన్నట్లు) ఉన్నట్లుండి తన ఫ్రస్ట్రేషన్..అనగా నిస్పృహను

మీడియాపై వెళ్లగక్కాడు...ఏయ్...జైలుకి పంపుతరా..అంత దమ్ముందా..బలుపా..అహంకారమా..అంటూ ఏదేదో రంకెలు వేశాడు పాపం...అసలు పెట్రోల్ కతేంది..చైనా కతేంది..దమ్ముంటే టచ్ చేసి చూడండంటూ పప్వాం కేసీఆర్ అరుపులు చూస్తుంటే..నే లేస్తే మనిషిని కాదన్నట్లుగా కన్పించింది


ఎన్నిసార్లు ఇలాంటి సీన్లేయలేదు..ఆ తర్వాత పోయి..ఢిల్లీలో మెర్యాదగా శాలువాలు కప్పి, కప్పించుకుని రాలేదు..పైగా అగ్గి రాజేస్తడట...నాయనా..ఇంతకంటే కామెడీ ఉందా..అహ..ఉందాని...జరంత చట్టం దల్చుకుంటే..ఎవ్వడైనా ఒకటే..బొక్కలోకి పోవడం పెద్ద విష్యమేం కాదు..ఆ తర్వాత నువ్ మళ్లీ సిఎంవి కావడం..ఇదంత తెలిసి కూడా...నిన్నెందుకు ఏత్తరే జైల్ల..?

అహ నీకు తెల్వదానే..ఈ ఇశ్యం..తెల్సి గూడా..ఈ రంకెలేందే..ఎహ..ఇంగా తుపాగీ రామ్డులా..చిటికెల పందిళ్లేల..నిజ్జంగా జేసెడిదుంటే..జేయరాదే..ఎవడడ్డం


ఇదిగో..ఈ సందు జిక్కగానే..శబ్బాశ్ రా బేటా..సూడు జగన్ కూడా ఇట్టె జెయ్యాలే..హుశారుండాలే..మరీ అట్టుంటే లాభంలే..నోరు తెర్వాలే..మోదీమీదకు ఉట్టుట్టిగనైనా ఉరకాలే..అంటూ పాపం చాలామంది సలహాలు ఇస్తున్నారు..కానీ హుజూరాబాద్ల ఓడిపోయింది కేసీఆర్ సారు కానీ..జగన్ రెడ్డి సారు కాదుగానే..! పైగా..ఈ ఉడత ఊపులు ఊపి..చివరకు మళ్లీ పోయి కావలించుకునుడెందుకు..గందుకే ఓ పేపర్ ప్రకటనిచ్చే..ఇన్ని కోట్లు పెట్టి ఎందుకంటర...ప్రెస్మీట్ పెడితే సరిపాయె అంటర..మరి గా కోట్లన్నీ యాడ్ల రూపంల యాడికి చేరినాయే..? అర్ధం జేస్కూకోరూ..!

Comments