జల్లేరు వాగులో ప్రమాదం..ఈ ఛానళ్ల జుగుప్సాకర, ఏవగింపు కలిగించే ధోరణి ఏంటంట

 పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం నుంచి బయలుదేరిన ఓ బస్సు  బ్రిడ్జి పై నుంచి జల్లేరు వాగులో పడిపోయింది తొమ్మిదిమంది అప్పటికప్పుడే చనిపోయారు. ఇది వార్త..చాలా విషాదమే..


కానీ అంతకి మించిన విషాదం ఏమిటంటే..ఈ తెలుగు( మేం చూసేదవే) ఛానళ్ల రిపోర్టింగ్ చూస్తే రోతపుడుతుంది




ఒకటేమో..ఆ సమయానికి ఏదో కమర్షియల్ ప్లే చేసుకుంటూ..ఎక్కడ ప్రేక్షకులు తమ వేస్ట్ రోస్ట్ వార్తలను చూడరనుకుంటుందో ఏమో కానీ..బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ బ్రేకింగ్ వేసుకుని తరించింది కింద...ఈ ప్రమాదంలోనే డ్రైవర్ కూడా చనిపోయాడు..

ఐనా ప్రమాదం జరిగిన అరగంటలోనే..ఈ తీర్పరుల ధోరణి ఏంటి..



ఇంకోడేమో అతివేగం..కారణం..అంటూ గ్రాఫిక్స్ కూడా తయారు చేసి తరించింది..అసలు ఈ పల్లెవెలుగు బస్సుల వేగమెంతో ఈ గ్రాఫిక్స్

సన్నాసులకు తెలుసా..?



మరో ఛానలేమో..మృతుల్లో 5 గురు మహిళలు..ఐదుగురు మహిళలు..ఐదుగురు మహిళలంటూ గావుకేకలు పెట్టింది..అరే అక్కడ

9మంది చనిపోయారు..ముందు వారి గురించో..బతికినోళ్లని బైటికి తీయడంపై ఆరా కానీ..లేదంటే ఓ హెల్ప్ లైన్ గురించి కానీ

చెప్పి ఏడవడం కాదు..తామేదో పెద్ద ఘనకార్యం సాధించినట్లు..వారి జెండర్ గురించి ఎందుకు..మిగిలినవాళ్లు మనుషులు కాదా

ఇంకో ఛానలేమో పాపం..దానికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఐదారు నెలలు ఛానల్ నడపడం ఎలా అనే థీసిస్‌పై పట్టాలిస్తోంది కాబట్టి..

ఏదో ప్రేమాలయం పేరుతో పాటలేసుకుని తరించింది



మరో ఛానలేమో..అసలు బస్ ప్రమాదానికి కారణాలేంటి..అంటూ ప్రశ్నల పరంపర..ఛత్..ఇంతకంటే రిపోర్టింగ్ రానప్పుడు బాసులు అలానే తగలబడినప్పుడు లైవ్ లు ఇలానే ఏడుస్తాయ్..ఇంకా నయం కాసేపట్లో చనిపోయినవారి బంధువులో..ఇంకోరో లైవ్‌లో దొరికితే...

ఏమని స్పందిస్తారు..ఎలా ఫీలవుతున్నారు లాంటి వెధవ ప్రశ్నలకు దిగలేదు..ఏమో కాసేపట్లో అది కూడా చూస్తామేమో..!

Comments

  1. మీ ఆఖరి పేరాలో చెప్పిన టైపు ఇంటర్ వ్యూ లు కూడా వచ్చే అవకాశం ఎక్కువే.

    ఇంతమంది మహిళలు అనడంతో ఆగారా లేక చనిపోయిన వారిలో ఇంతమంది దళితులు అని కూడా అన్నారా ఏ ఛానెల్ వారైనా?

    ReplyDelete

Post a Comment