అల్లూరి 125 జయంతి సభ..! కృష్ణకి సన్మానం..సభంతా తప్పులతడకగా నిర్వహించిన సంఘం

 

ఇవాళ అల్లూరి శ్రీరామరాజు 125జయంతి అంటూ హైదరాబాద్‌లో క్షత్రియసేవాసంఘం..( సమితి ఏదోటి) ఓ కార్యక్రమం నిర్వహించింది. పెద్ద పెద్ద వాళ్లనే పిలిచింది. కృష్ణకి సన్మానం చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి నేనూ సూపర్ స్టార్ ఫ్యాన్ నే అన్నాడు..మోహన్ బాబు తన అనుభవాలు, జ్ఞాపకాలు పంచుకున్నాడు..అలానే మంత్రి ద్రోణంరాజు శ్రీనివాస్, యుశ్రారై పార్టీ ఎంపి రోఘ్ రామకృష్ణంరాజు ఒకే వేదికపై ఉన్నా..ఎవడూ ఎవడినీ

పలకరించుకోలేదు..ఐతే చప్పట్లు మాత్రం కొట్టుకున్నారు



ఇంత సభలో కోదండరామిరెడ్డి. తమ్మారెడ్డి భరద్వాజ్ అశ్వనీదత్, సహా చాలామంది బిగ్ షాట్సే వచ్చారు. కానీ సభ నిర్వహించిన తీరు చూస్తే జాలేసింది..ఇదా ఈ గూగుల్ మనోళ్లని తయారు చేసిన విధానం అన్పించకమానదు

అక్కడి గ్నానమే వంటబట్టించుకున్నారో లేక..స్వతహాగానే మనోళ్ల తెలివి ఏమో కానీ...అల్లూరి సీతారామరాజులో ఓ కీలక పాత్ర పోషించిన మోహన్ బాబు అంటూ మొదలెట్టారు..


సూపర్ స్టార్ లేకపోతే డెఫినిట్‌గా అల్లూరి గురించి ఇంతమందికైతే తెలిసేది కాదనేది సత్యమే. కానీ అల్లూరి వంశస్థులు వారి వారసులు బోలెడుమంది పౌండ్రంగి గ్రామంలో ఉండగా, వాళ్లని కొంచెమైనా తలచుకోకపోవడం ఏంటి పైగా అడ్డదిడ్డంగా మోహన్ బాబు ఏదో..మేజర్ చంద్రకాంత్‌లో ఎన్టీఆర్ చేత వేషం వేయించాడని ఆయన్ని పిలిచారట

ఇదేమైనా సందర్భోచితమేనా.. ఆ లెక్కన శ్రీరామరాజు బుర్రకథ చెప్పిన నాజర్, ఆయన వారసులను పిలిపించుకుని సన్మానమో...శాలువానో ఇవ్వాల్సింది..అల్లూరి సునీతావర్మ అని ఓ నాలుగైదు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిందో 

అమ్మాయి..ఆ అమ్మాయి శ్రీరామరాజుగారికి మనవరాలి వరస అవుతుందట..కనీసం ఆ అమ్మాయిని పిలిచినా  ఓ సందర్భోచితం అయ్యేది. 


కిషన్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడవయ్యా సామీ అంటే..ఆయనేమో ఏదో ఉత్తరాదిన పుట్టిన తెలుగువారిలాగా పట్టి పట్టి తెలుగు మాట్లాడటం ఏమిటో..సరే ఎవరి భాష వారిదని సరిపెట్టుకుందాం.


తెలంగాణ మంత్రి గారేమో...అల్లూరి మ్యూజియం పెట్టేవాళ్లం కానీ..తెలంగాణలో పుట్టలేదంటాడు..ఏపీ మంత్రేమో ఆల్రెడీ మేం పెడుతున్నాం అంటాడు..అసలు అల్లూరి అంటే..భారతీయులందరికీ దక్కాల్సిన గౌరవం. దాన్ని

మర్చిపోతే ఎలా..! ఇక సభా నిర్వహణ లోపాల విషయానికి వస్తే..సందర్భానుసారం, ప్రసంగాలను పిలవాల్సిన ప్రయోక్త మాటి మాటికీ అందరినీ బతిమాలాడటం, ఎప్పుడు ఎక్కడ ఏ మాట వాడాలో తెలియకపోవడం ( బహుశా ప్రొఫెషనల్ కాకపోవడంతో వచ్చిన తిప్పలనుకుంటా) చిరాకు పుట్టించింది

Comments