అక్షరాలా రెండున్నరలక్షల కోట్ల ఆదాయం..నికరంగా 3 నెలల్లో రూ.20359 కోట్ల లాభం..ఏందిరా సామీ ఈ రిలయన్స్

 


రిలయన్స్ ఇండస్ట్రీస్ డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో అక్షరాలా అదరగొట్టింది. టెలికాం విభాగం-జియో ప్లాట్‌ఫామ్స్, ఆయిల్ 2 కెమికల్ బిజినెస్, ఆయిల్ అండ్ గ్యాస్, రిటైల్ సెగ్మెంట్ ఇలా అన్ని రంగాల్లోనూ బీభత్సమైన వృద్ధి నమోదు చేయడంతో  ఏకంగా రెండులక్షల కోట్లకిపైగానే ఆదాయం ఆర్జించింది.  దీంతో  FY22 Q3 ఫైనాన్షియల్ రిజల్ట్స్ అంచనాలను మించి వచ్చాయ్.ఈ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికరలాభంలో 38శాతం వృద్ధితో రూ. 20,539కోట్ల నికరలాభం ఆర్జించింది. 


మొత్తం ఆదాయం చూస్తే 28.2 బిలియన్లు, మన కరెన్సీలో అక్షరాలా, రూ.2,09,823కోట్ల రెవెన్యూ గడించింది. వన్ టైమ్ ఎక్సెప్షనల్

గెయిన్‌తో ఈ స్థాయి ఆదాయం వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది


గత ఏడాది మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.14894 కోట్ల లాభం గడించింది



ఇంకా రిలయన్స్ కన్సాలిడేటెడ్ ఎబిటా ఏటికేడాది ప్రాతిపదికన చూస్తే 29.9శాతం పెరిగి రూ.33,886 కోట్లుగా నమోదు అయింది

కన్సాలిడేటెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ చూస్తే రూ.28.1గా నమోదు కాగా, ఇది ఏటికేడాది ప్రాతిపదికన చూస్తే 38.1శాతం ఎక్కువ



రిజల్ట్స్ అనౌన్స్‌ చేస్తున్న సందర్భంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, క్యు3లో అద్భుతమైన ఆదాయంతోపాటు

అత్యద్భుత పనితీరు ప్రదర్శించామని, అన్ని రంగాల వ్యాపారం నుంచి వచ్చిన ఆర్జనతో ఇది సాధ్యపడినట్లు చెప్పారు




 రిలయన్స్ కంపెనీ  అప్పు డిసెంబర్ 31 నాటికి రూ.2,44,708 కోట్లుగా కొనసాగుతోంది. అలానే క్యాష్ అండ్ క్యాష్ ఈక్విలెంట్స్ చూస్తే రూ.2,41,846కోట్లుగా ఉంది

కంపెనీకే చెందిన రిలయన్స్ రిటైల్ విభాగం హయ్యెస్ట్ లాండ్ మార్క్ క్వార్టర్‌గా ఈ మూడో త్రైమాసికాన్ని నమోదు చేయడం విశేషం. రిలయన్స్

డిజిటల్ సర్వీసుల వేల్యూ రూ.25200కోట్లకి చేరగా ఇది గత ఏడాదితో పోల్చితే 6.4శాతం ఎక్కువ. 

డిజిటల్ సర్వీసుల ఎబిటా కూడా రూ.10వేలకోట్లు దాటడం మరో విశేషం

రిలయన్స్ కేపిటల్ ఎక్స్‌పెండిచర్ చూస్తే ఏకంగా 3.7 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది మన కరెన్సీలో రూ.27,582కోట్లకి సమానం



ఇక జియో ప్లాట్ ఫామ్స్ విషయానికి వస్తే, 

నికరంగా ఈ మూడు నెలల్లో జియో ప్లాట్‌ఫామ్స్ రూ.3795 కోట్లకి చేరగా, గత ఏడాదితో పోల్చితే  8.8శాతం ఎక్కువ

కన్సాలిడేటెడ్ గ్రాస్ రెవెన్యూగా రూ.24,176కోట్లు గడించగా, ఇది ఇయన్ ఆన్ ఇయర్ బేసిస్‌లో 13.8శాతం ఎక్కువ

ఎబిటా రూ.10008 కోట్లు, ఏటికేడాది ప్రాతిపదికన 18.1శాతం ఎక్కువ నమోదు చేసింది

ఎబిటా మార్జిన్లు కూడా 48.6శాతం పెరిగింది 503 బేసిస్ పాయింట్ల మేర వృద్ధి నమోదు చేసింది( ఇవన్నీ ఐయుసి అడ్జెస్ట్‌మెంట్‌తో అని గమనించాలి)

మొత్తం కస్టమర్ల బేస్ 421 మిలియన్లకు చేరింది. ఈ మూడు నెలల్లో కొత్తగా చేరిన జియో యూజర్ల సంఖ్య 10.2 మిలియన్లు


యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ చూస్తే రూ.151.60పైసలుగా జియో ప్రకటించింది

ఈ ఆదాయం రాబోయే క్వార్టర్లలో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జియో టారిఫ్ పెంపు చోటు చేసుకుంది నవంబర్ నెలలోనే కాబట్టి 

జియోకి ఇప్పుడు 50లక్షల ఫిక్స్‌డ్ లైన్ కస్టమర్లతో పాటు సొసైటీ సెంట్రెక్స్, 4కే కంటెంట్ జియోటివి ప్లస్ , హోమ్ ఆటోమేషన్ , లైవ్ టివి, గేమింగ్

సొల్యూషన్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌పై కొత్త యాప్స్ ద్వారా మరింతమంది చేరతారనే ధీమా వ్యక్తం చేస్తోంది

దేశంలోని టాప్ 1000 నగరాల్లో జియో 5G నెట్వర్క్ పూర్తి చేసింది 



Reliance Retail


పండగ రోజుల్లోనూ, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత రిలయన్స్ రిటైల్ బలమైన వృద్దితో మంచి ఆదాయం గడించినట్లు కంపెనీ ఎండి ఛైర్మన్ ముకేశ్ అంబానీ

చెప్పడం విశేషం. 

రిలయన్స్ రిటైల్ డిసెంబర్‌తో ముగిసిన క్యు3 నికరలాభం రూ.2259 కోట్లుగా ప్రకటించింది

రిలయన్స్ రిటైల్ గ్రాస్ రెవెన్యూ రూ.57714 కోట్లు కాగా, ఇయర్ ఆన్ ఇయర్ బేస్‌లో ఇది 52.5శాతం వృద్ధి నమోదు చేసింది

రిలయన్స్ రిటైల్ ఎబిటా రూ. ₹3,822కోట్లుగా నమోదుకాగా ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికం,

ఇయర్ ఆన్ ఇయర్ బేస్‌లో 23.8శాతం వృద్ధి నమోదు కాగా, ఎబిటా మార్జిన్లు 7శాతంగా ఉన్నాయ్ 

మర్చంట్ పార్ట్‌నర్‌షిప్స్, డిజిటల్ కామర్స్ ఆర్డర్ల దన్నుతో సంస్థ వ్యాపారం కొత్త శిఖరాలకు చేరినట్లు ముకేశ్ అంబానీ తెలిపారు

ఈ డిసెంబర్ త్రైమాసికంలోనే రిలయన్స్ రిటైల్ 837 కొత్త స్టోర్లు ఓపెన్ చేయగా, మొత్తంగా దేశంలో రిలయన్స్‌కి  14412 రిటైల్ స్టోర్లున్నాయ్ 


జియోమార్ట్, వాట్సాప్ కలిపి జియో హాప్టిక్ అనే కొత్త కామర్స్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. 




Reliance O2C

ఇక రిలయన్స్ సంస్థకి గుండెకాయలాంటి ఆయిల్ టు కెమికల్ విభాగం దూకుడు చూస్తే

ప్యూయెల్ మార్జిన్లు భారీగా పెరగడంతోనే బీభత్సమైన లాభాలు ఆర్జించగలిగినట్లు ముకేశ్ అంబానీ చెప్పడం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రంగంలోని రికవరీకి నిదర్శనం. 

రిలయన్స్ ఆయిల్ టు కెమికల్ విభాగం ఆదాయం ఏకంగా 56.8శాతం పెరిగి రూ. ₹131,427 కోట్లకి ($17.7 బిలియన్లు)కి చేరింది. దీనికి ప్రధాన కారణం క్రూడాయిల్ ధరలు పెరగడంతోపాటు అమ్మకాల పరిమాణం కూడా పెరగడమే 

ఆయిల్ టు కెమికల్ ఎబిటా 38.7శాతం వృద్ధితో రూ. ₹13,530 కోట్లకి ($1.8 billion) చేరింది

రిఫైనరీ సహా మొత్తం ఔట్‌పుట్  19.7 MMTగా నమోదు కాగా ఇది ఏటికేడాది ప్రాతిపదికన  8.2%కి సమానం

ఈ మధ్యనే ద్వారక, ఢిల్లీ‌లో బ్లూస్మార్ట్‌తో కలిసి దేశంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ హబ్‌లను రిలయన్స్ బిపి మొబిలిటీ లిమిటెడ్ ప్రారంభించింది. దీనికి జియోబిపి బ్రాండ్ నేమ్ ఇచ్చారు. 


ఆయిల్ అండ్ గ్యాస్

ఈ విభాగంలో 493శాతానికిపైగా గ్రోత్ రికార్డ్ అవడం ఓ హైలైట్. రెవెన్యూ రూ.2559 కోట్లుగా, ఎబిటా రూ.2033కోట్లుగా నమోదు అయింది

మొత్తం ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ చూస్తే  53.3 BCFeగా తేలగా ఇది Y-o-Y బేసిస్‌లో  87%  ఎక్కువ



• ఈగల్ ఫోర్డ్ షేల్‌ని 402 మిలియన్ డాలర్లకు విక్రయించడం పూర్తి చేసింది . దీంతో నార్త్ అమెరికాలో షేల్ గ్యాస్ వ్యాపారం నుంచి తప్పుకున్నట్లైంది. 


Green Energy

చివరగా గ్రీన్ ఎనర్జీలో కూడా భారీగా పెట్టుబడి పెడతామని, ఇందుకోసం ప్రపంచస్థాయి భాగస్వాములతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు

రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ ధీరూభాయ్ అంబానీ ప్రకటించడం భవిష్యత్‌లో రిలయన్స్ ఎలాంటి పుంతలు తొక్కబోతుందనే దానికి ఉదాహరణ

Comments