రోజుకి 30లక్షలా...నాయనా..బతికేదెలాగరా సామీ...! రోజుకి 150000కి దగ్గర పడిన కరోనా కేసుల నంబర్

 


దేశంలో కరోనా కేసులు కొత్త రికార్డుల దిశగా పయనిస్తున్నాయ్. ఓమిక్రాన్ వైరస్ వేరియంట్ ఎఫెక్ట్‌తో థర్డ్ వేవ్ ప్రారంభంలోనే

141986 కేసులు నమోదు అయ్యాయ్. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ప్రతి రెండు రోజులకు రెట్టింపుకు మించిన వేగం ప్రదర్శించడం

రాబోయే ప్రమాదానికి సంకేతం


అసలు నోమురా రీసెర్చ్ అయితే మరీ భయంకరంగా హెచ్చరిక చేసింది. అమెరికానే ఉదాహరణగా తీసుకుంటే, మన దేశంలో రోజుకి 30లక్షల కేసులు

నమోదు అవ్వచ్చని హెచ్చరించింది. 


గడచిన 24 గంటల్లో 1,41,986మందికి కొత్తగా వైరస్ సోకగా, ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 1203గా నమోదు అయింది

214 రోజుల తర్వాత తిరిగి దేశంలో లక్ష కేసులని దాటిన వైనం కన్పిస్తోంది. 2021, జూన్ 7న దేశంలో రోజుకు లక్షమంది కరోనా బారిన పడటం మొదలైందిదీంతో దేశంలో ఇప్పటిదాకా కరోనా బారిన పడినవారి సంఖ్య 3కోట్ల 52లక్షల

26వేల 386మందికి చేరింది. ఇక ఓమిక్రాన్ వైరస్ కేసులనే చూస్తే..వారిలో 1199మంది రికవర్ అవడం జరిగింది. 


ఇక కరోనా కేసుల్లో..ఓమిక్రాన్ విషయంలో మహారాష్ట్రలో కల్లోలం కొనసాగుతోంది. ఇక్కడ 876మందికి సోకగా, ఢిల్లీలో 465, కర్నాటక 333, రాజస్థాన్ 291

కేరళ 284, గుజరాత్‌లో 204మందికి ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్లు గుర్తించారు


యాక్టివ్ కేసుల సంఖ్య 371363కి చేరింది. ఇది గడచిన 120 రోజుల్లో అత్యధికం


గడచిన 24 గంటల్లో 302మంది చనిపోగా, మొత్తం కరోనా వైరస్‌ సోకిన తర్వాత చనిపోయినవారి సంఖ్య 4,83,178కి చేరింది. 


యాక్టివ్ కేసుల వాటా మొత్తం ఇన్ఫెక్షన్‌లో 1.05శాతంగా ఉండగా, రికవరీ రేటు 97.57శాతానికి పడిపోయింది. 


గత 2020 ఆగస్ట్ నెలలో 20లక్షల కేసుల సంఖ్య నమోదు కాగా, 

ఆగస్ట్ 23న 30లక్షలకు

సెప్టెంబర్ 5న 40లక్షలకు

సెప్టెంబర్ 16న 50లక్షలకు

సెప్టెంబర్ 28న 60లక్షలకు

అక్టోబర్ 11న 70లక్షలు

అక్టోబర్ 29న 80లక్షలు

నవంబర్ 20న 90 లక్షలమందికి

డిసెంబర్ 19న కోటిమందికి సోకింది

2021 మే 4న 2 కోట్లమందికి వైరస్ సోకగా 

జూన్ 23న మూడు కోట్లమందికి కరోనా సోకినట్లు కేంద్రఆరోగ్యశాఖ ప్రకటించింది




Comments