బాలికను వేధించింది టిడిపి లీడర్..నారీ సంకల్ప దీక్ష చేస్తుంది కూడా ఆ పార్టీనే..విమర్శించకుండా ఉండాలా..?

 


నిన్నంతా ఓ తెగ టిడిపి హడావుడి చేసింది. మంత్రి వెల్లంపల్లి  శ్రీనివాస్ అనుచరుడైన వినోద్ జైనే విజయవాడలో ఓ బాలికని లైంగికంగా వేధించాడని..వాస్తవం చూస్తే..అతను విజయవాడలో టిడిపి తరపునే కార్పోరేటర్ పదవికి పోటీ పడి ఓడిపోయాడని..ఇంకా పెద్ద ఋజువు..అతనీ చర్యకు పాల్పడ్డాడని తెలియగానే మేమే పార్టీ నుంచి బహిష్కరించామని చెప్పడం..అంటే అతను ఏ పార్టీనో క్లియర్ గా అర్ధమైపోయింది కదా




దీన్ని కూడా వైఎస్సార్సీపీకి అంటగడదామని తెగ, హడావుడి చేసిన ఆ రెండు ఛానళ్లు ఇప్పుడు 

అన్నీ మూసుకుని ఉన్నాయ్. ఐతే ఈ లోపే పాపం ఆ పార్టీ నారీ సంకల్ప దీక్ష అంటూ ఏడవడం నీచాతి నీచం. షెడ్యూల్ చేసారు కాబట్టి చేస్తున్నారు ఓకే కానీ, ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అంటే..హుందాగా ఉండేది..అది లేకుండా ఇంకా ఎదురుదాడికి దిగడం..అది కూడా చంద్రబాబు కూడా ముందుండి నడిపించడమే ఏడుపుగొట్టు రాజకీయాలకు నిదర్శనం



వినోద్ జైన్ అనేవాడు ఏ పార్టీకి చెందినవాడైనా వాడికి శిక్ష పడాలనడం సబబు..అంతే కానీ ముందునుంచే

ఫలానా పార్టీ..ఈ పార్టీ ఆ పార్టీ అంటూ పార్టీలకు అంటగట్టే ఆ రెండు ఛానళ్లకి ఇది చెప్పుతో కొట్టినట్లు రివర్స్ అయింది 


మరోవైపు పేరుగొప్పు ఊరు దిబ్బ ఈనాడు పేపర్ కూడా లోపల పేజీల్లో వాడు టిడిపి లీడర్ అని రాయకుండా  పెద్ద మేధావితనం ప్రదర్శించింది. సిగ్గుండాలి జర్నలిజం విలువల గురించి మాట్లాడటానికి వీళ్లు


ఇంకో పేపర్ అయితే అసలు దాని గురించి ప్రస్తావనే లేకుండా.. తన బురద జల్లడంతో బాగా బిజీ అయిపోయింది

Comments

  1. >>ఇంకో పేపర్ అయితే అసలు దాని గురించి ప్రస్తావనే లేకుండా.. తన బురద జల్లడంతో బాగా బిజీ అయిపోయింది

    As usual

    ReplyDelete

Post a Comment