ఇది కదా రైతుల దెబ్బ అంటే...! మోదీ అనబడు ఓ ప్రధానమంత్రినే నిలబెట్టేశారు..ఢిల్లీకి పంపించేశారు

 


ఘోర  అవమానం...అసలు ఓ ప్రధానమంత్రిని రోడ్డున నిలబెట్టేయడం అందులోనూ 20 నిమిషాలు..అది కూడా ఉత్తరాదినే..పైగా హై టెన్షన్ ఏరియాలో..ఇలా జరిగింది..అసలు ఇలా జరుగుతుందని ఎప్పుడైనా ఎవరైనా ఏ బిజెపి లీడరైనా అనుకున్నాడా...కానీ జరిగింది పో..ఇప్పుడేమి చేయవలే...

ఏముంది చేయడం కాంగ్రెస్ పై పడి ఏడవవలే..అవసరమైతే..స్టేట్ లో ఎమర్జెన్సీ పెట్టవలె

రెండోదెటూ చేయలేరు..ఎటూ ఎలక్షన్స్ వస్తున్నాయ్ గా

మరేంటి రైతులతో..అన్నదాతలతో అందులోనూ ఉత్తరాది అన్నదాతలతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది కదా

ఉక్కుమనుషులు..రాక్ సాలిడ్ పొలిటీషియన్లు ఎవరైునా సరే రైతులంటే ఎందుకు భయపడాలో తెలిపింది కదా ఈ ఇన్సిడెంట్

లేకపోతే 500మంది రైతులు..ప్రాణాలు ఊరికే చూస్తుంటాయా
దాదాపు ఏడాదిన్నరకి పైగా ఢిల్లీ గేట్ల వద్ద ధర్నా చేసినప్పుడైనా దాని సెగ ఏంటో తెలుసుకోకపోతే ఎలా

అదే కాదు..రైతులపైకి కార్లు ఎక్కించి చంపేస్తే...దాన్ని పట్టించుకోనట్లు ఊరుకుంటే..రైతుల కడుపు మండదా..ఇవాళ జరిగిన ధర్నా కానీయండి నిరసన కానీయండి అది మంచిదో చెడ్డదో...రైతులపైకి కార్లను ఎక్కించిన మినిస్టర్ ని దింపకుండా..అలానే చూస్తూ ఉండటం మంచిది కాదు..అని మాత్రం అర్ధమయ్యే ఉండాలి

మోదీ జీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు..పైగా కాలం వేగం మారింది..ఇప్పుడు చాలా ఫాస్ట్ గా మారిపోతుంది..మన వెడల్పాటి ఛాతీ ఎన్నాళ్లో అలానే ఉండదు సార్
కాస్త చూడండి
చరిత్ర ఎందరినో చూసింది..వర్తమానంలో మనకి మనమే గొప్ప అనుకోవడం సహజం..కానీ చరిత్ర తెలిసినవాళ్లు అనుకోరు సార్..!

ఇక ఇప్పుడు ఎన్ని ట్వీట్లు పెట్టి ప్రయోజనం ఏముంది..ప్రాణాలతో వెళ్లా...నన్ను ఏదో చేయబోయారు..ఈ పాలిటిక్స్ రైతుల దగ్గర కుదరవ్ సార్..ట్వీట్లతో జనం ముందు కాంగ్రెస్ నో...అక్కడి సిఎం చన్నీనో..దోషిని చేద్దామనుకోవద్దు..వాళ్ల పాపం వాళ్లని వెంటాడుతుంది..అదే కోవలో ఎవరినైనా...!

Comments