మో ల్నుపిరవిర్ సురక్షితం కాదా...ఐసిఎంఆర్ బల్రామ్ భార్గవ ఏం చెప్పాడు..ఆ సంస్థకి ఏం అధికారాలున్నాయసలు..?

 




కరోనా వైరస్ ప్రబలిన నాటి నుంచి నేటి వరకూ ఏ మందు ఎక్కడ ఎలా వాడుతున్నారన్న అంశంపై

వాదోపవాదాలు వస్తూనే ఉన్నాయ్. తాజాగా మోల్నుపిరవిర్ అనే ట్యాబ్లెట్ / కాప్స్యూల్ ‌పైనా 

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కూడా అభ్యంతరాలు లేవనెత్తింది. ఆ సంస్థ చీఫ్ బల్రామ్ భార్గవ

మాట్లాడుతూ , మెర్క్స్ కంపెనీకి చెందిన ఈ పిల్ ను నేషనల్ ట్రీట్‌మెంట్ ఫర్ ప్రోటోకాల్‌లో చేర్చలేదని

ప్రకటించారు


ఇప్పుడేం జరుగుతుంది

ఏమీ కొంపలు మునగవు. ఎందుకంటే ప్లాస్మా థెరపీ నుంచి రెమ్‌డెసివర్ వరకూ ఏదీ కూడా మన దేశంలోని

కరోనా ట్రీట్‌మెంట్‌లో ప్రోటోకాల్‌లో భాగంగా చేర్చలేదు. అయినా సరే ప్రవేట్ హాస్పటల్స్‌లో ప్లాస్మా థెరపీ సహా 

అన్ని మందులూ వాడేస్తున్నారు. సరి కదా రెమ్‌డెసివర్‌ 5 రోజుల కోర్సునే బ్రహ్మాండంగా పేషెంట్లకు ఇస్తున్నారు. 

వీటితో వచ్చే సైడ్  ఎఫెక్ట్‌లకు కూడా వాళ్లే డ్రగ్స్ వాడుతున్నారు. 


పైగా ICMR మన దేశంలో ఏ అధికారాలు లేని ఓ సంస్థ. ఇక్కడ ఏ డ్రగ్ వాడకూడదు అని చెప్పే అధికారం దానికి లేదు

CDSCO ఆల్రెడీ ఈ మోల్నుపిరవిర్‌ లాంఛ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. 


" అమెరికాలో అప్రూవ్ చేసిన మోల్నుపిరవిర్ 1433 పేషెంట్లపై వాడగా 3శాతం మందిలో సీరియస్‌నెస్ తగ్గించింది. ఐతే దీని

వాడకంతో కండరాలు దెబ్బతింటాయ్. కణజాలంలో జన్యుపదార్ధం కూడా మారిపోతుంది. గర్భస్థ శిశువుల్లో లోపాలు తలెత్తే

ప్రమాదం ఉంది " ఇదీ బల్రామ్ భార్గవ చెప్పింది యాజ్ ఇటీజ్‌గా..! అంతేకాదు మోల్నుపిరవిర్ కనుక వాడితే, ఆ తర్వాత 3 నెలలపాటు

దంపతులిద్దరూ గర్భనిరోధక సాధనాలు వాడాల్సిందేనంటూ హడలెత్తిస్తున్నారు


తన ప్రకటనతో పాటు ఐసిఎంఆర్ చీఫ్ బల్రామ్ భార్గవ ఏం చెప్పారంటే, అసలు డబ్ల్యూహెచ్ఓ సహా యునైటెడ్ కింగ్‌డమ్ కూడా

ఈ మందును తమ ప్రోటోకాల్‌లో చేర్చవద్దంటూ సలహా ఇచ్చారు


ఐతే ఈ ప్రకటన వచ్చిన నేపథ్యం చూస్తే, రాబోయే వారంలో డా.రెడ్డీస్ సంస్థ ఈ మోల్నుపిరవిర్‌ను ఒక్కో పిల్ రూ.35 ధర పడేటట్లుగా

ఓ ప్యాకెట్ రూ.1400కి విక్రయాలు జరిపేందుకు సిద్ధమైంది. డా.రెడ్డీస్-డీఆర్డీఓతో కలసి లాంఛ్ చేసిన 2డిజి డ్రగ్ సంగతే చూసుకోండి

ఇది క్యాన్సర్ పేషెంట్ల కోసం ఎప్పుడో తయారు చేసింది. దానిపైనా అభ్యంతరాలు ఉన్నాయ్. అసలు 2డిజి డ్రగ్ అయితే మొత్తంగా

క్లినికల్ ట్రయల్స్ చేసింది 500మంది లోపే ఉంటుంది..మరి దానికున్న అభ్యంతరాలు ఉన్నా కూడా కరోనా సెకండ్ వేవ్ సమయంలో

దాన్నో సంజీవినిలాగా అధికార పార్టీ అంతేవాసులు తెగ మోసిన సంగతి గుర్తుతెచ్చుకోవాలి. ఇప్పుడు కూడా ఈ మోల్నుపిరవిర్ విషయంలోనూ

సడన్‌గా అభ్యంతరాలు తెరపైకి వచ్చాయంటే దాని వెనుక మతలబు ఏంటో కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. అంతేకాదు ఇప్పుడు ఈ డ్రగ్ 

మంచిది కాదన్నవాళ్లే దానికి కితాబులు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగని ఈ మోల్నుపిరవిర్ అద్భుత ఔషధం అని 

చెప్పడం మా ఉద్దేశం కాదు. కేంద్రానికే చెందిన CDSCO డ్రగ్‌ విక్రయాలకు లైసెన్స్, ఎమర్జెన్సీ వాడకానికి DCGI పర్మిషన్ ఇవ్వడం ఏంటి..ఇంకో సంస్థ చీఫ్ దాన్ని వ్యతిరేకించడం ఏంటి..జనాలను కన్ఫ్యూజ్ చేయడం కాకపోతే..!


ఇక డాక్టర్ రెడ్డీస్ విషయానికి వస్తే, ఆ సంస్థకి ఈ డ్రగ్ తయారీతో పాటు దాదాపు 100కి పైగా దేశాలకు సరఫరా చేసేందుకు ఒప్పందం ఉంది

అంటే..మేగ్జిమమ్ భారత్‌లో కాకపోతే ఇంకో వంద దేశాలకు సరఫరా చేస్తుంది. ఐసిఎంఆర్ భార్గవ ప్రకటనతో ఆ సంస్థకి వచ్చే నష్టమేం లేదు




 మన దేశంలో మోల్నుపిరవిర్ అనేది ఒక్క డా.రెడ్డీస్ మాత్రమే కాదు మాన్‌కైండ్ ఫార్మా, ఆప్టిమస్ సహా మరో అరడజను కంపెనీలు తయారు చేసి విక్రయించబోతున్నాయ్. ఫెర్మాంటా బయోటెక్ కంపెనీ అయితే ఏకంగా తానో ఎంజైమాటిక్ సింథసిస్‌తో నేచురల్‌గా దాన్ని తయారు చేసానని..పేటెంట్ కోసం కూడా అప్లై చేసానని గత  ఏడాది జులైలో హడావుడి చేసింది..మరి వీటి బిజినెస్ ఏమైనా దెబ్బతింటుందా..లేదు ..అందులోనూ మన దేశంలో ఇతర దేశాల్లో నిషేధిత పెయిన్ కిల్లర్లు, కాఫ్ సిరప్పుల వ్యాపారమే వేలకోట్లలో జరుగుతుంటుంది కాబట్టి ఈ కంపెనీలకు తక్షణం వచ్చే ఢోకా లేదు. ఓ వేళ కేంద్రప్రభుత్వమే కల్పించుకుని ఈ డ్రగ్ ఏ రూపంలోనూ దేశంలో కన్పించకూడదు అని ఆదేశాలు ఇస్తే తప్ప..అది జరుగుతుందా..

Comments